Wednesday, October 3, 2012

కళాకారుడికి కావలసినది... చలం గారి లేఖ

కళాకారుడికి కావల్సినది ఏమిటి ?
మనలో నిగూఢం గా దాకొన్న భావాలన్నీ నిశ్శంకోచం గా బయట పెట్టగలిగే కళా ?
మనం చేయలేనివన్నీ చేసి చూపించే చాక చక్యమా ?
మన జీవితాన్నంత టినీ చిన్ని తెర మీద ఆవిష్కరించే నేర్పా ?
అమృతం జాలువార్ఛే గాత్రమా ?


ఎస్. నారాయణస్వామి గారి రంగుటద్దాల కిటికీ కథా సంపుటి నుండి లలితాస్రవంతి చేసిన ' కళాకారుడికి కావలిసినది ' కథా పరిచయం ... 27 వ పేజీలో..... 



చలం గారు అరుణాచలం వెళ్ళే వరకూ ఆయనకు వెన్నుపోట్లు, ముందుపోట్లు పొడిచి తనువూ, మనసూ గాయపరచిన వారు-- చలం పిరికివాడై అరుణాచలం వెళ్ళాడు అని వూపిరి పీల్చుకున్నారు. వీరిలో కుకవులే ఎక్కువ !
.... చలం గారు అరుణాచలం నుండి శ్రీ జలసూత్రం వారికి అనేక లేఖలు వ్రాశారు.
టి. వి. యస్. శాస్త్రి గారు అందించిన ' నాకు నచ్చిన చలం గారి లేఖ ' ... 19 వ పేజీ ( స్లైడ్ ) లో....


ఈ క్రింది లింకులో..... 

శిరాకదంబం_02  / 007
 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 022

వీరరసం....దుర్వాస శాపం....

 దైనందిక జీవితంలో ఎదురయ్యే ప్రతీ చిన్న ఆటంకాన్ని ఎదుర్కోవడానికి కావాల్సింది వీరత్వమే ! 
ధీరత్వం వున్నవారు ఉత్సాహంతో ఉరకలేస్తారు.
.... నాట్యకళలో వీర రసం గురించి మాధురీకృష్ణ వివరణ.... 15 వ పేజీలో.....


 
“ అతిధులను అవమానించుదానా ! ఏకాగ్రమైన మనస్సుతో నీవు ఎవ్వరిగురించి ఆలోచించుచున్నావో అతడు నీవెంత గుర్తు చేసినను మత్తెక్కినవాడ్ను లోగడ మాట్లాడిన మాటను మరిచిపోవునట్లు నిన్ను మరిచిపోవునుగాక ! ”.
..... అని దుర్వాస మహర్షి శకుంతలకు శాపం ఎందుకు ఇచ్చారో వివరిస్తున్నారు ఎర్రమిల్లి శారద కాళిదాస విరచిత ' అభిజ్ఞాన శాకుంతలం ' పరిచయంలో... 

18 వ పేజీలో.....

..... ఈ క్రింది లింకులో

శిరాకదంబం_02  / 007 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 021

Tuesday, October 2, 2012

ఇద్దరు మహనీయులు

ఈరోజు భారతజాతి తప్పక గుర్తు చేసుకోవాల్సిన రోజు.
ఇద్దరు మహనీయుల పుట్టినరోజు.
ఒకరు సత్యాగ్రహం, అహింస ఆయుధాలుగా భారత జాతి విముక్తికై కృషి చేసిన వారయితే,
మరొకరు నీతి నిజాయితీలే సిద్ధాంతాలుగా భారత దేశ అభ్యున్నతికి తపించినవారు....

వారే...... మహాత్మా గాంధీ                                                                           ..... లాల్ బహదూర్ శాస్త్రి
కనీసం వారి జన్మదినం రోజయినా తలుచుకోవడం, భావితరాలకు తెలియజెప్పడం భారతీయులుగా మన కర్తవ్యం.

 గాంధీజీ, శాస్త్రీజీ లకు నీరాజనాలు అర్పిస్తూ..... 


గతంలోని టపాలు......

మహాత్ముడే కలలుగన్న మరోప్రపంచం
మహాత్ముడి స్మరణ
గట్టి ప్రధాని
భలే తాత మన బాపూజీ !


Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 04 Pub. No. 020
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం