జగ్గయ్య గారికి గంభీరమైన స్వరంతో బాటు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగానే ఉండేది. ఓసారి ఆయన షూటింగ్ కోసం లొకేషన్ కి చేరుకున్నారు. కానీ అక్కడ షూటింగ్ జరగడం లేదు. అందరూ ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
" ఏమిటి షూటింగ్ ఇంకా ప్రారంభించలేదు ? " అని అడిగారు జగ్గయ్యగారు.
" ఇంకా సీన్ సిద్ధం కాలేదు. రచయిత గారు అదిగో ... ఆ ప్రక్కన కూర్చుని రాస్తున్నారు " అన్నాడట ఆ చిత్ర దర్శకుడు.
దానికి కొనసాగింపుగా సహాయ దర్శకుడు " సీన్ చాలా బాగా వస్తున్నట్లుంది సార్ ! రైటర్ గారు రాస్తూ ఏడుస్తున్నారు. " అన్నాడు.
" సీన్ రాస్తూ ఏడుస్తున్నారో, రాయలేక ఏడుస్తున్నారో ముందు కనుక్కో బాబూ ! " అన్నారట జగ్గయ్య గారు.
Vol. No. 02 Pub. No. 107
:)
ReplyDelete:) రావు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteమీ బ్లాగ్గడపలోకి కాలు పెడితే ఇదే ఇబ్బంది రావు గారు,ఆలంకె,ఈ లంకె చూస్తూ కనీసం ఓ గంటన్నా గడపాల్సుంటుంది :)
ReplyDelete* అను గారూ !
ReplyDelete* లలిత గారూ !
ధన్యవాదాలు
* రాజేంద్రకుమార్ గారూ !
మీ అభిమానానికి కృతజ్ఞతలు