చందమామ రావే !
జాబిల్లి రావే !!
అని చిన్నప్పుడు పాడుకున్నాం. మరి ఇప్పటి పిల్లలు పాడుకుంటూ ఉన్నారో , లేదో తెలీదు. కానీ మన శాస్త్రవేత్తలు మాత్రం మనకు చందమామని అందించేసే ప్రయత్నాల్లో ముందడుగు వేసారు. ఏకంగా చందమామ మీద మనకు కాలనీలు కట్టించేస్తారుట ! ఇప్పటివరకూ చందమామ మనకు చుట్టమనేది కవుల కల్పనలోనే అనుకుంటున్నాం !! కల్పన కాదని నిజంగానే చందమామ మనకు దగ్గర చుట్టమని తేల్చేసారు మన శాస్త్రవేత్తలు . అగ్ర దేశాలు గత నలభై, యాభై సంవత్సరాలుగా అనేక ప్రయోగాలుచేసినా నిర్థారించలేకపోయిన విషయాన్ని మన ప్రయోగం సాధించడం గర్వకారణమే !!! శాస్త్ర పరిజ్ఞానం ఇంత అభివృద్ది చెంది, స్వయంగా గ్రహాలను, గతులనూ పరిశీలించే అవకాశాలున్న ఈ రోజుల్లో ఈ మాత్రం సాధించినందుకే పొంగిపోతున్నాం ! 'ఈ మాత్రం' అని ఎందుకన్నానంటే ఏ సదుపాయాలు లేని రోజుల్లోనే గ్రహగతుల్ని ఖచ్చితంగా అంచనా వెయ్యడంలో, వాటిని ఆధారం చేసుకుని భవిష్యత్తు దర్శనం చెయ్యడంలో మన దేశం ప్రాచీనకాలంలోనే ముందంజలో ఉంది. ఈ విషయం ఎవ్వరూ కాదనలేని సత్యం. 'అన్నీ వేదాల్లో ఉన్నాయష ' అనే డైలాగుని వెటకారం చేసే వాళ్ళను మనమేం చెయ్యగలం... అంతరిక్ష పరిశోధనలో ప్రపంచానికే దారి చూపించిన ప్రస్తుత మన శాస్త్రవేత్తల పరిజ్ఞానాన్ని చూపించడం తప్ప. తల్లిదండ్రులందరూ ఇప్పటికైనా మన ప్రాచీన విజ్ఞాన చరిత్ర మీద తమ పిల్లలకి అవగాహన కలిగేటట్లు చేస్తే మన దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనటంలో సందేహం లేదు.
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
No comments:
Post a Comment