Friday, November 21, 2014

మా విశాఖ.... ' ద ' పద్యము....తిరుమలగిరి రాయ.... ఇంకా...

 విశాఖ అందాల నగరం.
కళలకు, కవులకు నిలయం.
తెలుగు సంస్కృతి విరబూసిన ఊరు.
అలాంటి సుందర నగరాన్ని హుద్ హుద్ తుఫాను కళా విహీనంగా చేసింది. ఆ విలయాన్ని తట్టుకొని తిరిగి చిగురిస్తున్న విశాఖ నగరం ఇప్పుడు క్రోంగొత్త శోభతో దర్శనమిస్తోంది.
ఆనాటి విశాఖ నగర వైభవాన్ని తెలియజేసే కవిత ' మా విశాఖ '

సాహిత్యంలో అనునిత్యం ఎన్నో ప్రయోగాలు జరుగుతూనే వున్నాయి... వుంటాయి. అలాంటి ఒక ప్రయోగమే ఏకాక్షర పద్యము... ' ద ' పద్యము.
ఎందరో నటీనటులను గోదావరి లాంచీ మీద చేర్చి బాపురమణ లు నిర్మించిన చిత్రం ' అందాలరాముడు '. ఆ చిత్రంలో ఒక పాత్ర పోషించిన డా. కె. ( కడియాల ) వివేకానందమూర్తి గారు వృత్తి రీత్యా డాక్టర్ అయినా ప్రవృత్తి రీత్యా మాత్రం యాక్టర్. ఆయన తో. లే. పి. ఈ సంచికలో.....
ఇంకా మరెన్నో .... ఈ క్రింది లింక్ లో ......
శిరాకదంబం 04_008  
  
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 008 

Friday, November 7, 2014

కార్తీక వనభోజనాలు.... విన్స్ తో. లే. పి. ...కాంతి జలపాతం... ఇంకా ....

దీపం జ్యోతి పరబ్రహ్మః
మన చుట్టూ ఆవరించి వున్న చీకటిని తిడుతూ కూర్చోవడం కంటే చిరు దీపాన్ని వెలిగిస్తే ఆ చీకటి పారిపోతుంది. అలాగే మనలోని అజ్ఞానమనే చీకటిని తరమడానికి జ్ఞానమనే దీపాన్ని వెలిగించుకుంటే మన జీవితం సుఖసంతోషాలతో గడచిపోతుంది.
మన సాంప్రదాయంలో దీపానికి అంతటి విశిష్టత వుంది. అందులోనూ కార్తీక దీపానికి మరింత విశిష్టత వుంది.
కార్తీక మాసంలో దేదీప్యమానంగా జ్వాలాతోరణం వెలిగించడం, దాని క్రింద నుంచి వెళ్ళడం ఒక ఆచారం.
అలాగే కార్తీక మాసం మరో విశిష్టతను కూడా కలిగి వుంది. అదే సామూహిక వన భోజనాలు. ఇందులో ఆథ్యాత్మికతతో బాటు సామాజిక పరమార్థం కూడా వుంది. అందులోనూ ఎవరికి వారుగా బ్రతికేస్తున్న ఈ హడావిడి తరంలో ఇలా బంధు మిత్రుల సమాగమం సంవత్సరానికి ఒకసారైనా జరగడం అవసరం.
" కార్తీక మాస ప్రాశస్త్యము ", " కార్తీక వన భోజనాలు "  .... ఇంకా చాలా  ....

శిరాకదంబం 04_007



Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 06 Pub. No. 007
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం