▼

Thursday, February 18, 2021

" సూర్యస్తుతి ".... " పెద్ద తరంగం ".... " రాయల యుగం - స్వర్ణయుగం "... ఇంకా

 *

మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నా అందరికీ ప్రత్యక్ష దర్శనం లభించదు. అయితే రోజూ ప్రత్యక్ష దర్శన భాగ్యం కలుగజేసే దైవం సూర్యనారాయణుడు. అందుకే ఆయనను ప్రత్యక్ష దైవం అంటుంటాం. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యరశ్మి లో భూమి మీద ఉండే జీవులన్నిటికీ అవసరమైన పోషకాలు, రక్షకాలు ఎన్నో ఉంటాయి. వాతావరణ పరిస్థితులను కూడా సూర్యుడు ప్రభావితం చేస్తాడు. భూమికి కావల్సిన వెలుతురుని అందించేది సూర్యుడే. ఇలా ఎన్నో విధాలుగా భూమి మనుగడకు, భూమి మీద జీవం మనుగడకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణభూతుడవుతున్న ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు..... " సూర్యస్తుతి "

*    

వేసంగి శలవలకి వచ్చిన నాకు, ఈ పాటలు గమ్మత్తుగా ఉండేవి! ఎందుకంటే అప్పటికే చెన్నపట్నంలో శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ, వర్ణాలూ, త్యాగరాయకృతులూ, దివ్యనామ కీర్తనలూ పాడటం వచ్చి, కాస్త గర్వం పెరిగిన రోజులవి! పైగా పదాలూ తిల్లానాలూ కూడా పాడే స్థాయికొచ్చానాయె!! ఈ తరంగాలూ, అష్టపదులూ, ఆధ్యాత్మరామాయణకీర్తనలూ బోలెడన్ని చరణాలతో, కాస్త చాదస్తపు రాగాల్తో (అని అప్పటి నా ఉద్దేశం) ఈ సంగీతం నేర్చుకోని వాళ్లు పాడుతూంటే...చెప్పొద్దూ!! నాకేవంత గొప్పగా అనిపించేది కాదు.... " పెద్ద తరంగం "

* 

రాయల పాలనలో రాజ్యమంతటా అన్ని మతాల వారూ యథేచ్ఛగా ప్రశాంత జీవనం గడిపారని బార్బోసా అనే విదేశీయుడు పేర్కొన్నాడు. పాడిపంటలతో ఎంతో సుభిక్షంగా రాయలు రాజ్యపాలన చేసిన తీరుని విదేశీ యాత్రికులు ఎంతగానో ప్రశంసించారు. రత్నాలు రాశులుగా పోసి అమ్మడం ప్రపంచంలో ఎక్కడా లేదని కూడా వీరి రాతల వల్ల తెలుస్తోంది. 16వ శతాబ్ది కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగమనే చెప్పాలి..... " రాయల యుగం - స్వర్ణయుగం "

ఇంకా చాలా... ఈ క్రింది లింక్ లో.... 

శిరాకదంబం 10_013


 

 

Visit web magazine at https://sirakadambam.com/

 Vol. No. 12 Pub. No. 012

No comments:

Post a Comment

వ్యాఖ్యలు