ఒక జాతి లేదా దేశం యొక్క అస్తిత్వానికి చిహ్నం ' జెండా '
భారత జాతి ప్రపంచంలో గర్వంగా చెప్పుకునే చిహ్నం మన మువ్వన్నెల జెండా
ఈ జెండా రూపకల్పనా ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిద్దాం...........
* తొలిసారిగా 1904 లో భారత జాతికి ఒక ప్రత్యేకమైన చిహ్నం ఉండాలనే ఉద్దేశ్యంతో సిస్టర్ నివేదిత ఒక పతాకాన్ని రూపొందించారు. మొదట ఆది ఎరుపు, నలుపు రంగుల్లో ఉండేది. అయితే తర్వాత ఆమె తన విద్యార్థుల సలహాతో కాషాయం, పసుపు రంగుల్లోకి మార్చారు. 1906 లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో ఈ జెండా ఎగురవేశారు.
* 1905 లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ను విభజించింది. ఆ విభజనను వ్యతిరేకిస్తూ పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బెంగాల్ కే చెందిన సచ్చీంద్రప్రసాద్ బోస్, సుకుమార్ లు మొదటిసారి త్రివర్ణ పతాకం రూపొందించారు. హిందూ ముస్లిం సమైక్యతను ప్రతిఫలించే విధంగా ఆ జెండా రూపుదిద్దుకుంది.
* తర్వాత కొన్నాళ్ళకి హోం రూల్ ఉద్యమం ప్రారంభమైంది. దానికి అనీబిసెంట్, బాలగంగాధర తిలక్ లు నాయకత్వం వహించారు. అప్పుడు ఐదు రంగులతో మరో జెండా రూపుదిద్దుకుంది.
* మహాత్మాగాంధీ ప్రభావానికి ఉత్తేజితుడైన పింగళి వెంకయ్య గారు మొదట ఒక జెండా నమూనా తయారుచేసారు. తర్వాత దానికి మధ్యలో చరఖాను కలిపారు. అయితే కాంగ్రెస్ కమిటీ ఈ నమూనా నచ్చలేదు.
అప్పుడు గాంధీగారి సలహాతో వెంకయ్య గారు తయారు చేసిన మరో జెండా అందరి ఆమోదం పొంది 1921 లో అహమ్మదాబాద్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ఎగిరింది. ఆ జెండా దేశమంతా స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించింది. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో చరఖాతో ఆ జెండా ఉండేది.
* తెలుగు తేజం పింగళి వెంకయ్య గారు రూపొందించిన ఆ మువ్వన్నెల జెండా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశ చిహ్నంగా గుర్తించబడి కొన్ని మార్పులతో ఆమోదించబడింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో బాటు మధ్యలో చరఖా బదులుగా అశోక చక్రం ఉంచబడింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రపంచ పటంలో భారతదేశ పతాకం రెపరెపలాడుతోంది.
1952 లో వచ్చిన ' జ్యోతి ' చిత్రంలో జి. వరలక్ష్మి గానం చేసిన గురజాడ అప్పారావు గారి దేశభక్తి గేయం వినండి.
Vol. No. 01 Pub. No. 371
Wednesday, August 11, 2010
మన పతాక ప్రస్థానం
లేబుళ్లు:
దేశభక్తి గేయాలు
Tuesday, August 10, 2010
శ్రీలు పొంగిన జీవగడ్డయి.....

రాయప్రోలు సుబ్బారావు గారి కలం నుండి జాలువారిన ఈ దేశభక్తి గీతం
మిత్రుడు పార్థసారధి గళం నుండి
దుగ్గిరాల స్వరం కల్పనతో వినండి.
శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు
రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా ! [[ శ్రీలు ]]
వేదశాఖలు పెరిగెనిచ్చట ఆదికావ్యం అందినిచ్చట
వేదశాఖలు పెరిగెనిచ్చట ఆదికావ్యం అందినిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా !
బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా !! [[ శ్రీలు ]]
నీలి కిన్నెర మేళవించి రాయి కరుగగ రాగమెత్తి
నీలి కిన్నెర మేళవించి రాయి కరుగగ రాగమెత్తి
పాల తీయని బాలభారత పదము పాడరా తమ్ముడా !
పాల తీయని బాలభారత పదము పాడరా తమ్ముడా ! ! [[ శ్రీలు ]]
నవరసమ్ములు నాట్యమాడగా చిగురు పలుకులు చెవులు విందుగా
నవరసమ్ములు నాట్యమాడగా చిగురు పలుకులు చెవులు విందుగా
కవితలల్లిన కాంతి హృదయము గారవింపవే చెల్లెలా !
కవితలల్లిన కాంతి హృదయము గారవింపవే చెల్లెలా ! ! [[ శ్రీలు ]]
పాండవేయుల పదును కత్తుల మండి మెరిసిన మహిత రణకథ
పాండవేయుల పదును కత్తుల మండి మెరిసిన మహిత రణకథ
కండగల చిక్కని తెలుగుంల కలసి పాడరా తమ్ముడా !
కండగల చిక్కని తెలుగుంల కలసి పాడరా తమ్ముడా ! ! [[ శ్రీలు ]]
Vol. No. 01 Pub. No. 370
లేబుళ్లు:
దేశభక్తి గేయాలు
Monday, August 9, 2010
పాములోడు ?? - జవాబు
కనుక్కోండి చూద్దాం - 24
జవాబు
ఈ ప్రక్క ఫోటోలో పాములోడి వేషంలో వున్నది తెలుగు సినీ సంగీత రంగాన్నేలిన ఒక ప్రముఖుడు.
ఎవరో చెప్పగలరా ?
ఈ వేషం ఎందులోదో చెప్పగలరా ?
జవాబిచ్చిన వారిలో సునీత గారు సరైన జవాబివ్వలేదు. రాజేంద్ర కుమార్ గారు ఘంటసాలను బాగానే గుర్తించారు గానీ వేషం ఎందులోదో చెప్పలేదు. ప్రముఖ రచయిత శ్రీ ఓలేటి శ్రీనివాస భాను గారు మాత్రం పూర్తిగా సరైన సమాధానం ఇచ్చారు. స్పందించిన అందరికీ ధన్యవాదాలు.
జవాబు : 1950 లో వాహినీ స్టూడియోలో జరిగిన విజయావారు నిర్వహించిన కార్నివాల్ లో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈ వేషంలో అలరించారు.
Vol. No. 01 Pub. No. 367a
లేబుళ్లు:
క్విజ్
Subscribe to:
Posts (Atom)
ప్రాచుర్యం
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
