అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు సంగీత ప్రియుల్ని తమ గాన మాధుర్యంతో అలరించిన గత తరం గాయకులు ఒకరొకరుగా తరలిపోతున్నారు.
ఆ స్వరాలు క్రమంగా మూగబోతున్నాయి.
తెలుగు చిత్రగీతాల్లో మెలోడీని విలక్షణంగా పలికించిన స్వరం పి. బి. శ్రీనివాస్ గారిది.
నేడు ఆ స్వరం మూగబోయింది.
ఆయన గాయకుడే కాదు కవి కూడా !
ఎనిమిది భాషల్లో నిష్ణాతుడు.
వివిధ బాషలలో ఆయన వ్రాసిన గీతాలు రెండు లక్షల పైన వుంటాయి.
నేడు ఆ కలం ఆగిపోయింది.
నిరంతర సంగీత, సాహిత్య సాధకుడు పి. బి. ఎస్.
నేడు ఆ సాధన నిలిచిపోయింది
తెలుగు రంగం సరిగా గుర్తించకపోయినా కన్నడ రంగం నెత్తి మీద పెట్టుకుంది.
ఆయన ఆవిష్కరణలు, పరిశోధనలు, వాటికోసం ఆయన తపన, పడిన శ్రమ.... మొదలైన వివరాలతో తన అంతరంగ కథనాన్ని శిరాకదంబం పత్రిక ద్వారా వినిపించడానికి ఉత్సాహపడ్డారు. ఇంకో రెండురోజుల్లో ఆ రికార్డింగ్ జరుగవలసి వుంది.
ఈ లోపు ఈ విషాద వార్త.
Vol. No. 04 Pub. No.074

అమరలోకాలలో తన అద్వితీయ గానాన్ని వినిపించడానికి
తన కవితాసుధలను అక్కడి దేవతలకు పంచడానికి
పయనమైన పి. బి. శ్రీనివాస్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ...
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No.074
No comments:
Post a Comment