Sunday, May 3, 2020

బ్రాహ్మణాగ్రహారం... కరోనాలో ఒక భర్త... కరోనా - కథా కమామీషు... ఇంకా

 * వైదిక విద్యలన్నీ విడిచిపెట్టి కొత్తదారి తొక్కను నేను. మేరలేని ఆత్మానందమును అనుభవిస్తాను. అనుభవించగలుతున్నాను.... ఏంచేత అంటే తెలుగు భాషలో ఒక రచయితను కాగలిగినందుకు. నా మాతృభాషలో కలం పట్టి నాలుగు బంతులు రాసే అదృష్టం పట్టినందుకు, తెలుగు కథకుడినయినందుకు గర్విస్తున్నానని చెప్పిన శ్రీపాద వారి కథలను పరిచయం చేయడం కూడా ఒక అదృష్టమే. వారి ఆత్మవిశ్వాసం తెలుగువారందరికీ ఆదర్శం..... ' శ్రీపాద వారి కథలు ' శీర్షికన " బ్రాహ్మణాగ్రహారం " పరిచయం. 
* చపాతీలు గుండ్రంగానే ఎందుకుండాలి ? భూమి గుండ్రంగా ఉన్నా ప్రపంచపటంలో దేశాలు తమ మానాన్న తాము చక్కగా వంకరటింకరగా లేవా? అయినా ఎలా ఉంటే ఏమిటి లోపలికెడితే "వాతాపి జీర్ణం " కదా! అన్న నా వాదనకి ఫిదా అయ్యిపోయి..

మీకు బోల్డు జనరల్ నాలెడ్జుంది, కానీ పెనం గుండ్రంగా ఉంది కదా! ఇలాగే చెయ్యాలని, అన్ని పక్కలా చపాతీ  కాలడానికి గుండ్రంగానే చేయాలని, అన్నీ తనే చేసి చూపించిన మా ఆవిడకి జోహార్..... ' కరోనా కారణంగా నిర్బంధం ' శీర్షికన " కరోనాలో ఒక భర్త "
* కరోనా అన్నది సంస్కృత పదమట ! వివరాలకు వస్తే .. కరోనా అన్నది. సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించి విడుదల సమయాన నల్లటి సూర్య బింబం కి చుట్టూ circumferential గా తెల్లని ఒక వెలుగు రేఖ కనబడుతుందట.. ఆ వెలుగు (మెరుపు) రేఖ పేరే కరోనా ట ! అదండీ సంగతి ?....
' కరోనా కారణంగా నిర్బంధం ' శీర్షికన " కరోనా - కథా కమామీషు "
ఇంకా.... ఈ క్రింది లింక్ లో...... 

Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 11 Pub. No. 015

Saturday, April 18, 2020

చివరకు మిగిలేది...క.కా.ని.- క్వాలిటీ టైమ్... క.కా.ని. - కల్కి అవతారం కరోనా...... ఇంకా....

 * కోమలి తనను ఎవరో జమీందారు చేరదీసి చదువు చెప్పించాడని గొప్పలు చెప్పుకుంటూ ఆఖరున జమిందారు ముఖం చాటేశాడనీ, జరుగుబాటు కష్టంగా ఉంది కనక ఒక రెండు వందల రూపాయలు మనియార్దరు చేయమని కోరుతూ ఉత్తరం రాస్తుంది...' కథావీధి ' శీర్షికన బుచ్చిబాబు " చివరకు మిగిలేది " 

*  పెళ్ళి అనగానే పెద్దవాళ్ళు, ఎంత ప్లాన్ వేసుకుంటారో, ఎన్ని వస్తువులు సమకూర్చుకుంటారో అలాగే బొమ్మల పెళ్ళి ఆటకు మేమూ అంతే హైరాన పడిపోయే వాళ్ళం. పెళ్ళంటే డబ్బు, దస్కం, మందీమార్బలం కావాలన్నట్టు బొమ్మల పెళ్ళి ఆటంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ ఆటకు బోలెడంత హంగు కావాలి..... ' కరోనా కారణంగా నిర్బంధం ' ప్రత్యేకంలో అమెరికా ఇల్లాలి ముచ్చట " కరోనా వైరస్ - క్వాలిటీ టైమ్ "


* హాయిగా ఆరగిస్తున్నా.
గోవిందా....! అని పైకి పిలుస్తూనే
కోర్కెల స్తోత్రాలతో శబ్దకాలుష్యం లేదిపుడు...' కరోనా కారణంగా నిర్బంధం ' ప్రత్యేకంలో " నే బాగున్నా!...మీరు ? "


* మనిషి విచ్చలవిడితనానికి కళ్ళెం వేసేందుకే ఈ కరోనా వచ్చింది. అదుపు తప్పిన విశృంఖలత్వాన్ని కట్టడి చేస్తుంది ఈ కరోనా. మనిషికి తన స్థానాన్ని చూపి బుద్ధి, క్రమశిక్షణ నేర్పుతుంది ఈ కరోనా. ఈ భూగోళం సమస్త జీవరాశి ది అని మానవుడు పూర్తిగా తెలుసుకుంటాడు..... ' కరోనా కారణంగా నిర్బంధం ' ప్రత్యేకంలో " కల్కి అవతారం కరోనా "

ఇంకా... చాలా... ఈ క్రింది లింక్ లో...... 


Visit web magazine at https://sirakadambam.com/ 
Vol. No. 11 Pub. No. 014
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం