Wednesday, January 14, 2015

భోగి పండుగ

' స్వచ్చ భారత్ ' కి అసలు సిసలైన ఉదాహరణ భోగి మంటలు. సంవత్సర కాలంగా మనింట్లో పేరుకుపోయిన పనికిరాని కలప ను భోగి నాడు మంటలో కాల్చి ఎముకలు కోరికే చలి నుంచి రక్షణ పొందడమే కాకుండా ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకుంటాము. వాటితో బాటు ఆవు పేడ తో చేసిన గొబ్బెమ్మలను పూజ అనంతరం పిడకలుగా మార్చి, ఆ మంటలో దహనం చెయ్యడం వలన ' ఆరోగ్య భారత్ ' కూడా అవుతుంది.  
  
బ్లాగ్మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ......


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 13

Thursday, January 1, 2015

కె. బాలచందర్... ' బాలు ' ని అంతరంగం... మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తే.... ఇంకా చాలా....

 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలతో .....

ప్రముఖ చలనచిత్ర దర్శకులు కె. బాలచందర్ గారు ఇటీవలే స్వర్గస్తులయ్యారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ... ఆయన వ్రాసిన ఒక తో. లే. పి. .......
బాలసుబ్రహ్మణ్యంగారు ఆవిష్కరించిన ఆయన అంతరంగ కథనం " ' బాలు ' ని అంతరంగం ".......
పిల్లల మనసు స్వచ్ఛమైనది. వారి చేతికి కలం ఇస్తే వ్రాత మీద ఆసక్తి పెరగవచ్చు. కత్తి ఇస్తే మన నుదుటి వ్రాత తుడిచెయ్యవచ్చు. " మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తుంటే.... " లఘుచిత్రం ......
ఇంకా చాలా ....  ఈ క్రింది లింక్ లో....

శిరాకదంబం 04_011



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No.012

Friday, December 19, 2014

ఎస్వీయార్.... సంగీతగని...బొబ్బిలియుద్ధం... ఇంకా

గిడుగు వారు ప్రారంభించిన వ్యవహరిక భాషోద్యమాన్ని అందిపుచ్చుకుని, ఆ బాటలో మరింత ముందుకెళ్లడానికి కృషి చేసిన ప్రముఖ రచయిత, పాత్రికేయుడు పురిపండా అప్పలస్వామి గారు మహాకవి శ్రీశ్రీ ని ప్రపంచానికి అందించారు. 1982 నవంబర్ 18 వ తేదీన పురిపండా వారు మరణించినప్పటి స్పందనే ' నవతకు ఎత్తిన జెండా '

గంభీరమైన రూపం, వాచకం, అభినయం ఆయన సొత్తు. తెలుగు చిత్ర రంగానికి ఆయనే యశస్వి ఎస్వీయార్. అనితర సాధ్యమైన, విలక్షణమైన శైలి ఆయన స్వంతం. తో. లే. పి. లో ' ఎస్వీ రంగారావు '.

ఇటీవల దివంగతులైన కర్ణాటక సంగీత దిగ్గజం నేదునూరి కృష్ణమూర్తి గారు తన గురువు డా. శ్రీపాద పినాకపాణి గారి గురించి చెప్పిన సంగతులు... గతంలో జరిపిన ఇంటర్వ్యూ నుంచి.....' సంగీతగని - పినాకపాణి '  

ఈ నెలలోనే స్వర్ణోత్సవం జరుపుకున్న చిత్రం ' బొబ్బిలియుద్ధం '

ఇంకా .... ఎన్నో ఈ క్రింది లింక్ లో....

శిరాకదంబం 04_010
 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 011
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం