▼

Tuesday, July 26, 2011

పెళ్ళికొడుకు – ప్రేతం

ప్రముఖ విమర్శకుడు, విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి గారు హాస్య సంభాషణకు పెట్టింది పేరు. ఒకసారి రెడ్డి గారిని నెల్లూరులో ఒక సభకు అధ్యక్షత వహించవల్సిందిగా అభ్యర్థన వచ్చింది. ఆయన అంగీకరించారు. సభాస్థలికి వచ్చారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం ఇవ్వడానికి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆయన్ని ఊరేగింపుగా తీసుకెళ్లడానికి ఓ ఏనుగును కూడా సిద్ధం చేశారు. బ్యాండ్ మేళం కూడా సిద్ధంగా వుంది. ఇక రెడ్డి గారు ఏనుగు మీద కూర్చోవడేమే తరువాయి.

రామలింగారెడ్డి గారు ఆ ఏర్పాట్లన్నీ చూసి, విషయం తెల్సుకుని నిర్వాహకులతో ...

" ఇలా ఊరేగింపుగా తీసుకెళ్లడానికి నేనేమీ పెళ్లికొడుకూనూ కాను..... ప్రేతాన్నీ కాను " అన్నారట.



Vol. No. 02 Pub. No. 289

No comments:

Post a Comment

వ్యాఖ్యలు