Friday, December 19, 2014

ఎస్వీయార్.... సంగీతగని...బొబ్బిలియుద్ధం... ఇంకా

గిడుగు వారు ప్రారంభించిన వ్యవహరిక భాషోద్యమాన్ని అందిపుచ్చుకుని, ఆ బాటలో మరింత ముందుకెళ్లడానికి కృషి చేసిన ప్రముఖ రచయిత, పాత్రికేయుడు పురిపండా అప్పలస్వామి గారు మహాకవి శ్రీశ్రీ ని ప్రపంచానికి అందించారు. 1982 నవంబర్ 18 వ తేదీన పురిపండా వారు మరణించినప్పటి స్పందనే ' నవతకు ఎత్తిన జెండా '

గంభీరమైన రూపం, వాచకం, అభినయం ఆయన సొత్తు. తెలుగు చిత్ర రంగానికి ఆయనే యశస్వి ఎస్వీయార్. అనితర సాధ్యమైన, విలక్షణమైన శైలి ఆయన స్వంతం. తో. లే. పి. లో ' ఎస్వీ రంగారావు '.

ఇటీవల దివంగతులైన కర్ణాటక సంగీత దిగ్గజం నేదునూరి కృష్ణమూర్తి గారు తన గురువు డా. శ్రీపాద పినాకపాణి గారి గురించి చెప్పిన సంగతులు... గతంలో జరిపిన ఇంటర్వ్యూ నుంచి.....' సంగీతగని - పినాకపాణి '  

ఈ నెలలోనే స్వర్ణోత్సవం జరుపుకున్న చిత్రం ' బొబ్బిలియుద్ధం '

ఇంకా .... ఎన్నో ఈ క్రింది లింక్ లో....

శిరాకదంబం 04_010
 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 011

Sunday, December 14, 2014

తెలుగు బ్లాగు దినోత్సవం

 అంతర్జాలంలో తెలుగు భాషలోనే బ్లాగ్ లాంటి వేదికను పంచుకోవడానికి కృషి చేస్తూ మాతృభాషపై మమకారాన్ని,  గౌరవాన్ని చూపుతున్న తెలుగు బ్లాగర్లందరికీ ......



తెలుగు బ్లాగు దినోత్సవ శుభాకాంక్షలు
 
 ఈ సందర్భంగా జరుగుతున్న తెలుగు బ్లాగర్ల సమావేశ వివరాలు ......

  Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 010

Thursday, December 4, 2014

శ్రీనాధుడు.... ఏంజెలికా శ్రీరామ్.... ఛాయాదేవి... ఇంకా...




భారతీయ సంస్కృతి లో కళలు విశిష్టమైన స్థానాన్ని కలిగి వున్నాయి. అందులోనూ సంగీతం మరింత విశిష్టమైనది. గీతం, వాద్యం, నృత్యం ..... ఈ మూడిటి కలయికే సంగీతం అని ఆర్యోక్తి.
పొరుగింటి పుల్ల కూర రుచి ’ అని సామెత. అందుకే భారత దేశ యువత విదేశీ నృత్యాల వైపు ఆకర్షించబడుతుంటే విదేశీ యువత మన నృత్యాల వైపు ఆకర్షితులవుతున్నారు. అందుకు ఎన్నెన్నో ఉదాహరణలు. అందులో ఒక ఉదాహరణ ... జర్మనీ కి చెందిన ‘ ఏంజెలికా శ్రీరామ్ .... తో. లే. పి. ’ లో....
తెలుగు సాహితీ లోకాన్ని సుసంపన్నం చెయ్యడానికి చిరకాలంగా కవులు, రచయితలు కృషి చేస్తూనే వున్నారు. వారిలో ఎన్నదగిన కవి శ్రీనాధుడు. ఆయన రచనల గురించి ... ‘ కవిసార్వభౌముడు శ్రీనాధుడు ’
తెలుగు చలన చిత్రసీమ మనకు ఇద్దరు గయ్యాళి అత్తలను అందించింది. ఒక ప్రక్క సూర్యకాంతం తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తే, ఆమెకు దీటుగా నిలబడ్డ నటి ఛాయాదేవి. ఆమె గురించి ..... శబ్దకదంబం లో ‘ ఛాయాదేవి ’
ఇంకా ఈ సంచికలో చాలా ..... 

 Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 06 Pub. No. 009
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం