Saturday, October 8, 2016

అమృత కలశం.... మాతృభాష తెలుగమ్మా ! .... బాలకదంబం 2016.... ఇంకా .....

 ' అయ్యవారికి చాలు అయిదు వరహాలు... పిల్లవాండ్రకు చాలు పప్పుబెల్లాలు ' అని పాడుతూ గురువు గారి వెంట వివిధ వేషాలు, బొమ్మ ఆయుధాలను చేబూని ఇంటింటికీ తిరిగే పిల్లల్ని చూస్తుంటే - అందులో గురువుగారి మీద భక్తితో బాటు సమిష్టితత్వం, దుష్ట శిక్షణ... శిష్టరక్షణ అంతర్లీనంగా బోధిస్తున్నట్లు ఉండేది గతంలో. ఇప్పుడా సంప్రదాయం దాదాపుగా కనుమరుగయిపోయింది. పండుగ అంటే సెలవలు, సినిమాలు, మొబైల్ గేమ్స్ ఆడుకోవడం వంటి వాటికే పరిమితమైపోయింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారయ్యాయి పరిస్థితులు. మళ్ళీ ఆ సంప్రదాయాలు పునరుద్ధరిస్తే మనుష్యులలో ఐకమత్యానికి బాటలు పడతాయి. తరతమ బేధాలు సమసిపోతాయి. చదువు పట్ల, దేశక్షేమం పట్ల శ్రద్ధ పెరిగి కార్యోన్ముఖులవుతారు. ఆయుధపూజ విశిష్టత కూడా తెలుస్తుంది.
' బాలకదంబం 2016 ' గడువు సమీపిస్తోంది. మీ పిల్లల్ని, మీ బంధువుల, స్నేహితుల పిల్లల్ని ప్రోత్సహించండి.

దసరా శుభాకాంక్షలతో..... తాజా సంచిక ఈ క్రింది లింక్ లో....
శిరాకదంబం 06_003

 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 003

Wednesday, September 21, 2016

పోతన... పూలూ పడగలు...భలే చవితి పండుగ... ఇంకా....

 * తెలుగు వారికి భాగవతామృతాన్ని పంచిన ' పోతన ' గారి గురించి....
* సుబ్రహ్మణ్య షష్టి కి సమర్పించే ' పూలూ - పడగలు ' కోనసీమ కథల్లో....
* చిన్నప్పటి చవితి పండుగ జ్ఞాపకాలు ' భలే చవితి పండుగ '....
* చెన్నైలో ' శ్రీ త్యాగరాజర్ ' నాటక ప్రదర్శన విశేషాలు, తెలుగు ప్రాచీన భాష హోదా పై నెల నెలా వెన్నెల,       బాలాంత్రపు నళినీకాంతరావు గారి శతజయంతి కార్యక్రమ విశేషాలు, హైదరాబాద్ లో ' మాలతీచందూర్ పురస్కార  ప్రదానోత్సవ విశేషాలు.... " ఆనందవిహారి " లో...

ఇంకా ఎన్నో.... ఈ క్రింది లింక్ లో....
శిరాకదంబం 06_002


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 002

Thursday, August 18, 2016

పంచమ స్వరం

 అయిదు సంవత్సరాల ప్రస్థానం నుంచి ' పంచమ స్వరం ' పలికింది.'
శిరాకదంబం ' అయిదవ జన్మదిన ప్రత్యేక సంచిక ' పంచమ స్వరం ......తెలుగు భాష, సాహిత్యం, కళా వైశిష్ట్యం, ఆథ్యాత్మికత, సామాజికత అనే అయిదు అంశాలలో... ఆసక్తికరమైన విషయాలను అందించే అద్భుతమైన రచనలను అందిస్తోంది.
ఈ క్రింది లింక్ లో చదివి, ఆయా వ్యాసాలపైన, ప్రత్యేక సంచిక పైనా మీ అమూల్యమైన అభిప్రాయాలను ఆ సంచిక క్రిందనే ఉండే వ్యాఖ్యల పెట్టె ( comment box ) లో గానీ, editorsirakadambam@gmail.com కి గాని పంపించండి.

' పంచమ స్వరం ' ప్రత్యేక సంచిక లింక్....

శిరాకదంబం 06_001

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 001
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం