Saturday, July 23, 2016

మాతృభక్తి - దేశభక్తి... శ్రీ రాజరాజేశ్వరి అష్టకము.... రవ్వంత వెన్నెల.... ఇంకా... .

' శిరాకదంబం ' పత్రిక ప్రస్థానంలో వచ్చే నెల ( ఆగష్టు ) 15 వ తేదీతో అయిదు సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఆర్థిక సంబంధమైన ప్రస్తావన లేకుండా ఇప్పటివరకూ విజయవంతంగా ఈ ప్రయాణం సాగింది.
ఎన్నో మజిలీలు... ఒడిదుడుకులు... ప్రయోగాలు.... అన్నిటికీ పాఠక మిత్రులు సహకరిస్తూనే వచ్చారు.
తెలుగు భాష, సంస్కృతి ప్రధానాంశాలుగా ఈ ప్రయాణం సాగుతోంది.
ఈ అయిదు సంవత్సరాల ప్రస్థానానికి గుర్తుగా... తెలుగు వైభవానికి ప్రతీకగా నిలిచిపోయేలా జన్మదిన ప్రత్యేక సంచిక వెలువరించడం జరుగుతోంది.
తెలుగు వారందరినీ పులకింత అందించే ఈ ప్రత్యేక సంచికకు శీర్షిక " తెలు'గింత' ". ఆగష్టు 15 వ తేదీన జన్మదిన ప్రత్యేక సంచికగా విడుదల కాబోతోంది.
మీరూ చదవండి. మీ బంధుమిత్రులందరి చేతా చదివించండి. చదివాక మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఇవ్వండి.
తాజా సంచిక ఈ క్రింది లింక్ లో.....

శిరాకదంబం 05_022



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 024

Saturday, July 9, 2016

కీబోర్డ్ తో కొత్తగా... శనక్కోపువ్వు.... జయదేవ్ బాబు తో. లే. పి. .... ఇంకా

 పాశ్చాత్య సంగీత వాయిద్యాలపైన కర్ణాటక సంగీతం అలవోకగా పలుకుతుందని గతంలోనే నిరూపితమైంది. పాశ్చాత్య వాయిద్యమైన వైలెన్ మన సంగీతంలో ఒదిగిన తీరే దీనికి నిదర్శనం. ఇటీవల కాలంలో మాండలిన్ పైన కర్ణాటక బాణీలు పలికించి తన ఇంటి పేరే మార్చేసుకున్న ' మాండలిన్ శ్రీనివాస్ ' ప్రతిభ మనమందరూ చూసాం. ఇప్పుడు మరో పాశ్చాత్య సంగీత వాయిద్యం ' కీబోర్డ్ పైన మన సంగీతాన్ని పాలిస్తున్న ' సత్య ' గురించి " కీబోర్డ్ పై కొత్తగా.... "
' కోనసీమ కథలు ' లో " శనక్కోపువ్వు ', కార్టూనిస్ట్ " జయదేవ్ బాబు గారి తో. లే. పి. " .... ఇంకా ... ఈ క్రింది లింక్ లో...
శిరాకదంబం 05_021

వచ్చే నెల ( ఆగస్ట్ ) 15 వ తేదీ భారతదేశం 70 వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది. ' శిరాకదంబం ' పత్రిక 5 వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.
  
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 023 

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం