Sunday, February 22, 2015

' సప్న ' పాతికేళ్ళ ప్రస్థానం.... సత్యనారాయణ వ్రతము.... తుది మజిలీ... ఇంకా ....

హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపకురాలు శ్రీమతి జయ పీసపాటి ఆధ్వర్యంలో ఆ దేశంలో పండుగలు, పూజలతో బాటు గత కొన్ని సంవత్సరాలుగా సామూహికంగా శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము కూడా జరుపుకుంటున్నారు. ఆ వివరాలు చిత్రాలతో సహా ' ప్రవాస భారత సత్యనారాయణ వ్రతం ' ....

తెలుగు నేలకు దూరంగా ఉత్తర అమెరికా లో వుంటున్నా మన సంప్రదాయక కళలను, సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న సంస్థ ' సప్న ( SAPNA ) '. ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా అనేక సాహిత్య, సంగీత భరిత కార్యక్రమాలు నిర్వహిస్తూ పాతిక సంవత్సరాల మైలు రాయిని దాటింది ఈ సంస్థ. తమ ఎనిమిదవ వీణ ఉత్సవాన్ని ఈసారి భారత దేశంలో హైదరాబాద్ నగరంలో ఈ నెల 22 వ తేదీ, ఆదివారం రోజున జరుపుకుంటోంది. మధ్యాహ్నం గం. 2.00 నుండి రాత్రి గం. 8.00 ల వరకూ రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఆ సంస్థ పాతికేళ్ళ ప్రస్థానంపై డా. శారదపూర్ణ శొంఠి వివరణ " ' సప్న ' వీణ ఉత్సవం 2015  "  ......

ఇంకా ఎన్నో .....  



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 016

Thursday, February 5, 2015

' రజని ' కాంతుడు... శ్రీ గురుభ్యోనమః ... నండూరి యెంకి పాట... ఇంకా...

 సాహిత్యం, సంగీతం కలబోస్తే అవి ' రజని ' లాగా రూపు దిద్దుకుంటాయి. ముఖ్యంగా తెలుగునాట లలిత సంగీతం అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు బాలాంత్రపు రజని కాంతరావు. నూరేళ్ళ పరిపూర్ణ జీవితాన్ని సార్థకం చేసుకున్న మహనీయుడు మనందరం ' రజని ' గా పిల్చుకునే బాలాంత్రపు రజని కాంతరావు గారు.
గతవారం ఆయన నూరవ పుట్టినరోజున జరుపుకున్నాం. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని లలిత సంగీత ప్రియులు కోరుకుంటున్నారు.
తెలుగు జానపద గీతాలలో ' యెంకి పాటలు ' విశిష్ట స్థానాన్ని పొందాయి. వాటి సృష్టి కర్త కీ. శే. నండూరి వెంకట సుబ్బారావు గారికి అఖండమైన కీర్తిని అందించాయి. తన బావ కోసం ఎదురుచూసే యెంకి మదిలోని మధురోహలను జానపదుల భాషలో అందించారు నండూరి వారు.
ఇంకా.. ఎన్నో .. తాజాసంచిక ఈ క్రింది లింక్ లో .....

శిరాకదంబం 04_013  
 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 015
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం