tag:blogger.com,1999:blog-4017716071777158312.post7757730394597309166..comments2024-02-09T02:09:25.337+05:30Comments on శిరా కదంబం: పుస్తకాల పండుగSRRaohttp://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-4017716071777158312.post-767020800419271882011-01-12T10:27:19.985+05:302011-01-12T10:27:19.985+05:30* అఫ్సర్ గారూ !
ధన్యవాదాలు. హైదరాబాద్ లో వున్నప్పు...* అఫ్సర్ గారూ !
ధన్యవాదాలు. హైదరాబాద్ లో వున్నప్పుడు అక్కడ, విజయవాడలో వున్నప్పుడు ఇక్కడ తప్పనిసరిగా పుస్తక ప్రదర్శనలకు రెండు మూడుసార్లు వెళ్ళడం అలవాటు. పనుల వత్తిడుల వల్ల, ఊళ్ళో లేకపోవడం వల్ల ఈసారి ఒకేసారి అదీ చివరి రోజు మాత్రమే కుదిరింది. క్రిందటి సంవత్సరం 'ఇ - తెలుగు' వారి కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈసారి వారు ఎందుకో మౌనం వహించారు. కారణం తెలీదు.

* తృష్ణ గారూ !
ధన్యవాదాలు. ఒకసారి ఏయే పుస్తకాలు వున్నాయో, కొత్తవి ఏవి వచ్చాయో చూడడానికి వెళ్ళేవాడిని. మరోసారి నిర్ణయించుకున్న పుస్తకాలు కొనడానికి వెళ్ళేవాడిని. కనీసం ఒకేరోజులో రెండో రౌండ్ లోనైనా కొనేవాడిని. నిన్న మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ప్యాకింగ్ మొదలుపెట్టేసారు. నిర్ణయించుకుని అన్నీ కొనే అవకాశం దొరకలేదు కానీ ' పథేర్ పాంచాలి ' నవలకు మద్దిపట్ల సూరి గారి అనువాదం ... భమిడిపాటి కామేశ్వరరావు గారి హాస్యవల్లరి, మొదలి నాగభూషణ శర్మ గారి 'అలనాటి గ్రామఫోన్ గాయకులు' కొన్నాను. వాటిలోని విశేషాలు త్వరలోనే అందరికీ అందిస్తాను. అన్నట్లు భరణి గారి ' నక్షత్ర దర్శనం ' పుస్తకం చూడగానే మీరు గుర్తుకొచ్చారు.

* భాను గారూ !
ధన్యవాదాలు. ఈ సంవత్సరం కూడా 'ఇ - తెలుగు' వారు కార్యక్రమం ఏర్పాటు చేస్తారనుకున్నాను. బ్లాగ్మిత్రులు కలుస్తారనుకున్నాను. ఎందుకో అది జరగలేదు. బహుశా పనుల వత్తిడి వల్ల అనుకుంటాను. నాకు కూడా అదే పరిస్థితి. పుస్తక ప్రదర్శనకు వెళ్ళకపోతే ఆ సంవత్సరమంతా ఏదో వెలితి. అందుకని నిన్న వీలు చేసుకుని మరీ వెళ్లాను.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-3244921197843029152011-01-12T08:42:46.122+05:302011-01-12T08:42:46.122+05:30విజయవాడ పుస్తక పండగ కు వెళ్ళాలన్న నా కోరిక కోరిక గ...విజయవాడ పుస్తక పండగ కు వెళ్ళాలన్న నా కోరిక కోరిక గానే మిగిలిపోయింది. ఈ సారి ఎలా అన్న వెళ్ళాలి అనుకుంటే అస్సలు వీలు కాలేదు . జనవరి ఒకటో తారీఖు నుంచి చూస్తున్న ఎవ్వరయిన ఈ ఫెస్టివల్ గురించి రాస్తారేమోనని అదేంటో మరి ఎవ్వరూ రాయ లేదు. చివరికి మీరు రాశారు సంతోషం. మొన్న ఓ మిత్రురాలినుంచి ఫోన్ కాల్ .. భాను గారూ నేను బుక్ ఫెస్టివల్ లో ఉన్న ఎమన్నా కావాలా అని .. వెళ్ళినంత సంతోష మనిపించింది. ఇంకా ఎమన్నా విశేషాలుంటే రాయండి.భానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-37615090551914843092011-01-12T08:19:24.882+05:302011-01-12T08:19:24.882+05:30అహా...! మా బెజవాడ ఫోటో చూపెట్టారు...ధన్యవాదాలు. పధ...అహా...! మా బెజవాడ ఫోటో చూపెట్టారు...ధన్యవాదాలు. పధ్నాలుగేళ్ళపాటు ఆ పుస్తక మహోత్సవం వదలకుండా ప్రతిసారీ నాలుగైదు మార్లు వెళ్ళేవాళ్ళం...మీరు కొన్న పుస్తకాల కబుర్లు..ఇంకా వివరాలు రాయండి.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-4017716071777158312.post-15951393571073517902011-01-12T01:07:23.444+05:302011-01-12T01:07:23.444+05:30బెజవాడ బుక్ ఫెస్టివల్ గురించి ఎవరూ రాయలేదేమిటా అన్...బెజవాడ బుక్ ఫెస్టివల్ గురించి ఎవరూ రాయలేదేమిటా అన్న అసంతృప్తి వుంది ఇప్పటి దాకా.

బెజవాడ బ్లాగ్ లోకం మేలుకోవాలి!

మీరు అయినా రాయడం సంతోషం. మరిన్ని కబుర్లు రాస్తారని ఎదురుచూస్తూ...Afsarhttps://www.blogger.com/profile/09637143469979636142noreply@blogger.com