Saturday, July 6, 2019

దక్షిణాఫ్రికా లో గాంధీ స్మృతి 'ఆనందవిహారి '... తేనెతెలుగు బాలసాహిత్యం..... గోపావఝుల వారి ' తో. లే. పి. '.... ఇంకా....

* వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అంటే ఏమిటి? వ్యాస మహర్షి జననం, జీవితం గురించిన అనేక విశేషాలను ' గురుపూర్ణిమ ' లో......

* అక్కడ సాక్షాత్తు ఆ ప్రవచనాన్ని వినడానికి శ్రీ ఆంజనేయ స్వామి వారు విచ్చేశారా అన్న ఆనందానుభూతి కలిగి, ఆ స్పందన తో శ్రోతలందరి కళ్ళవెంబడి అప్రయత్నం గా అశ్రుధారలు !!! నిజం గా ఈ అనుభూతి అనుభవైకవేద్యమనే అని చెప్పాలి.... ' తో. లే పి. ' లో......
* “ బాలసాహిత్యం తీయని మామిడిపండులా ఆపాతమధురంగా ఉండాలని, భాష సరళంగా, లలితంగా ఉండాలని, పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు ఉండాలని ” డాక్టర్ దాశరధిగారు చెప్పారు.... ' తేనెతెలుగు బాలసాహిత్యం 'లో.....
* గాంధీజీ రైల్వే ప్లాట్‌ఫామ్ మీదకు నెట్టివేయబడిన సంఘటన వార్షికోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికా సందర్శన విశేషాలు ... సప్నా వీణ ఉత్సవాలు, వాగ్గేయకారోత్సవం, గురువాణి విశేషాలు.... ' ఆనందవిహారి ' లో.....
ఇంకా.... చాలా.... ఈ క్రింది లింక్ లో.......
శిరాకదంబం 08_008 


Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 10 Pub. No. 005

Tuesday, May 7, 2019

సుబ్బరాయుడి రహస్య జీవితం....రైలు కూత...పదకవితా పితామహుడు... ఇంకా...


 * సుబ్బారాయుడు మనలో ఒకడు. నిజానికి మనందరమూ సుబ్బారాయుళ్లమే. మనకి ఉన్న శక్తి సామర్ధ్యాలకి, తగిన స్థాయి, సామాజికపరంగా, ఉద్యోగ / వృత్తి / వ్యాపారపరంగా, ఆర్ధిక పరంగా మనలో చాలామందికి లభించదు.- ' కథావీధి ' శీర్షికన ' త్రిపుర కథలు ' పరిచయంలో " సుబ్బారాయుడి రహస్య జీవితం ".
* కోటప్ప కొండ తీర్ధానికి వెడితే అక్కడ తప్పిపోయి ఏడుస్తూ ఉంటే చాలాసేపు వాడి వాళ్ళకోసం వెదికి ఎవ్వరు దొరక్క రెండేళ్ళ వయస్సు ఉన్న వాడిని తమకే తిండికి కష్టంగా ఉంటే మళ్ళీ వీడు కూడా భారమే కదా అని కూడా సంశయించకుండా ఎత్తుకొని ముద్దాడి ఏడుస్తున్న వాణ్ణి సముదాయించి తనతో తీసుకొచ్చి ఆ స్వామి పేరే పెట్టుకొని పెంచుకుంటున్న ముసలయ్యకి వాడు భారం కాదు.
- " రైలు కూత " కథ.
* సకల సృష్టి స్థితి కారుకుడైన శ్రీనివాసుని తన జీవితసర్వస్వంగా భావించి, తన కీర్తనామృతధారలతో స్వామిని కూడా పరవశింపజేసిన మహాభక్తుడు అన్నమయ్య. ఆంధ్రభాషకు 32 వేల సంకీర్తనలనే అపూర్వ రత్నాలందించిన అన్నమయ్య క్రీ.శ.1503 లో విశ్వాంతర్యామి అయిన వేంకటేశ్వరునిలో అంతర్లీనమయ్యాడు.
- ' అన్నమయ్య ' జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం " పదకవితా పితామహుడు "
* తెలుగు పాట పుట్టుక ముందు వెనుకల గురించి సమగ్రమయిన పరిశోధన చేసిన వారు అతి కొద్ది మంది ఉన్నారు. వారిలో అమలాపురం కి చెందిన శ్రీ పి. ఎస్. రెడ్డి గారు ఒకరు. డా. పైడిపాల గా పేరు తెచ్చుకున్న వీరు ఈ రంగం లో అవిరళకృషి చేసారు.
- ' తో.లే.పి. ' శీర్షికన " డా. పైడిపాల "
ఇంకా చాలా ........ ఈ క్రింది లింక్ లో......
శిరాకదంబం 08_007 
 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 10 Pub. No. 004

Tuesday, October 23, 2018

బాలకదంబం... కథావీధి - పాము, కొంగజపం... ఇంకా చాలా...

 ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ లో వచ్చే ' బాలల దినోత్సవం ' సందర్భంగా ' శిరాకదంబం ' పత్రిక " బాలకదంబం - 2018 " పేరుతో ప్రత్యేక సంచిక ను రూపొందిస్తోంది. ఇందులో 16 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికలు పాల్గొనవచ్చును. ' రచన ', ' కళాభిరుచులు ', ' ప్రతిభ ' మొదలైన అంశాలలో పాల్గొనవచ్చును.
పూర్తి వివరాల కోసం ఈ లింక్ లో చూడండి  -
https://sirakadambam.com/home/balakadambam2018-announcement/ 

చివరి తేదీ : 05 నవంబర్ 2018.
దసరా, ఏకాదశ రుద్రీయమ్, కథావీధి - పాము, కొంగజపం..... ఇంకా చాలా.... ఈ క్రింది లింక్ లో.....

శిరాకదంబం 08_003


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 10 Pub. No. 003
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం