Tuesday, May 7, 2019

సుబ్బరాయుడి రహస్య జీవితం....రైలు కూత...పదకవితా పితామహుడు... ఇంకా...


 * సుబ్బారాయుడు మనలో ఒకడు. నిజానికి మనందరమూ సుబ్బారాయుళ్లమే. మనకి ఉన్న శక్తి సామర్ధ్యాలకి, తగిన స్థాయి, సామాజికపరంగా, ఉద్యోగ / వృత్తి / వ్యాపారపరంగా, ఆర్ధిక పరంగా మనలో చాలామందికి లభించదు.- ' కథావీధి ' శీర్షికన ' త్రిపుర కథలు ' పరిచయంలో " సుబ్బారాయుడి రహస్య జీవితం ".
* కోటప్ప కొండ తీర్ధానికి వెడితే అక్కడ తప్పిపోయి ఏడుస్తూ ఉంటే చాలాసేపు వాడి వాళ్ళకోసం వెదికి ఎవ్వరు దొరక్క రెండేళ్ళ వయస్సు ఉన్న వాడిని తమకే తిండికి కష్టంగా ఉంటే మళ్ళీ వీడు కూడా భారమే కదా అని కూడా సంశయించకుండా ఎత్తుకొని ముద్దాడి ఏడుస్తున్న వాణ్ణి సముదాయించి తనతో తీసుకొచ్చి ఆ స్వామి పేరే పెట్టుకొని పెంచుకుంటున్న ముసలయ్యకి వాడు భారం కాదు.
- " రైలు కూత " కథ.
* సకల సృష్టి స్థితి కారుకుడైన శ్రీనివాసుని తన జీవితసర్వస్వంగా భావించి, తన కీర్తనామృతధారలతో స్వామిని కూడా పరవశింపజేసిన మహాభక్తుడు అన్నమయ్య. ఆంధ్రభాషకు 32 వేల సంకీర్తనలనే అపూర్వ రత్నాలందించిన అన్నమయ్య క్రీ.శ.1503 లో విశ్వాంతర్యామి అయిన వేంకటేశ్వరునిలో అంతర్లీనమయ్యాడు.
- ' అన్నమయ్య ' జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం " పదకవితా పితామహుడు "
* తెలుగు పాట పుట్టుక ముందు వెనుకల గురించి సమగ్రమయిన పరిశోధన చేసిన వారు అతి కొద్ది మంది ఉన్నారు. వారిలో అమలాపురం కి చెందిన శ్రీ పి. ఎస్. రెడ్డి గారు ఒకరు. డా. పైడిపాల గా పేరు తెచ్చుకున్న వీరు ఈ రంగం లో అవిరళకృషి చేసారు.
- ' తో.లే.పి. ' శీర్షికన " డా. పైడిపాల "
ఇంకా చాలా ........ ఈ క్రింది లింక్ లో......
శిరాకదంబం 08_007 
 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 10 Pub. No. 004
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం