Saturday, June 27, 2015

ఏరువాక... బాల సాహిత్య సృష్టికర్తలు...అంతర్జాతీయ యోగా దినోత్సవం..... ఇంకా

 తొలకరి వాన పడగానే రైతు వ్యవసాయ పనులకు సిద్ధం అవుతాడు. ఏరువాక  పున్నమి రోజున పనులు ప్రారంభిస్తాడు. తెలుగునాట రైతులకు అదొక పెద్ద పండుగ. క్రమంగా కనుమరుగవుతున్న ఆ సంప్రదాయం గురించి, పల్లె వాసుల భావోద్వేగాల గురించి వివరించే రావూరు వారి " ఏరువాక " కథ తాజా సంచికలో .......
మనకు జన్మనిచ్చిన తల్లిని, జన్మభూమిని, మాతృభాషని ప్రేమించనివాడు, వాటికి విలువ ఇవ్వనివాడు ఎన్ని చదువులు చదివినా, ఎంత ఎత్తు ఎదిగినా వ్యర్థమే ! వీటిని గౌరవించడం అంటే తనని తాను గౌరవించుకోవడమే ! పిల్లలకు కూడా అన్ని భాషలతో బాటు మన తెలుగు భాష లో కూడా తప్పనిసరిగా మాట్లాడడం, చదవడం, వ్రాయడం నేర్పించడం చాలా అవసరం. లేకపోతే తెలుగు భాష కనుమరుగయ్యే ప్రమాదం పొంచి వుంది. మీ పిల్లల్ని, మీకు తెలుసున్న పిల్లలని అందర్నీ ' శిరాకదంబం ' నిర్వహిస్తున్న " బాలల కథల పోటీ - 2015 " కి తెలుగులో కథలు వ్రాసేలా ప్రోత్సహించండి. వారి భావాలకు తెలుగు భాషలో అక్షరరూపం కల్పించే అవకాశం ఇవ్వండి.
వివరాలకు తాజాసంచిక ఈ క్రింది లింక్ లో .........
శిరాకదంబం 04_023 
 Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 06 Pub. No. 026

Friday, June 12, 2015

బాలల కథల పోటీ - 2015.... నంది తిమ్మన.... స్వరవీణాపాణి... ఇంకా ......

గత తరంలో పిల్లలకోసం ప్రత్యేకంగా పత్రికలు, వాటిలో పిల్లలకోసమే రచనలు చేసే సాహిత్యకారులు ఎందరో వుండేవారు. దాదాపుగా అప్పటి రోజుల్లో ప్రముఖులైన రచయితలందరూ కూడా బాలసాహిత్యాన్ని అందించారు. అలాగే పిల్లలలోని సృజనాత్మకతను వెలికి తెచ్చే కార్యక్రమాలెన్నిటికో ఆకాశవాణి లో రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గా ప్రసిద్ధి చెందిన న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి గారలు దారి చూపించారు. ఇలా గత తరంలో బాలల మనో వికాసానికి కృషి చేసిన మహానుభావుల్లో కొంతమంది ప్రముఖుల స్పూర్తి ని ఇప్పటి తరం బాలలకు అందించాలనే ఉద్దేశ్యంతో శిరాకదంబం పత్రిక ' బాలల కథల పోటీ - 2015 ' నిర్వహిస్తోంది.
ఈ పోటీలో ఎంపికైన 10 ఉత్తమ కథలకు ఒక్కొక్క దానికి ₹ 500 /- చొప్పున, గత తరం బాలల సాహిత్యకారులలో 10 మంది పేరిట స్మారక పురస్కారాలని అందజేస్తోంది.
మీ పిల్లల్ని, మీకు తెలిసిన పిల్లల్ని.... 15 సంవత్సరాల లోపు పిల్లలందర్నీ ప్రోత్సహించి, వారిలోని సృజనాత్మకతను వెలికి తీసుకు రావడానికి తోడ్పడండి... పోటీ వివరాలతో బాటు ఇంకా ఎన్నో ఈ క్రింది లింక్ లో..... 
శిరాకదంబం 04_022 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 025
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం