ఈ ఆదివారం ( 06 -12 -2010 ) చెన్నైలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆధ్వర్యంలో ఆయన సతీమణి స్థాపించిన " ఆశ్రమం " పాఠశాల ఇరవయ్యవ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఆ సందర్భంగా రజనీకాంత్ దంపతులు వివిధ రంగాలలోని ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ దర్శకులు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారిని " భీష్మ " పురస్కారంతో సత్కరించడం జరిగింది. విశ్వనాథ్ గారు స్పందిస్తూ రజనీకాంత్ గారితో ఒక్క చిత్రాన్ని కూడా తియ్యకపోయినా ఆయననుంచి ఈ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా వుందని అన్నారు. దానికి రజని ప్రతిస్పందిస్తూ సాగరసంగమం నిర్మాణ సమయంలో ఎయిర్ పోర్ట్ లో కలిసినపుడు విశ్వనాథ్ గారు తనకు ఒక చిత్రం చెయ్యాలని అడిగారని, అయితే అప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఆది సాధ్యం కాలేదని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా ఇప్పటికైనా ఆలస్యం కాలేదని, ఇప్పుడు కూడా ఆయన తలచుకుంటే తాను సిద్దమనీ అన్నారు రజని. విశ్వనాథ్ గారినుంచి వెంటనే ఏ విధమైన ప్రతిపాదనా రాకపోయినా సభికులు మాత్రం తమ కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు.
ఇంకా క్రికెట్ రంగంలో పద్మశ్రీ శ్రీనివాస రాఘవన్ కు, చిత్ర రంగంలో స్క్రీన్ ప్లే, దర్శకత్వాలలో 'వియత్నాం వీడు' సుందరం కు, సంగీతంలో టి. వి. గోపాలక్రిష్ణన్ కు, వైద్య రంగంలో డా. బాలసుబ్రమణ్యన్ కు, వేద సంస్కృతికి అభిరామన్ కు రజనీకాంత్ దంపతులు 'భీష్మ' పురస్కారాలు అందజేశారు, ప్రముఖ నటి రాజసులోచనకు శివాజీ గణేశన్ పురస్కారం కూడా అందజేశారు.
ధర్మేంద్ర, హేమమాలిని జంటకు రజనీకాంత్ లెజెండరీ పురస్కారం అందజేశారు.
ఈ సమాచారం, ఫోటోలు పంపినవారు : మాధురి , చెన్నై.
ఈ సందర్భంగా గురువుగారు విశ్వనాథ గారికి అభినందనలు తెలుపుతూ.... ఈ సమాచారం పంపిన మాధురి గారికి ధన్యవాదాలు.
ఆ ఉత్సవ చిత్రమాలిక ఇక్కడ చూడండి.
Vol. No. 02 Pub. No. 078
Wednesday, December 8, 2010
" భీష్మ" పురస్కారాల ప్రదానం
లేబుళ్లు:
సభలు - సమావేశాలు
Tuesday, December 7, 2010
పాశ్చాత్య కర్ణాటక భాగవతార్
లలిత సంగీతమైనా, సినిమా సంగీతమైనా, మరో సంగీతమైనా అన్నిటికీ శాస్త్రీయ సంగీతమే పునాది. అది పాశ్చాత్యమైనా, భారతీయమైనా, అందులో మళ్ళీ హిందుస్తానీ అయినా, కర్ణాటకమైనా ..... మరేదైనా శాస్త్రీయత లేని సంగీతం మనడం కష్టం. చివరికి జానపదంలో కూడా దానికి చెందిన శాస్త్రీయత వుంటుంది. శాస్త్రీయ సంగీతాన్ని భక్తితో, నిష్టతో నేర్చుకునే / వినే తరం నుంచి అసలు శాస్త్రీయ సంగీతం అవసరమేమిటి ? మాకేలా తోస్తే అలా పాడుకుంటాం... పాశ్చాత్య ధోరణులే మాకు ప్రియం అనే తరానికి ప్రస్తుతం చేరుకున్నాం. ఇక ముందు మరెన్ని వినాలో ! ఈ సందర్భంలో మనదైన కర్ణాటక సంగీతాన్ని ఒక పాశ్చాత్యుడు నిష్టతో, శ్రద్ధతో నేర్చుకుని మన విద్వాంసుల సరసన కూర్చున్న విశేషాన్ని చూద్దాం.
దక్షిణాదికి చెందిన కర్ణాటక సంగీతాన్ని ఎందఱో మహానుభావులు తమ విద్వత్తుతో పరిపుష్టం చేసారు. అయితే వారందరూ భారతీయులే ! ముఖ్యంగా దక్షిణాది వారే ! అయితే ఒక విదేశీయుడు మన శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవడమే కాక కచేరీలు చేసి లబ్ద ప్రతిష్టుల సరసన స్థానం సంపాదించుకోవడం విశేషమే ! గత తరంలోని సంగీత ప్రియులందరికీ పరిచితమైన గళం జాన్ బి. హిగ్గిన్స్ .
1939 లో అమెరికాలో జన్మించిన హిగ్గిన్స్ తొలుత యూరోపియన్, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో గాయకుడు. తర్వాత వెస్లీయన్ విశ్వవిద్యాలయంలో రాబర్ట్ ఇ. బ్రౌన్, టి. రంగనాథన్ గార్ల వద్ద భారతీయ సంగీతాన్ని నేర్చుకున్నారు. అందులోని, ముఖ్యంగా కర్ణాటక సంగీతంలోని మాధుర్యానికి ముగ్దుడై మరింతగా నేర్చుకోవడానికి అంకిత భావంతో భారతదేశం వచ్చారు. మొదట వీణ ధనమ్మాళ్ లాంటి ప్రసిద్ధ విద్వాంసుల దగ్గర శిష్యరికం చేసిన హిగ్గిన్స్ తరువాత టి. సరస్వతి గారి దగ్గర శిష్యరికం చేసి నాట్య సంగీతం పై గ్రంథాలు వెలువరించారు. అవిరళ కృషితో, పట్టుదలతో సాధన చేసి ఆనతి కాలంలోనే తిరువాయూరులోని త్యాగరాజ ఆరాధనోత్సవంలో పాల్గోనగలిగారు. ఆ సమయంలోనే ఉచ్చారణ విషయంలో నిరసనలు ఎదుర్కొన్నారు. ఛాందసులు కొందరు ఆయన పాశ్చాత్య ఉచ్చారణను ఆక్షేపించారు. అయినా పట్టుదలతో తన ఉచ్చారణను సరి చేసుకున్నారు. చాలా కచేరీలు చేశారు. అనేక రికార్డులు వెలువరిచారు. భాగవతార్ బిరుదు కూడా అందుకున్నారు.
70 వ దశకంలో కర్ణాటక సంగీత విద్వాంసుల జాబితాలో జాన్ హిగ్గిన్స్ భాగవతార్ పేరు కూడా చేరింది. ఆయన ఎల్. పి. రికార్డు నేను మొదటగా 1976 ప్రాంతంలోననుకుంటాను, సెలవలకు హైదరాబాద్ వెళ్ళినపుడు మా బావ దగ్గర చూసాను. సంగీతం మీద మక్కువ కొంత, విదేశీయుడి గళంలో మన సంగీతంలో ఎలా ఉంటుందోననే ఉత్సుకత మరికొంత ఆ రికార్డు వినేటట్లు చేసింది. చాలా ఆశ్చర్యమేసింది. రికార్డు కవర్ చూడకుండా వుంటే మన దక్షిణాది కళాకారుడే పాడారని నమ్మేవాణ్ని. కృషి వుంటే మనుష్యులు ఋషులవుతారనే మాటకు హిగ్గిన్స్ నిదర్శనం అనిపించింది. అయితే 1984 డిసెంబర్ 7 వ తేదీన ఒక త్రాగుబోతు కారుతో డీ కొట్టడంతో ఆయన మరణించారు.
ఈరోజు జాన్ బి. హిగ్గిన్స్ వర్థంతి సందర్భంగా ఆయనకు స్వర నీరాజనం అర్పిస్తూ............
ఆయన గళాన్ని మ్యూజిక్ ఇండియా లింక్ లో వినండి.
http://www.musicindiaonline.com/#/artist/10-Classical_Carnatic_Vocal/93-Jon_B_Higgins/
Vol. No. 02 Pub. No. 077

మాధురి గారు పంపిన సమాచారం -
ఒకసారి జాన్ బి. హిగ్గిన్స్ దక్షిణాది వేషధారణ అయిన పంచె, జుబ్బా తొడుక్కుని విభూది పెట్టుకుని ఉడిపి శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళారు. అయితే ఆయనకు సహజంగా పుట్టుకతో వచ్చిన తెలుపు వర్ణం, జుట్టు అతని విదేశీయతను పట్టించాయి. దాంతో ఆలయ వర్గాలు ఆయన్ని లోపలి అనుమతించలేదు. ఆయన అక్కడే కూర్చుని " కృష్ణా ! నీ బేగనే బారో " అనే కీర్తన అద్భుతంగా భక్తి రసం తొణికిసలాడుతూ గానం చేశారు. ఆ గానానికి ముగ్ధులైన ఆలయ అధికారులు ఆయన్ని లోపలికి అనుమతించారు. ఈ విషయం మాధురి గారి తల్లిగారు ఆమెకు చెప్పినది. ఈ విశేషాన్ని మనకందించినందుకు ఇద్దరికీ ధన్యవాదాలు. Vol. No. 02 Pub. No. 077
Monday, December 6, 2010
మామ పుట్టినరోజు
సంగీతానికి భావం ప్రధానం కానీ భాష కాదు
భావాన్ని, అందులోని మాధుర్యాన్ని అందుకొన్న మహానుభావుడు
మాతృభాష కాకపోయినా తెలుగు సంగీతాన్ని స్వంతం చేసుకున్న మహాదేవనుడు
ఆయనే కృష్ణన్ కోవిల్ వేంకటాచల భాగవతార్ మహదేవన్
మనం ముద్దుగా మామ అని పిలుచుకునే కె. వి. మహదేవన్
తమిళనాడుకు ఆ కొసన వున్న నాగర్ కోవిల్ ప్రాంతం నుంచి మద్రాస్ కు వచ్చి సినిమాల్లో పనిచెయ్యాలని ఉబలాట పడిన ఆయనకు ఆ పని అంత సులువు కాలేదు. నెలకు పదిహేను రూపాయిల జీతం మీద రెండు మూడు చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేశారు. నాటకాల్లో నటించారు. హరికథలకు సహకారమందించారు. హోటల్ సర్వర్ గా పనిచేశారు. సైకిల్ మేసేంజేర్ గా పనిచేశారు. గ్రామఫోన్ కంపెనీలో రోజు వారీ వేతనానికి వాయిద్యకారుడిగా పనిచేశారు. ఇలా ఎన్నో కష్టాలు పడి తన సంగీత సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు మహదేవన్.
వైవిధ్యం ఆయన జీవితంలోనే వుంది. పుట్టింది కేరళలో... పెరిగింది తమిళనాడులో... సంగీత దర్శకుడిగా ప్రఖ్యాతి పొందింది ఆంద్ర దేశంలో.... ఇంతకంటే వైవిధ్యం ఉంటుందా ? ఎన్ని భాషల్లో సంగీతం చేసినా తెలుగు భాషలో చేసినన్ని పాటలు ఇంకే భాషలోను చెయ్యలేదు.
మహదేవన్ ది రెడీమేడ్ సంగీతం కాదు. సాహిత్యానికి స్వరం చెయ్యడమే ఆయనకు తెలుసు. అంతేకాదు. కథ, కథనాలు, సన్నివేశ ప్రాధాన్యాలు క్షుణ్ణంగా తెలుసుకుని స్వరకల్పన చేసేవారు. అందుకే అవి కథలో మమేకం అయ్యేవి. దర్శకుని కల్పనతో సన్నివేశానికి ఎంత బలమొస్తుందో మామ తన సంగీతంతో అంతకంటే ఎక్కువ ప్రభావితం చేసేవాడు. బహుశా ఆధునిక కీ బోర్డు సంగీత దర్శకులకి ఇదంతా చాదస్తంగా కన్పించవచ్చు. కానీ మామ స్వయంగా సృష్టించిన పాటలు ఇప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉండడానికి, మనం హాయిగా పాడుకోగలగడానికి కారణం మాత్రం కథ మీద, సాహిత్యం మీద ఆయన తీసుకున్న శ్రద్ధ. లేకపోతే ఇన్ని వేల పాటలు కాలగర్భంలో కలసి పోయేవి.
సుమారు మూడున్నర దశాబ్దాలు తన సంగీతంలో మనల్ని ఓలలాడించిన కె. వి. మహదేవన్ జన్మదినం ( డిసెంబర్ 6 వతేదీ ) సందర్భంగా ఆయన తొలిసారిగా తెలుగులో సంగీత దర్శకత్వం చేసిన దొంగలున్నారు జాగ్రత్త, బొమ్మల పెళ్లి ( 1958 ) చిత్రాలనుంచి ఆయన చివరి చిత్రం స్వాతికిరణం ( 1992 ) వరకూ కొన్ని వైవిధ్యభరితమైన పాటలను జ్ఞప్తికి తెచ్చే స్వర నీరాజనం మీకోసం.........
Vol. No. 02 Pub. No. 076
Subscribe to:
Posts (Atom)
ప్రాచుర్యం
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...