▼

Tuesday, August 10, 2010

శ్రీలు పొంగిన జీవగడ్డయి.....




రాయప్రోలు సుబ్బారావు గారి కలం నుండి జాలువారిన ఈ దేశభక్తి గీతం
మిత్రుడు పార్థసారధి గళం నుండి
దుగ్గిరాల స్వరం కల్పనతో వినండి.





శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు
రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా !              [[ శ్రీలు ]]

వేదశాఖలు పెరిగెనిచ్చట ఆదికావ్యం అందినిచ్చట
వేదశాఖలు పెరిగెనిచ్చట ఆదికావ్యం అందినిచ్చట

బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా !
బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా !!    [[ శ్రీలు ]]

నీలి కిన్నెర మేళవించి   రాయి కరుగగ రాగమెత్తి 
నీలి కిన్నెర మేళవించి   రాయి కరుగగ రాగమెత్తి

పాల తీయని బాలభారత పదము పాడరా తమ్ముడా !
పాల తీయని బాలభారత పదము పాడరా తమ్ముడా ! !       [[ శ్రీలు ]]

నవరసమ్ములు నాట్యమాడగా చిగురు పలుకులు చెవులు విందుగా
నవరసమ్ములు నాట్యమాడగా చిగురు పలుకులు చెవులు విందుగా

కవితలల్లిన కాంతి హృదయము గారవింపవే చెల్లెలా !
కవితలల్లిన కాంతి హృదయము గారవింపవే చెల్లెలా ! !        [[ శ్రీలు ]]

పాండవేయుల పదును కత్తుల మండి మెరిసిన మహిత రణకథ
పాండవేయుల పదును కత్తుల మండి మెరిసిన మహిత రణకథ

కండగల చిక్కని తెలుగుంల కలసి పాడరా తమ్ముడా !
కండగల చిక్కని తెలుగుంల కలసి పాడరా తమ్ముడా ! !      [[ శ్రీలు ]]





Vol. No. 01 Pub. No. 370

18 comments:

  1. మంచి మంచి పాటలను పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు మిత్రమా.

    ReplyDelete
  2. అద్భుతం , చక్కని పాటను మరీ మరీ వినేటట్లు చేశారు . ధన్య వాదాలు . ఒక చింతించ వలసిన విషయం యెమంటే ఇంత చక్కని ఆనంద దేశభక్తి గేయాన్ని లీడర్ సినిమా కోసం బాక్ గ్రౌండ్ శాడ్ మ్యూజిక్ గా , హీరో తండ్రి అంత్య క్రియా కర్మ ల లో వాడుకొని దాని విలువను పొగొట్టిన మన డైరెక్టర్ గారు , దానికి అనుమతించిన సెన్సార్ వారు అపవిత్రం చేశారు .

    ReplyDelete
  3. Dear Anonymous,

    Everybody likes to know the name of a philanthropist. You should have revealed yours.

    Rao garu,

    The song simply took me back to my school days.

    ReplyDelete
  4. * భా. రా. రె. గారూ !
    కృతజ్ఞతలు

    * అజ్ఞాత గారూ !
    నిజమేనండీ ! ఇలాంటి విషయాలు వారి వారి విజ్ఞత మీద ఆధారపడి వుంటాయి. ధన్యవాదాలు.

    * మాధురి గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete
  5. పైన anonymous కామెంట్ నాదే , అది విమర్శ కాదనుకొంటాను.సినేమా చూస్తూ పడ్డ మా బాధ మాత్రమే నా బ్లాగ్ srisri-kavitalu.blogspot.com .ఇంతకు పై పాటను నేను యెక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చో చెప్ప గలరు . మరీ మరీ ధన్యవాదాలతో

    ReplyDelete
  6. రాంబాబు గారూ !
    అర్థమయిందండీ ! ఆ పాటను ఇక్కడ వున్న ప్లేయర్ లో కుడిప్రక్క ' Divshare ' ను క్లిక్ చెయ్యండి. నేను అప్లోడ్ చేసిన పేజి తెరుచుకుంటుంది. అక్కడనుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

    ReplyDelete
  7. sir,paata lo 'ralinadi' ani rasaru adi 'raalinada' 'varalinada' ?
    chinnappudu,'varalinadi' ante alararindi ane ardham tho padevallam.telupagalaru.thanks

    ReplyDelete
  8. Patriotic composing by talented singer Parthu....Wish you a great success ahead......

    Chandu

    ReplyDelete
  9. saarathi gaaruu adbhutam gaa paadaaru. thanks lots

    ReplyDelete
  10. * అజ్ఞాత గారూ !
    ధన్యవాదాలు. ఒకసారి పరిశీలించి సరి చేస్తాను.

    * చందు గారూ !
    * asr గారూ !

    ధన్యవాదాలు. మీ ప్రశంసలు పార్థు గారికి చేరుస్తాను.

    ReplyDelete
  11. చాలా మంచిపాటండీ. నాకు ఇప్పటికీ గుర్తుండిపోయిన పాట. కానీ మూడో లైను - వేదశాఖలు వెలిసెనిచ్చట, ఆదికావ్యంబమరెనిచ్చట అని గుర్తు. నేను మరిచిపోయేనో, దీనికి పాఠాంతరం ఉందో మరి. ఏమైనా చక్కనిపాట అనడంలో సందేహం లేదు.
    పూర్తిపాఠం ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా.

    ReplyDelete
  12. మాలతి గారూ !

    ధన్యవాదాలు. మీరు విన్నది అసలైనదే కావచ్చు. నేను అసలు ప్రతి కోసం ప్రయత్నించి, పరిశీలించి వివరణ ఇస్తాను.

    ReplyDelete
  13. పద్యాలని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు

    ReplyDelete
  14. * సూర్యుడు గారూ !
    * లోకేష్ శ్రీకాంత్ గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete
  15. chinnappudu school lo teacher garu nerpinchaaru aug 15 kosam ..thank for reminding a beautiful song

    ReplyDelete
  16. ఎన్నెల గారూ !
    ధన్యవాదాలు.

    ReplyDelete
  17. Dear Blogger,

    "Telugu Tejamu Deepthi Chendaga" ane song chaala chaala baguntundi. Meeku veelu unte, adi upload cheyagalaru.

    Itlu,
    Sai Praveen Manchiraju.

    ReplyDelete

వ్యాఖ్యలు