▼

Wednesday, November 24, 2010

కత్తిరింపులు


ఓసారి హైదరాబాద్ లోని నగర కేంద్ర గ్రంధాలయంలో కవి సమ్మేళనం జరుగుతోంది. దానికి ముఖ్య అతిధిగా డాక్టర్ సి. నారాయణరెడ్డి గారు వచ్చారు. ఆచార్య ఎన్. గోపి అధ్యక్షత వహించారు. సినారె గారి ఉపన్యాసాలలో సహజంగా చమత్కారం పాలు ఎక్కువ.

ఆరోజు ఉపన్యాసం ప్రారంభిస్తూ ఆయన
" వేదికనలంకరించిన డా. గోపి, డా. ఎస్వీ, డా. శిఖా ...... " అని ఆగారు. ఆహ్వానితులందరూ గొల్లున నవ్వారు.

నారాయణరెడ్డి గారు కొనసాగిస్తూ
" అవును మరి .... అధ్యక్షత వహించిన గోపి పేరులో రెండు అక్షరాలే వున్నాయి ! వేదిక మీద కూర్చున్న డా. ఎస్వీ సత్యనారాయణ గారు వాడుకలో ఎస్వీ అని రెండు అక్షరాలకి కత్తిరించుకుని వాడుతున్నారు కదా ! మరో డాక్టర్ శిఖామణి కూడా వాళ్ళతో సమానంగా వేదిక మీద కూర్చున్నాడు. అందర్నీ సమానంగా చూడాలి కదా ! అందుకే ఆయన పేరును కూడా నేను వాళ్ళతో సమానంగా రెండు అక్షరాలకు కత్తిరించాను " అని చమత్కరించారు సినారె.

Vol. No. 02 Pub. No. 065

4 comments:

  1. dr c narayanareddy gari vupanyaasaalu chuthurokthula sammilithaalu.sammohithaalu-santoshadaayakaalu--voleti venkata subba rao,vernon hills-IL/USA

    ReplyDelete
  2. సుబ్బారావు గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete
  3. మీ "శిరా" లో భలే చమ్మక్కులు ఉంటాయండి
    "SR " గారు
    నేను కూడా మొదటి రెండు అక్షరాలూ రాసా :-))

    ReplyDelete
  4. శాస్త్రి గారూ !
    మీ చమక్కులు మరీ బాగున్నాయి. ధన్యవాదాలు.

    ReplyDelete

వ్యాఖ్యలు