ఆశ
అమ్మ చందమామని తెచ్చిస్తుందనే ఆశ
చిన్నప్పుడు బువ్వ తినిపిస్తుంది
తోటి పిల్లలతో ఆడుకోవచ్చనే ఆశ
బడికి పంపి అక్షరాలు దిద్దిస్తుంది
మంచి ఉద్యోగం వస్తుందనే ఆశ
ఉన్నత చదువులు చదివిస్తుంది
జీవితానికో తోడు కావాలనే ఆశ
పెళ్లి దాకా నడిపిస్తుంది
వంశాభివృద్ధి చెయ్యాలనే ఆశ
ముద్దులొలికే పిల్లల్ని ఇస్తుంది
వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆశ
కష్టబడి సంపాదించేటట్లు చేస్తుంది
శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనే ఆశ
పిల్లలమీద ఆధారపడేటట్లు చేస్తుంది
అది నిరాశ కాకూడదనే ఆశ
మరణందాకా నడిపిస్తుంది
జీవన ప్రయాణానికి ఆశే ఇంధనం
గమ్యాన్ని చేరడానికి అదే ఆలంబన
Rao Garu really Exceleent.... superbbbb gaa vrasaru.... aasha adbutam....
ReplyDeleteబుజ్జి గారూ !
ReplyDeleteవిజయ మోహన్ గారూ !
కృతజ్ఞతలు
అద్భుతమైన ఆశండి!
ReplyDeleteచాలా బాగుందండి.
ReplyDeleteపద్మార్పిత గారూ !
ReplyDeleteతృష్ణ గారూ !
కృతజ్ఞతలు.
meeru vrasina aasa kavitha manasuku haddukunelaa undi...vastavaanni chaala chakkagaa raasaru.
ReplyDeletechala chala nachindi...
హాసిని గారూ !
ReplyDeleteశిరాకదంబానికి స్వాగతం. కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
sare sir mee aasha kavitha bagundi
ReplyDeletemari meeru ee kavithanu
e ashatho rasaaru cheppaledu
శ్రీ జాబిలి గారూ !
ReplyDeleteశిరాకదంబానికి స్వాగతం. నా ' ఆశ ' ను మీరందరూ చదువుతారని, అందరూ తమకు తెలిసిన జీవితాన్ని మరోసారి దర్శించుకుంటారనే ఆశతో రాసాను.
కవితచాలాబాగుంది
ReplyDeleteప్రతిపదం వర్తమానానికి ప్రతీక
కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి
వీరభద్ర శాస్త్రి గారూ !
ReplyDeleteశిరాకడంబానికి స్వాగతం. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
అమ్మ పొత్తిళ్ళలో పాల కోసం ఆశ నుంచి..
ReplyDeleteపోయేటప్పుడు బ్రతకాలనే ఆశ వరకు..
మనిషి జీవితమే ఆశ
అందుకే కదా మనిషి ఆశ జీవి అనేది
కాని ఈ ఆశల్లో కల ప్రతీ శ్వాసను
కళ్ళ ముందు నిలిపారు..
చాలా బాగుంది మీ కవితాశ ...
రమేశ్ గారూ !
ReplyDeleteశిరాకదంబానికి స్వాగతం. ' ఆశ ' లోని ఆంతర్యాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు.
This comment has been removed by the author.
ReplyDeleteaasha aasha gane migili potundi
ReplyDeleteaasha marokaripina aadhara padela chestundi
aasha vastavaniki dooranga untundi
kaani manishi tananu taanu nammi napude aakanksha neraveru tundi
tananu taanu shodinchinapude vastavam telustubdi.....