కనుక్కోండి చూద్దాం - 18
జవాబు
ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చిన ముగ్గురికీ ( శ్రీరాం గారు, కె.కె. గారు, అజ్ఞాత గారు ) , ప్రయత్నించిన మాదురిగారికి ముందుగా ధన్యవాదాలు. అలాగే face book ద్వారా
"sterday question answer entandi?
m.s rama rao gaara?"
అంటూ జవాబు ఇచ్చిన సంతోష్ దోసపాటి గారికి కూడా ధన్యవాదాలు.
ఇక జవాబు విషయానికి వస్తే........
* శ్రీరాం గారూ ! - రామానాయుడు గారు తమ స్వంత చిత్రాల్లో ఎక్కువగా అతిథి పాత్రలు ధరించారు. కానీ పాటలేమీ పాడలేదు.
* కె. కె. గారూ ! - బి. ఏ. సుబ్బారావు గారు కూడా పాటలు పాడలేదండి.
* సంతోష్ గారూ ! - ఎం.ఎస్. రామారావు గారు గాయకుడే గానీ నిర్మాత - నటుడు కాదండి.
* అజ్ఞాత గారూ ! - ముందుగా మీ పేరు కూడా రాసి వుంటే బాగుండేది. మీరు చెప్పిన సమాధానం సరైనదే ! ఆ నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య గారే !
పుండరీకాక్షయ్య గారు మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, ఆరాధన ( NTR ) వంటి చిత్రాలు నిర్మించారు. పల్లెటూరు చిత్రంతో ప్రారంభించి కొన్ని చిత్రాలలో వేషాలు వేసినా, 1991 లో వచ్చిన కర్తవ్యం లో ముద్దుకృష్ణయ్య పాత్రతో విలన్ గా, కారెక్టర్ నటునిగా పేరు తెచ్చుకున్నారు.
Vol. No. 01 Pub. No.319

SR Rao గారు
ReplyDeleteనటుడు మోహన్ బాబు కూడా నిర్మించి నటించిన
"అప్పుచేసి పప్పుకూడు" సినిమాలో పాటపాడాడు
Mohan Babu naa? EDiSaaDu, vaaDi paaTa , naa paaTa okaTE!
ReplyDelete* ఖలీల్ జీబ్రాన్ గారూ !
ReplyDeleteనేను ఇంతకుముందు http://sirakadambam.blogspot.com/2010/06/blog-post_2302.html లో పాట ఇచ్చి అడిగిన ప్రశ్నకు ఇది జవాబు. ధన్యవాదాలు.
* అజ్ఞాత గారూ !
ఎవరైనా, ఎలాంటివారి మీదనైనా నిందాపూర్వక విమర్శ మంచిది కాదని నా అభిప్రాయం. మీ పేరుతో వ్యాఖ్య రాస్తే బాగుండేది.
while browzing for the singer of the song, I came across the name ' atluri' but didn't make an effort to know if he was also a producer and actor.I donot know him as an actor also, though I've seen many old movies. If possible, please mention his roles in a few films along with the names of the films.
ReplyDeleteMS Ramarao sang a song in 'pichhi pullaiah'. But I was sure he was not a producer and an actor.
@ anonymous:
ReplyDeleteyou might not like mohan babu's singing but have to accept that he's a true music lover because he proved it. You shouldn't have commented so low about him.
మాధురి గారూ !
ReplyDeleteపుండరీకాక్షయ్య గారు ఈ క్రింది చిత్రాల్లో నటించారు. పాత్రలు అన్నీ ఖచ్చితంగా చెప్పలేను
1952 - పల్లెటూరు
1953 - అమ్మలక్కలు
1953 - పిచ్చిపుల్లయ్య
1954 - తోడుదొంగలు - పనివాడు
1955 - జయసింహ
ఆ తర్వాత 1991లో 'కర్తవ్యం ' వరకూ నటించిన దాఖలాలు లేవు. అందులో విలన్ ముద్దుక్రిష్ణయ్య పాత్రతో మళ్ళీ ప్రారంభించి రాజేశ్వరి కళ్యాణం, ప్రాణదాత, పోలీసు బ్రదర్స్ మొదలైన చిత్రాల్లో నటించారు.