▼

Saturday, February 20, 2010

విలక్షణ హాస్య నటుడు కన్నుమూత

తెలుగు చలన చిత్ర రంగంలో విలక్షణ హాస్య నటుడిగా ప్రఖ్యాతిగాంచిన పద్మనాభం ఈరోజు ఉదయం కన్నుమూసారు. ఆ వార్త ఇక్కడ చూడండి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ...........


Vol. No. 01 Pub. No. 203

10 comments:

  1. :(..ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ

    ReplyDelete
  2. మరో ఆణిముత్యం తెలుగు తెరకు కనుమరుగయ్యింది. నిర్మాతగా, నటుడిగా మంచి మనిషిగా అందరికీ ఆత్మీయుడు...నేను మద్రాసులో ఉన్నప్పుడు అనేక సార్లు కలవగలిగాను "ఏరా అబ్బాయ్" అంటూ ఆత్మీయంగా పిలిచేవారు.... తెలుగు భాష అంటే వల్లమాలిన అభిమానం ఆయనకి...వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ....

    సతీష్ యనమండ్ర

    ReplyDelete
  3. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ఠిస్తూ
    -గిరిధర్ పొట్టేపాళెం

    ReplyDelete
  4. * అజ్ఞాత గారూ !
    * సతీష్ గారూ !
    * గిరిధర్ గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete
  5. మా తాడిపత్రికి దగ్గరగా ఉన్న సింహాద్రిపురంనుంచి చిత్రసీమకొచ్చినవారు.మా పద్మనాభమని చెప్పుకునేవాళ్ళం.అదోగొప్ప మాకు ఎందుకంటే చిత్రసీమలో మాప్రాంతంవారు చాలా తక్కువ కాబట్టి.పద్మనాభం గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.

    ReplyDelete
  6. పద్మనాభంగారి ఆత్మకి శాంతి కలగాలండి. చెన్నైలో ఒక్క సినీ ప్రముఖులు కూడా పలకరించటానికి పోలేదని టి.వి. లో చూసి బాధనిపించింది.

    ReplyDelete
  7. * విజయ మోహన్ గారూ !
    * జయ గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete
  8. పద్మనాభం గారి మరణం తెలుగు సినీ ప్రపంచానికి తీరని లోటు. ఆయన చివరి రోజులు ప్రశాంతంగా జరగలేదని, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమైనారని తెలిసి ఎంతగానో అవేదన చెందాము. ఒకానొక సందర్భంలో, పద్మనాభంగారు ఎటువంటి భేషజం లెకుండా చెప్పిన ఒక సంఘటన.

    మదరాసు వచ్చిన కొత్తల్లో నాగయ్యగారి సినీ కంపెనీలో ఉండి అక్కడే తిండి నిద్రగా ఉండేదిట. నాగయ్యగారు ఒక సినీ కంపెనీలాగ కాకుండా, అన్నార్తుల పాలిటి ఒక సత్రంలాగ అందరినీ ఆదరించేవారుట. కొంతకాలనికి పద్మనాభం గారు సినీ లోకంలో నిలదొక్కుకుని తనంతట తానుగా సినిమాలు తీసే స్థాయికి ఎదిగారు. ఆ సందర్భంలో ఒకానొక సినిమా షూటింగు విరామ సమయంలో, అందరితో బాటుగా నాగయ్యగారు, సినీ ప్రొడక్షన్ వారు ఏర్పాటుచేసిన లంచ్ తీసుకుంటున్నారుట. అప్పుడు అది చూసిన పద్మనాభం గారు, ఆయన కాళ్ళకు మొక్కి, తాను మదరాసుకు వచ్చిన కొత్తల్లో ఆయన అఫీసులో ఆశ్రయం పొందటం గురించి గుర్తుకు తెచ్చుకున్నారుట. అప్పుడు నాగయ్య గారు, "నాయనా ఆ రోజులలో నిన్ను చక్కగా ఆదరించారుకదా, నీకు కావలిసినవి అందినాయి కదా" అని వాకబు చేశారుట. ఈ విషయాన్ని కళ్ళనీళ్ళ పర్యంతంగా గుర్తుకు తెచ్చుకున్న పద్మనాభంగారు, నాగయ్య గారిలాగానే చివరకు ఇబ్బందులు పడటం విచారకరం. ఈ సినీ మాయలోకంలో డబ్బుకు ఇచ్చిన విలువ మనిషికి, ఆ మనిషిలో ఉన్న నటునికి అంతగా ఇవ్వకపోవటం బాధ కలిగించే విషయం.

    ReplyDelete
  9. శివ గారూ !
    నిజమే ! పద్మనాభం గారికి ఒక నటునిగా నట'కులం' నుంచి సరైన ఆదరణ దొరికినట్లు కనబడదు. ఇప్పుడింక ఏమైనా అవసరం లేదుగా ! దన్యవాదాలు

    ReplyDelete
  10. vilakshana natudu Padmanaabham
    sancika 20/2/2010

    Padmanaabham cuvari rojulalo kashthapadina maata nijame. kaanii taanu baagunnaappudu konta mandini aadukunna mahaanu bhaavudu. SPBala Subrahmanyam intativaadu kaavadaaniki, Padmanaabham protshame. jiivitamlo ciikati velugulu saamaanyame kadaa.!










































































    ReplyDelete

వ్యాఖ్యలు