Saturday, June 30, 2012

తొలి ఏకాదశి.... గురు పూర్ణిమ....

 ఆషాఢ మాసం వచ్చింది. పండగలన్నిటికీ తొలి మెట్టయిన ' తొలి ఏకాదశి ', అందరికీ గురువైన వ్యాస మహర్షి జన్మదినంగా చెప్పుకునే ' గురు పౌర్ణిమ ' లేదా ' వ్యాస పౌర్ణిమ ' చెప్పుకోదగ్గ పండుగలు. ఆ విశేషాలు.....
త్వరలో తొలి వార్షికోత్సవం జరుపుకోబోతున్న ' శిరాకదంబం ' వెబ్ పత్రిక లో ప్రారంభించనున్న నూతన శీర్షికల ప్రకటన .......
ఇంకా.....   




Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 146

Sunday, June 24, 2012

శ్యామసుందరా ..... పెద్దిభొట్ల వారి ' పుట్ట ' ..... చలం ' ఋషులు - యోగులు ' ...... ఇంకా .....


అనివార్య కారణాల వలన ఈ సంచిక విడుదలలో ఆలస్యం జరిగింది. 
శిరాకదంబం పాఠకులు / వీక్షకులు సహృదయంతో అర్థం చేసుకుని ఆదరించగలరని ఆశిస్తూ.....  

ఈ సంచికలో ............... 




Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 03 Pub. No. 145

Friday, June 15, 2012

మెహది హసన్ ఘజల్..... హిమవాద్య సంగీతం.....

సిద్ధార్థుడు బుద్దుడిగా మారిన వైనం ఏమిటి ?
జూన్ 13 వ తేదీన పరమపదించిన ఘజల్ గంధర్వుడు మెహది హసన్ ఘజల్, 
కాదేదీ సంగీతానికి అనర్హం .....
ఇలా ఘనీభవించి అలా కరిగి నీరైపోయే మంచుతో వాయిద్యాలు తాయారు చెయ్యడం, వాటి మీద సంగీతం పలికించడం సాధ్యమేనా ? చదవండి..... చూడండి.

ఇంకా......

మెహది హసన్ ఘజల్..... హిమవాద్య సంగీతం.....




Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 03 Pub. No. 144

Tuesday, June 12, 2012

తెలుగు తెరకు మాటలు నేర్పిన ఘనాపాఠీ

 హనుమంతప్ప మునియప్ప రెడ్డి......
ఆయనే హెచ్. యమ్. రెడ్డి
భారతీయ తెరకు మాటలు నేర్పిన ఘనుడు అర్దేషీర్ ఇరానీ అయితే
ఆయన దగ్గర శిక్షణ పొంది తెలుగు తెరకు.... ఆ మాటకొస్తే దక్షిణ భారత తెరకు మాటలు నేర్పిన ఘనాపాఠీ. మాటలే కాదు శాస్త్రం, వ్యాకరణం..... అన్నీ నేర్పారు. 
నిండైన విగ్రహం, కోరమీసాలు.. చూడగానే పోలీసేమో అనిపించే భీకరమైన రూపం.
ఆయన నిజంగానే పోలీసు ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తూ , సినిమా అంటే ఆసక్తి తో ఉద్యోగం మానేసి బొంబాయి చేరి లైట్ బాయ్ గా సినీ జీవితం ప్రారంభించారు.
అలా అట్టడుగు స్థాయినుంచి ప్రారంభించిన ఆయన జీవితం సినిమా ప్రక్రియలోని అన్ని అంశాలను మూకీ రోజుల్లోనే క్షుణ్ణంగా నేర్చుకుని టాకీలకు స్వాగతం పలికింది.
తొలి భారతీయ టాకీ సృష్టికర్త అర్ద్రేషిర్ ఇరానీ దగ్గర ఆ మెలుకువలు కూడా నేర్చుకుని
 " మనమూ తీస్తామయ్యా మాట్లాడే సినిమా " అన్నారు.

అలాగే ఇరానీ సంస్థ ఇంపీరియల్ ఫిల్మ్స్ కోసం అటు తమిళంలో ' కాళిదాసు ', ఇటు తెలుగులో ' భక్త ప్రహ్లాద ' నిర్మించారు. అప్పట్లో సినిమాల మీద అవగాహన లేని సురభి నాటక సమాజానికి నచ్చజెప్పి, ఒప్పించి బొంబాయి తీసుకెళ్ళి ఆ చిత్రం నిర్మించారు.
అలా ' భక్త ప్రహ్లాద ' తో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం 1960 లో ' గజదొంగ ' చిత్రం నిర్మాణ దశలో ఉండగానే ఆగిపోయింది.
హెచ్. యమ్. రెడ్డి గారి స్కూల్ నుంచి ఎంతో మంది నటీ నటులు, సాంకేతిక నిపుణులు తయారయి తర్వాత కాలంలో లబ్ద ప్రతిష్టులయ్యారు.
ఆయనకు చిన్నా పెద్దా బేధం లేదు. చిన్న కళాకారుడైనా, సాంకేతిక నిపుణుడి నైనా తనతో సమానమైన స్థాయిలో చూడగలిగే ఉన్నతమైన వ్యక్తిత్వం ఆయనది.

దానికో ఉదాహరణ... 

ఇప్పటి చెన్నై... అప్పటి మద్రాసులో కోడంబాక్కం ఫ్లై ఓవర్ నిర్మించడానికి ముందు ఆ ప్రాంతమంతా చిట్టడవిలా ఉండేది. కొంతవరకూ కంకర రోడ్డు, ఆ తర్వాత అది కూడా ఉండేది కాదు. ఆ చివర ఎక్కడో ఉన్న తన ' రోహిణీ స్టూడియో ' కు ఆయన తన ' ఓల్డ్ మొబైల్ కార్ ' లో వెళ్ళేవారు. రైల్వే గేటు దాటి పట్టపగలే జనసంచారం ఉండని ఆ రోడ్డులోకి రాగానే ఆయన కారుని నెమ్మదిగా పోనిమ్మని డ్రైవర్ కి చెప్పేవారు. ఆ దారిన ఎవరైనా నడిచి వెడుతుంటే కారు ఆపి అతన్ని పలకరించి, ఎక్కడవరకూ వెడుతున్నాడో కనుక్కుని కార్ ఎక్కించుకునేవారు. ఆ రోడ్డులో ఎక్కువగా స్టూడియో లే ఉండడం వల్ల సినిమా రంగంలో పని చేసేవారే ఎక్కువగా వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళాలో కనుక్కుని వాళ్ళని అక్కడ భద్రంగా దింపే వారు. ఇలా అందర్నీ ఎక్కించుకునే సరికి ఆ కార్ కిక్కిరిసి పోయేది.
వీళ్ళని చూసి ఎవరైనా ' ఎవరండీ వీళ్ళు ? మీ క్రింద పని చేసే వాళ్ళా ? ' అనడిగితే
' అబ్బే ! వీళ్ళందరూ నా క్రింద పని చేసేవాళ్ళు కాదండీ ! నాతో కలసి పని చేసేవాళ్ళు ' అనేవారు.
ఇదీ ఆయన కార్మికులకు ఇచ్చిన మర్యాద. ఇప్పుడు సాధ్యమా ?

ఇంకో సంఘటన.... 

' ప్రతిజ్ఞ ' చిత్రంలో మహారాజు పాత్రకు పొదిలి కృష్ణమూర్తి అనే నటుడిని తీసుకున్నారు. మొదటి రోజు షూటింగ్. ఆ నటుడు ఎంత ప్రయత్నించినా సరిగా నటించలేకపోయాడు. దానికి తోడు రెడ్డి గారిని చూడగానే కంగారుతో చెమటలు పట్టేస్తున్నాయి అతనికి. ఈ అవస్థ గమనించిన రెడ్డి గారు అతనితో ' కృష్ణమూర్తీ ! ఇక చాల్లే ! సాయింత్రం ఆఫీసులో కలువు ' అన్నారు. ఇక ఈ ఉద్యోగం ఊడిపోయినట్లే అనుకున్నాడు ఆ నటుడు.
సాయింత్రం రెడ్డి గారిని ఆఫీసు లో కలిసాడు. ' మిస్టర్ కృష్ణమూర్తీ ! నువ్వు సరిగా చెయ్యలేకపోయావు. ఈ వేషానికి ఇంకో నటుడిని తీసుకోవాలి. తప్పదు. నువ్వు దానికి అంగీకరించాలి. అయితే ప్రతీ నెలా పదవ తారీకుకి వచ్చి నీ జీతం మాత్రం తీసుకెళ్ళాలి. ' అన్నారు. అప్పటినుంచి ఆ నటుడు నటించకుండానే ఆరు నెలల పాటు ఆ జీతం తీసుకున్నాడు.

అదీ హెచ్. యమ్. రెడ్డి గారి వ్యక్తిత్వం.

ఆయన తెలుగు తెరకు మాటలే కాదు. అప్పటి తరం సినిమా వాళ్లకి తన పనితనంతో బాటు తన వ్యక్తిత్వం కూడా నేర్పారు. అందుకే ఆ యుగం స్వర్ణయుగం గా విలసిల్లిందేమో !  

తెలుగు చలనచిత్ర పితామహుడు హెచ్. యమ్. రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ....

 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 143

Thursday, June 7, 2012

నటరాజు .... రైతుజన బాంధవుడు....యాజ్ఞసేని.....

  నటరాజ తాండవం ఆగి సంవత్సరం గడిచిపోయింది.
ఆ సందర్భంగా ఆంధ్ర నాట్య పితామహుడు నటరాజ రామకృష్ణ గారిపై ప్రత్యేక వ్యాసం....
ఒకప్పటి రేడియో శ్రోతల్ని అలరించిన చలం గారి కలం నుంచి వెలువడిన ' పురూరవ ' రేడియో నాటకం......
ఒక స్త్రీ గురించి... ఒక స్త్రీ రచించి.... మరో స్త్రీ అనువదించిన అద్భుత నవల ' యాజ్ఞసేని ' పరిచయం......
ఇంకా............



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 142

Friday, June 1, 2012

శ్రీ గాయత్రి మాత.. బుద్ధ చరితం.... ప్రహ్లాద భక్తి విజయం.... ఇంకా ......

శ్రీ గాయత్రీ మాత, బుద్ధ చరితం, త్యాగరాజ విరచిత ' ప్రహ్లాద భక్తి విజయము ' సంగీత రూపకం.... ఇంకా ఎన్నో సాహితీ సుమాలు, మరెన్నో సామాజికాంశాలు, జ్ఞాపకాల కదంబం .... ఇలా వైవిధ్య భరితం.... 
ఆస్వాదించండి....  

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 142
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం