Monday, December 19, 2016

బాల ' మురళి నివాళి '

 తెలుగు వారికి, ముఖ్యంగా తెలుగు సంగీతానికి గర్వకారణమైన వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గత నెలలో పరమపదించిన విషయం విదితమే ! అయితే ప్రస్తుతం ఆయన లేరనే విషయాన్ని సంగీత ప్రియులెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి నిదర్శనమే ఈ బాల ' మురళి ' నివాళి సంచిక..... ఈక్రింది లింక్ లో.........
శిరాకదంబం 06_007
 

Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 07 Pub. No. 007

Monday, December 5, 2016

నివాళి - బాలమురళీ రవళి... తెలుగు సుమాలు... ప్రపంచంగాడు... ఇంకా చాలా...

కర్ణాటక సంగీత దిగ్గజం భువి నుండి దివికి తరలిపోయింది.
తెలుగు జాతికి తీరని లోటుగా మిగిలిపోయింది.
' బాలమురళి ' కి నివాళి.
ఈనాటి సమాజంలో తల్లిదండ్రుల, సంతానం మధ్య క్షీణిస్తున్నసంబంధాలకు అద్దం పట్టే కథ ' కోనసీమ కథల ' నుంచి ' ప్రపంచంగాడు '.
వీణ బాలచందర్ ' తో. లే. పి. '...... ఇంకా చాలా ఈ క్రింది లింక్ లో.....
శిరాకదంబం 06_006
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 006

Thursday, November 17, 2016

సంగీతం, రచన, నాటకం, ప్రతిభ, చిత్రం.... ఇవన్నీ ' బాల కదంబం ' లో....

 బాలల కోసం ప్రత్యేకించిన సంచిక ' బాల కదంబం ' లో ఎందరో బాల బాలికలు ఉత్సాహంగా పాల్గొని వివిధ రంగాలలో తమ ప్రతిభను ప్రదర్శించారు. ' బాల సంగీతం ' విభాగంలో శాస్త్రీయ సంగీతంతో బాటు పద్యములు కూడా పాడి అలరించారు. ' బాల రచన ' విభాగంలో వ్యాసములు, కవితలు, కథ, గేయం మొదలైన ప్రక్రియలలో తమ రచనా పాటవాన్ని చూపడంతో బాటు మంచి అంశాలను కూడా సేకరించి పంపారు. ' బాల నాటకం ' విభాగంలో పాత్ర ధారణతో బాటు సాహితీ ప్రదర్శన, చెళుకులను ప్రదర్శించారు. ' బాల ప్రతిభ ' విభాగంలో జాతీయ అంతర్జాతీయ క్విజ్ పోటీల విజేత, చిరుత ప్రాయంలో అపారమైన ధారణ శక్తి ని ప్రదర్శించిన చిన్నారి పాల్గొన్నారు. ' బాల చిత్రం ' విభాగంలో అనేక అంశాల మీద బొమ్మలు గీసి నయానందకరం చేశారు.
ఈ క్రింది లింక్ లో బాల బాలికల ప్రతిభను చూసి, మీ అభినందనపూర్వక ఆశీస్సులను అందించి వారిని ప్రోత్సహించండి.
శిరాకదంబం 06_005
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 005

Sunday, October 23, 2016

శుభం దదామి !... చీమ... తో. లే. పి. - కార్టూనిస్ట్ ( స్మైల్ ) శ్యాంమోహన్.... ఇంకా...

' దీపం జ్యోతి పరబ్రహ్మః '

అనవసరమైన జిలుగు వెలుగులకి, అట్టహాసాలకీ వాయు, శబ్ద కాలుష్యాలకి దూరంగా.... మనలోని ఆజ్ఞానాంధకారాన్ని పారద్రోలే పరబ్రహ్మ స్వరూపం ' దీపం ' అని గుర్తించి, మన జీవితాలలోనే కాక, మన చుట్టూ ఉండేవారి జీవితాల్లో కూడా వెలుగు జ్యోతులను నింపుతూ తేజోమయమైన, సురక్షితమైన ' దీపావళి ' జరుపుకోవాలని కోరుకుంటూ.......

నవంబర్ నెలలో బాలల దినోత్సవ సందర్భంగా ' శిరాకదంబం ' పత్రిక 16 సంవత్సరాల లోపు బాల బాలికల కోసం వెలువరిస్తున్న " బాల కదంబం " ప్రత్యేక సంచికలో పాల్గొనడానికి గడువు తేదీని 31 అక్టోబర్ 2016 వరకూ పొడిగించడం జరిగింది. బాల బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటారని ఆశిస్తున్నాం. పూర్తి వివరాలకు " శిరాకదంబం " పత్రికలోని 04 వ పేజీ చూడండి. ఆ లింక్ ...

శిరాకదంబం 06_004  

 Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 08 Pub. No. 004

Saturday, October 8, 2016

అమృత కలశం.... మాతృభాష తెలుగమ్మా ! .... బాలకదంబం 2016.... ఇంకా .....

 ' అయ్యవారికి చాలు అయిదు వరహాలు... పిల్లవాండ్రకు చాలు పప్పుబెల్లాలు ' అని పాడుతూ గురువు గారి వెంట వివిధ వేషాలు, బొమ్మ ఆయుధాలను చేబూని ఇంటింటికీ తిరిగే పిల్లల్ని చూస్తుంటే - అందులో గురువుగారి మీద భక్తితో బాటు సమిష్టితత్వం, దుష్ట శిక్షణ... శిష్టరక్షణ అంతర్లీనంగా బోధిస్తున్నట్లు ఉండేది గతంలో. ఇప్పుడా సంప్రదాయం దాదాపుగా కనుమరుగయిపోయింది. పండుగ అంటే సెలవలు, సినిమాలు, మొబైల్ గేమ్స్ ఆడుకోవడం వంటి వాటికే పరిమితమైపోయింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారయ్యాయి పరిస్థితులు. మళ్ళీ ఆ సంప్రదాయాలు పునరుద్ధరిస్తే మనుష్యులలో ఐకమత్యానికి బాటలు పడతాయి. తరతమ బేధాలు సమసిపోతాయి. చదువు పట్ల, దేశక్షేమం పట్ల శ్రద్ధ పెరిగి కార్యోన్ముఖులవుతారు. ఆయుధపూజ విశిష్టత కూడా తెలుస్తుంది.
' బాలకదంబం 2016 ' గడువు సమీపిస్తోంది. మీ పిల్లల్ని, మీ బంధువుల, స్నేహితుల పిల్లల్ని ప్రోత్సహించండి.

దసరా శుభాకాంక్షలతో..... తాజా సంచిక ఈ క్రింది లింక్ లో....
శిరాకదంబం 06_003

 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 003

Wednesday, September 21, 2016

పోతన... పూలూ పడగలు...భలే చవితి పండుగ... ఇంకా....

 * తెలుగు వారికి భాగవతామృతాన్ని పంచిన ' పోతన ' గారి గురించి....
* సుబ్రహ్మణ్య షష్టి కి సమర్పించే ' పూలూ - పడగలు ' కోనసీమ కథల్లో....
* చిన్నప్పటి చవితి పండుగ జ్ఞాపకాలు ' భలే చవితి పండుగ '....
* చెన్నైలో ' శ్రీ త్యాగరాజర్ ' నాటక ప్రదర్శన విశేషాలు, తెలుగు ప్రాచీన భాష హోదా పై నెల నెలా వెన్నెల,       బాలాంత్రపు నళినీకాంతరావు గారి శతజయంతి కార్యక్రమ విశేషాలు, హైదరాబాద్ లో ' మాలతీచందూర్ పురస్కార  ప్రదానోత్సవ విశేషాలు.... " ఆనందవిహారి " లో...

ఇంకా ఎన్నో.... ఈ క్రింది లింక్ లో....
శిరాకదంబం 06_002


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 002

Thursday, August 18, 2016

పంచమ స్వరం

 అయిదు సంవత్సరాల ప్రస్థానం నుంచి ' పంచమ స్వరం ' పలికింది.'
శిరాకదంబం ' అయిదవ జన్మదిన ప్రత్యేక సంచిక ' పంచమ స్వరం ......తెలుగు భాష, సాహిత్యం, కళా వైశిష్ట్యం, ఆథ్యాత్మికత, సామాజికత అనే అయిదు అంశాలలో... ఆసక్తికరమైన విషయాలను అందించే అద్భుతమైన రచనలను అందిస్తోంది.
ఈ క్రింది లింక్ లో చదివి, ఆయా వ్యాసాలపైన, ప్రత్యేక సంచిక పైనా మీ అమూల్యమైన అభిప్రాయాలను ఆ సంచిక క్రిందనే ఉండే వ్యాఖ్యల పెట్టె ( comment box ) లో గానీ, editorsirakadambam@gmail.com కి గాని పంపించండి.

' పంచమ స్వరం ' ప్రత్యేక సంచిక లింక్....

శిరాకదంబం 06_001

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 001

Saturday, July 23, 2016

మాతృభక్తి - దేశభక్తి... శ్రీ రాజరాజేశ్వరి అష్టకము.... రవ్వంత వెన్నెల.... ఇంకా... .

' శిరాకదంబం ' పత్రిక ప్రస్థానంలో వచ్చే నెల ( ఆగష్టు ) 15 వ తేదీతో అయిదు సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఆర్థిక సంబంధమైన ప్రస్తావన లేకుండా ఇప్పటివరకూ విజయవంతంగా ఈ ప్రయాణం సాగింది.
ఎన్నో మజిలీలు... ఒడిదుడుకులు... ప్రయోగాలు.... అన్నిటికీ పాఠక మిత్రులు సహకరిస్తూనే వచ్చారు.
తెలుగు భాష, సంస్కృతి ప్రధానాంశాలుగా ఈ ప్రయాణం సాగుతోంది.
ఈ అయిదు సంవత్సరాల ప్రస్థానానికి గుర్తుగా... తెలుగు వైభవానికి ప్రతీకగా నిలిచిపోయేలా జన్మదిన ప్రత్యేక సంచిక వెలువరించడం జరుగుతోంది.
తెలుగు వారందరినీ పులకింత అందించే ఈ ప్రత్యేక సంచికకు శీర్షిక " తెలు'గింత' ". ఆగష్టు 15 వ తేదీన జన్మదిన ప్రత్యేక సంచికగా విడుదల కాబోతోంది.
మీరూ చదవండి. మీ బంధుమిత్రులందరి చేతా చదివించండి. చదివాక మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఇవ్వండి.
తాజా సంచిక ఈ క్రింది లింక్ లో.....

శిరాకదంబం 05_022



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 024

Saturday, July 9, 2016

కీబోర్డ్ తో కొత్తగా... శనక్కోపువ్వు.... జయదేవ్ బాబు తో. లే. పి. .... ఇంకా

 పాశ్చాత్య సంగీత వాయిద్యాలపైన కర్ణాటక సంగీతం అలవోకగా పలుకుతుందని గతంలోనే నిరూపితమైంది. పాశ్చాత్య వాయిద్యమైన వైలెన్ మన సంగీతంలో ఒదిగిన తీరే దీనికి నిదర్శనం. ఇటీవల కాలంలో మాండలిన్ పైన కర్ణాటక బాణీలు పలికించి తన ఇంటి పేరే మార్చేసుకున్న ' మాండలిన్ శ్రీనివాస్ ' ప్రతిభ మనమందరూ చూసాం. ఇప్పుడు మరో పాశ్చాత్య సంగీత వాయిద్యం ' కీబోర్డ్ పైన మన సంగీతాన్ని పాలిస్తున్న ' సత్య ' గురించి " కీబోర్డ్ పై కొత్తగా.... "
' కోనసీమ కథలు ' లో " శనక్కోపువ్వు ', కార్టూనిస్ట్ " జయదేవ్ బాబు గారి తో. లే. పి. " .... ఇంకా ... ఈ క్రింది లింక్ లో...
శిరాకదంబం 05_021

వచ్చే నెల ( ఆగస్ట్ ) 15 వ తేదీ భారతదేశం 70 వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది. ' శిరాకదంబం ' పత్రిక 5 వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.
  
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 023 

Thursday, June 23, 2016

ముళ్ళపూడి మాటల ముత్యాలు... నంద నందన ! వందనం !... వెండి కొబ్బరికాయ.... ఇంకా

 ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా చెన్నైలో ' ముళ్ళపూడి మాటల ముత్యాలు ', దుబాయి లో సంగీత కార్యక్రమ విశేషాలు, ప్రముఖ గాత్ర - చిత్ర సమ్మేళన కళాకారుడు ' కూచిం'త అభినందన " ఆనందవిహారి " లో....
గోకుల నందనునికి చేస్తున్న వందనం " నంద నందన ! వందనం ! " లో.....
ఒక జంటను కలిపిన " వెండి కొబ్బరికాయ " కథ ' కోనసీమ కథలు ' లో....
ఇంకా చాలా.... ఈ క్రింది లింక్ లో ......
శిరాకదంబం 05_020

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 022

Saturday, June 11, 2016

రసరాజ్యం.. సంగీత సవ్యసాచి... తీపి కావిళ్లు... ఇంకా...

కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా కళా తపస్సులో మునిగిపోయిన నటుని జీవితమే ' రసరాజ్యం ' నాటకం " ఆనందవిహారి " లో....
మరుగున పడిన మరో తెలుగు మాణిక్యం కొచ్చెర్లకోట రామరాజు గారి గురించి '  సంగీత సవ్యసాచి ' లో....
వీనులవిందైన వాయులీన వాయిద్యం, చక్కటి నీతి కథ " ఆవు - పులి "... చిన్నారుల ప్రతిభా ప్రదర్శన " బాలకదంబం " లో....
ఇంకా ఎన్నెన్నో... ఈ క్రింది లింక్ లో.....
శిరాకదంబం 05_019 

Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 06 Pub. No.021

Monday, May 23, 2016

తుమ్మిపూల దండ... తెర వెనుక - రుక్మిణీ కళ్యాణం... లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్... ఇంకా ....

* " తుమ్మిపూల దండ " కోనసీమ కథల్లో రెండవది.

* " తెర వెనుక - రుక్మిణీ కళ్యాణం " అమెరికా పిల్లలతో నాటికను రూపొందించిన విధానం
* " లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ " ప్రముఖ రచయిత, హాస్యనటుడు ఎల్బీ శ్రీరామ్ గారు ప్రారంభిస్తున్న లఘు చిత్రాల గురించి....
ఇంకా.... చాలా .... ఈ క్రింది లింక్ లో.....

శిరాకదంబం 05_018 

 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 020

Wednesday, May 11, 2016

మధు మర్కటం... పంచతంత్ర కథ... రుక్మిణీ కళ్యాణం... ఇంకా...

* క్రొత్తగా ' కోనసీమ కథలు ' " మధు మర్కటం " తో ప్రారంభం.
* ' శ్రద్ధ ' గా ఎవరు చేసినా ' శ్రాద్ధం ' అవుతుందని నిరూపించే ' కంటే కూతుర్నే కను '
* ఇటీవల ప్రాచుర్యం లోకి వచ్చిన నినాదం నేపథ్యంలో " స్వచ్చ భారత్ "
* తెలుగు తోట విద్యార్థి చెప్పిన పంచతంత్ర కథ, విద్యార్థుల ' రుక్మిణీ కళ్యాణం ' నాటకం తో " బాలకదంబం "
* వివిధ ప్రాంతాలలో ఇటీవల జరిగిన కార్యక్రమాల కదంబం " ఆనంద విహారి "

ఇంకా చాలా ..... ఈ క్రింది లింక్ లో....
శిరాకదంబం 05_017


Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 07 Pub. No. 019

Saturday, April 23, 2016

సచ్చిదానందం...నాదానందం...ఆనంద విహారి... ఇంకా....

* 'తెలుగు తోట' చిన్నారుల దాశరథి శతక పద్యాలు, ' సీతారామ కళ్యాణం ' హరికథ
* వివిధ ప్రాంతాల్లో / దేశాల్లో దుర్ముఖి ఉగాది వేడుకల విశేషాలు ' ఆనంద విహారి ' లో....
* అమెరికాలో ' నాదానందం ' పుస్తకావిష్కరణ చిత్ర కదంబం ' ఆనంద విహారి ' లో...
* ప్రేక్షకుల ఎదుట శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పాటకు తగ్గ చిత్రాన్ని గీసిన కార్యక్రమం గురించిన విశేషాలు ' కూచి గాత్ర చిత్ర సచ్చిదానందం '
* ' నాదానందం ' పుస్తక పరిచయం ' నాదనంద సుధ '
ఇంకా చాలా.....
శిరాకదంబం 05_016

 
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 07 Pub. No. 018

Thursday, April 14, 2016

కల తీర్చిన కొలంబియా

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ' సాక్షి ' పత్రిక లో....

 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No.017

Sunday, April 10, 2016

ఉగాది ఊసులు,, ఆనంద విహారి... సంస్కృతం... ఇంకా ...

నూతన సంవత్సరం పేరు ' దుర్ముఖి ' అయినా ' సన్ముఖి ' గానే అందర్నీ అలరిస్తుందని ఆశిద్దాం.
ఆత్మీయుల ' ఉగాది శుభాకాంక్షలు ',
పిల్లలు ' పద్యం పాడుతా ! ' అంటూ పాడిన భాగవత పద్యములు,  
పిల్లలు ' కథ చెబుతా ! ' అంటూ చెప్పిన నీతి కథలు,
ఉగాది కవితలు,
వివిధ ప్రదేశాల్లో జరిగిన సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల కదంబం ' ఆనంద విహారి '

.... ఇంకా ఈ క్రింది లింక్ లో .....

శిరాకదంబం 05_015

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 016

Thursday, March 24, 2016

నాదానుభవం... ఎడారిలో ఒయాసిస్సు ' సుస్వర '... శతక కవిత్వం - వెలుగు బాట ..... ఇంకా

అభిరుచి, పట్టుదల వుంటే వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు ఒకప్పటి బాలీవుడ్ కలల రాణి వైజయంతిమాల బాలి, 82 ఏళ్ల వయసులో తొలి సంగీత కచేరీ చేసి. ఇటీవల చెన్నై లో వైజయంతి మాల కచేరీ విశేషాలు ' నాదానుభవం ' లో...
మన సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడుకోవాలనే చిత్తశుద్ధి వుంటే ప్రపంచంలో ఏమూలనున్నా ఆ పని చెయ్యవచ్చని నిరూపించారు ఇద్దరు మహిళలు . వారి కృషి, పట్టుదల ఫలితాలేమిటో " ఎడారిలో ఒయాసిస్సు ' సుస్వర ' "లో.....

తెలుగు వారి సాహిత్య సంపద ' శతక కవిత్వం '. అనేక జీవిత సత్యాలను ఇముడ్చుకున్న ఎన్నెన్నో శతకాలు తెలుగువారి స్వంతం . శతక కవిత్వం గురించి విశేషాలు, సుమతీ శతకం నుంచి కొన్ని పద్యాలు ' శతక కవిత్వం - వెలుగు బాట ' లొ.....
ఇంకా ఎన్నెన్నో .... ఈ క్రింది లింక్ లో ....

శిరాకదంబం 05_014



Visit web magazine at www.sirakadambam.com


Vol. No. 07 Pub. No.015

Wednesday, March 16, 2016

మానవుడే మహనీయుడు....


మానవులందరూ మహనీయులు కాలేరు
మహనీయులు మాత్రం కారణజన్ములవుతారు
లోకకళ్యాణం కోసం తమ జీవితాలను త్యాగం చేస్తారు
అఖండమైన కీర్తిని మూటగట్టుకుని అమరజీవులవుతారు

తెలుగువారి అస్థిత్వం కోసం అలుపెరుగని పోరాటం చేశారు పొట్టి శ్రీరాములు
ఆత్మార్పణతో ఆంధ్రులకు రాష్ట్రం సాధించి పెట్టి అమరజీవి అయ్యారు

.... అమరజీవి పొట్టి శ్రీరాములు నడయాడిన నేల. అత్యున్నత ఆశయం కోసం, ఆంధ్రుల చిరకాల ఆకాంక్ష నెరవేర్చడం కోసం 58 రోజులపాటు కఠోర దీక్ష చేసిన చోటు, ఎన్ని అవమానాలు, అవరోధాలు ఎదురైనా దీక్షాకంకణ బద్ధుడై, తుది శ్వాస వరకూ ఆంధ్రుల పౌరుషాన్ని నిలబెట్టి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనితర సాధ్యమైన ఆమరణ దేక్ష చేసిన ప్రదేశం చెన్నై నగరంలోని మైలాపూర్ ప్రాంతం. ఆ ప్రదేశంలో అడుగుపెడుతూనే ఒక రకమైన ఉద్వేగం. ఆ మహనీయుడు చేసిన త్యాగమే ఆంధ్రుల ఉనికికి ఆలంబన అయింది. దశాబ్దాల పోరాటం సఫలం చేసింది. ఆ విషయం తల్చుకుంటుంటే ఒక విధమైన పులకింత. ఆయన దీక్ష చేసిన చోటు, ఆయన సమాధి, అక్కడ ప్రతిష్టించిన విగ్రహం.... వీటన్నిటి వెనుక ఆయన దీక్షా దక్షత, పట్టుదల, త్యాగం... ఇవన్నీ కనిపిస్తాయి. ఆంధ్ర దేశంలోని ప్రతి అణువణువులో ఆయన ఉనికి వుంది. అయితే ఆ ఉనికి గుర్తించి, ఆ స్ఫూర్తినుంచి ప్రేరణ పొందితేనే ఆయన ఆశయాన్ని సాధించినట్లు అవుతుంది.


పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేసిన ప్రదేశంలో అడుగుపెట్టడమే అదృష్టం అనుకుంటే... ఆయన 116 వ జయంతి ఉత్సవాలలో పాల్గొనడం నేను చేసుకున్న పుణ్యం. మనం ఎలాగూ మహానుభావులం కాలేము. కనీసం అటువంటి మహనీయులను స్మరించుకుని తరిస్తే... వారి ఆశయాల సాధనకు మన వంతు కృషి చేస్తే.... మన జన్మ ధన్యం.



ఒకసారి సందర్శించినందుకు, ఆ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు నేనే అదృష్టవంతుణ్ణి అనుకుంటుంటే.... నిత్యం ఆయనని, ఆయన ఆశయాలను సజీవంగా వుంచి, వారి స్ఫూర్తిని అందరికీ పంచుతున్న చెన్నైలోని " అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ " వారు నిజంగా ధన్యులు. ఆయన 58 రోజుల దీక్ష తర్వాత ఆత్మార్పణ చేసిన ప్రదేశంలోనే ముచ్చటైన స్మారక భవనం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆయన స్మృతికి నివాళి గా అనేక కార్యక్రమాలు నిర్వహణకు రూపకల్పన చేస్తున్న ఆ సంస్థ సారధి శ్రీ వై. రామకృష్ణ గారు అభినందనీయులు.

ఈ నెల 12 వ తేదీ శనివారం రోజున వారు " అమరజీవి పొట్టి శ్రీరాములు " గారి 116 వ జయంతిని వైభవంగా చెన్నైలోని పొట్టి శ్రీరాములు స్మారక భవనంలో నిర్వహించారు. ఆ సభలో ప్రధాన వక్తగా పాల్గొన్న రచయిత, రంగస్థల నటులు శ్రీ వాడ్రేవు సుందరరావు గారు పొట్టి శ్రీరాములు గారి జీవిత చిత్రాన్ని ఆహుతుల కళ్ల ముందు ఆవిష్కరించారు. దీక్ష ప్రారంభానికి ముందే పొట్టి శ్రీరాములు గారు తన దీక్షను ఆమరణ దీక్షగా ప్రకటించారు అనేదానికి నిదర్శనంగా అప్పటి వార్తాపత్రికలను కూడా ప్రదర్శించారు.

ఈ సందర్భంగా " అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ " వారు యువజనుల కోసం ప్రారంభించిన
త్రైమాసిక అంతర్జాల పత్రిక " యువ " ను ఆవిష్కరించారు.



ఆ పత్రిక లింక్ :

అమరజీవి ఆశయాలను, తెలుగువారి ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న చెన్నై లోని తెలుగువారిని, తెలుగు రాష్ట్రాల్లోని వారందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. తెలుగు భాష, తెలుగు సంస్కృతి పరిరక్షణ మన ప్రధాన ఆశయం కావాలి. తెలుగు వారి పౌరుషాన్ని ప్రదర్శించి మన ఉనికిని కాపాడుకోవాలి.
పొట్టి శ్రీరాములు లాంటి ఎందరో మహానుభావులు తెలుగు జాతి ఉన్నతికి కృషి చేశారు. వారినందర్నీ స్మరించుకునే విధంగా చెన్నైలోని ' పొట్టి శ్రీరాములు స్మారక భవనం ' లో ఆ మహనీయులందరి చిత్రపటాలను ఏర్పాటు చెయ్యడం అభినందనీయం. ఆ కార్యక్రమం లో పాల్గొని ఆ మహనీయుని స్మరించుకునే అవకాశం దక్కడం నా అదృష్టం. 
ఆ అవకాశాన్ని కల్పించిన " అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ " వారికి కృతజ్ఞతలతో..... 

ఈరోజు " అమరజీవి పొట్టి శ్రీరాములు " గారి 116 వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ....
 

 Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 07 Pub. No. 014

Tuesday, March 8, 2016

చిదంబర రహస్యం.... పసిడితళుకులు... రేడియో తాతయ్య తో.లే.పి.... ఇంకా .....

భారత సంస్కృతిలో స్త్రీలకు ఒక విశిష్టమైన, ఉన్నతమైన స్థానం వుంది. ఈ సృష్టికి మూలం స్త్రీ. అందుకే స్త్రీలను దేవతలుగా పూజించడం మన సాంప్రదాయంగా వచ్చింది. స్త్రీలను గౌరవించడం అంటే మన ఉనికిని మనం గౌరవించుకోవడమే ! అందుకు సంవత్సరానికి కేవలం ఒకరోజుకే పరిమితం కానవసరం లేదు. జీవితకాలమంతా పాటించడం అవసరం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో......
శివరాత్రి సంచిక ఈ క్రింది లింక్ లో.......
శిరాకదంబం 05_013
 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 013

Thursday, February 18, 2016

ఎయిర్ ఇండియా బాబీ కూకా.... బడేగులాం అలీఖాన్... అమెరికాలో తెలుగు 'తోటమాలి'... ఇంకా....

ఎయిర్ ఇండియా మహారాజు సృష్టికర్త తో. లే. పి. ' ( ఎస్. కె. ) బాబీ కూకా '
హిందూస్థానీ మహా గాయకుడు ' బడేగులాం అలీఖాన్ '
అమెరికాలో తెలుగు వెలుగు పూలు పంచుతున్న తెలుగు ' తోటమాలి ' 

ఇంకా ఎన్నెన్నో ..... ఈ క్రింది లింక్ లో ....
శిరాకదంబం 05_012

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 012

Thursday, February 4, 2016

అక్షరాంజలి... తాతయ్య చేతికర్ర...' ర ' సాలూరు రాజేశ్వరరావు తో. లే. పి. ... ఇంకా....

* పద్మవిభూషణుడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అక్షరాంజలి ......
* ముసలితనంలో అండగా వుంటాడనుకొన్న కొడుకు దూరమై పోతే, ఊతంగా వున్న చేతికర్ర విరిగిపోతే... ' తాతయ్య చేతికర్ర ' కథ 
* తో. లే. పి. లో " ' ర ' సాలూరు రాజేశ్వరరావు " 
ఇంకా... చాలా...  ఈ క్రింది లింక్ లో ..... 
శిరాకదంబం 05_011
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 011

Friday, January 8, 2016

సంక్రాంతిలక్ష్మి...ఇంటింటా చిలకల పందిరి...' శిరావేదిక ' ప్రారంభ ఉత్సవం... ఇంకా మరెన్నో

' ధనుర్మాసం ' ప్రారంభమయ్యాక ' శిరావేదిక ' ప్రారంభ ఉత్సవం, తర్వాత క్రొత్త సంవత్సర కోలాహలం అయ్యాయి. ఇప్పుడు సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. అందుకే ' శిరాకదంబం ' సంక్రాంతి ప్రత్యేక సంచిక సిద్ధం అయింది. ' సంక్రాంతిలక్ష్మి ' ని మీ ముందుకు తెచ్చింది. ' ఇంటింటా చిలకల పందిరి ' వేసింది. వీటితో బాటు తెలుగు పద్య పఠన పోటీలతో ' శిరావేదిక ' ప్రారంభ ఉత్సవ విశేషాలను కూడా వీడియో రూపంలో అందిస్తోంది. ఇవేకాక ఇంకా అనేక శీర్షికలతో, వ్యంగ్య చిత్రాలతో ....సంక్రాంతి శుభాకాంక్షలతో...ఈ క్రింది లింక్ లో... .

' శిరాకదంబం ' 05_010 ( సంక్రాంతి సంచిక )

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 010
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం