Sunday, October 23, 2016

శుభం దదామి !... చీమ... తో. లే. పి. - కార్టూనిస్ట్ ( స్మైల్ ) శ్యాంమోహన్.... ఇంకా...

' దీపం జ్యోతి పరబ్రహ్మః '

అనవసరమైన జిలుగు వెలుగులకి, అట్టహాసాలకీ వాయు, శబ్ద కాలుష్యాలకి దూరంగా.... మనలోని ఆజ్ఞానాంధకారాన్ని పారద్రోలే పరబ్రహ్మ స్వరూపం ' దీపం ' అని గుర్తించి, మన జీవితాలలోనే కాక, మన చుట్టూ ఉండేవారి జీవితాల్లో కూడా వెలుగు జ్యోతులను నింపుతూ తేజోమయమైన, సురక్షితమైన ' దీపావళి ' జరుపుకోవాలని కోరుకుంటూ.......

నవంబర్ నెలలో బాలల దినోత్సవ సందర్భంగా ' శిరాకదంబం ' పత్రిక 16 సంవత్సరాల లోపు బాల బాలికల కోసం వెలువరిస్తున్న " బాల కదంబం " ప్రత్యేక సంచికలో పాల్గొనడానికి గడువు తేదీని 31 అక్టోబర్ 2016 వరకూ పొడిగించడం జరిగింది. బాల బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటారని ఆశిస్తున్నాం. పూర్తి వివరాలకు " శిరాకదంబం " పత్రికలోని 04 వ పేజీ చూడండి. ఆ లింక్ ...

శిరాకదంబం 06_004  

 Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 08 Pub. No. 004

Saturday, October 8, 2016

అమృత కలశం.... మాతృభాష తెలుగమ్మా ! .... బాలకదంబం 2016.... ఇంకా .....

 ' అయ్యవారికి చాలు అయిదు వరహాలు... పిల్లవాండ్రకు చాలు పప్పుబెల్లాలు ' అని పాడుతూ గురువు గారి వెంట వివిధ వేషాలు, బొమ్మ ఆయుధాలను చేబూని ఇంటింటికీ తిరిగే పిల్లల్ని చూస్తుంటే - అందులో గురువుగారి మీద భక్తితో బాటు సమిష్టితత్వం, దుష్ట శిక్షణ... శిష్టరక్షణ అంతర్లీనంగా బోధిస్తున్నట్లు ఉండేది గతంలో. ఇప్పుడా సంప్రదాయం దాదాపుగా కనుమరుగయిపోయింది. పండుగ అంటే సెలవలు, సినిమాలు, మొబైల్ గేమ్స్ ఆడుకోవడం వంటి వాటికే పరిమితమైపోయింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారయ్యాయి పరిస్థితులు. మళ్ళీ ఆ సంప్రదాయాలు పునరుద్ధరిస్తే మనుష్యులలో ఐకమత్యానికి బాటలు పడతాయి. తరతమ బేధాలు సమసిపోతాయి. చదువు పట్ల, దేశక్షేమం పట్ల శ్రద్ధ పెరిగి కార్యోన్ముఖులవుతారు. ఆయుధపూజ విశిష్టత కూడా తెలుస్తుంది.
' బాలకదంబం 2016 ' గడువు సమీపిస్తోంది. మీ పిల్లల్ని, మీ బంధువుల, స్నేహితుల పిల్లల్ని ప్రోత్సహించండి.

దసరా శుభాకాంక్షలతో..... తాజా సంచిక ఈ క్రింది లింక్ లో....
శిరాకదంబం 06_003

 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 003
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం