Sunday, April 19, 2015

కోడి రామకృష్ణ....సాహసం ' మస్తమల్లి ' పథం.... సంస్మరణ... ఇంకా....

 రాజకీయం, సినిమా, క్రికెట్ రంగాలే కాదు.... ప్రభుత్వాలు, మీడియా పట్టించుకోవాల్సిన, ప్రాధాన్యం ఇవ్వవలసిన రంగాలు ఇంకా చాలా వున్నాయి.ఈ రంగాల్లోనే కాదు.... అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతులైన వారు ఎందరో వున్నారు. సరైన ప్రోత్సాహం లేక, తగినంత సహకారం లేక మరుగున పడిపోతున్నారు.
ఒక ప్రతిభావంతుడు, ప్రపంచ రికార్డులు సాధించిన తెలుగు వ్యక్తి గురించి ప్రభుత్వం, మీడియా.... రెండూ అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అతని జీవితం ముగింపుకు వచ్చిన తర్వాతే అందరూ స్పందించారు.
ఆ తెలుగు వ్యక్తి మల్లి మస్తాన్ బాబు. నెల్లూరు జిల్లాకు చెందిన మస్తాన్ బాబు పర్వతారోహణలో మనకెవరికీ అందని శిఖరాలను అధిరోహించారు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శ్రేణులను అధిరోహించి ప్రపంచ రికార్డులు సృష్టించారు. ఇది చాలదన్నట్లు ఇంకా పైకి.... ఇంకా పైకి.... అలా ఎక్కుతూ.... ఇక మనం అందుకోలేని ఎత్తుకి వెళ్ళిపోయారు.
ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసే ' సాహసం మస్తమల్లి పథం '
ఇంకా చాలా అంశాలు ఈ క్రింది లింక్ లో ......
శిరాకదంబం 04_018
   
 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 021

Saturday, April 4, 2015

ఏ దేశమేగినా... మట్టి మనిషి - ఒక జ్ఞాపకం... విజయదర్శన్ రెండవ భాగం.... ఇంకా.....

తెలుగు భాష, సంస్కృతులు ఇంట గెలవడం మాట ఎలా వున్నా, రచ్చ గెలుస్తోంది అన్న విషయం విదేశాలలో వుంటున్న తెలుగు వారి కార్యకలాపాలు ఋజువు చేస్తున్నాయి. తెలుగు భాష, సంస్కృతుల వ్యాప్తికి ప్రవాసాంధ్రులు చిత్తశుద్ధితో చేస్తున్న కృషి అభినందనీయం. దీన్ని స్పూర్తి గా తీసుకున్నా మన దేశంలో తెలుగు వెలుగుతుందనడంలో సందేహం లేదు.
ఇటీవల మన్మథ ఉగాది వేడుకలను హాంగ్ కాంగ్ లో వుంటున్న తెలుగు వారు వైభవంగా జరుపుకున్నారు. స్థానిక చైనీయులకు కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం కల్పించడం విశేషం. అంతే కాక చైనీయులకు కూడా తెలుగు భాషను నేర్పించడం మరింత విశేషం.
హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల గురించి, తెలుగు సమాఖ్య ప్రస్థానం గురించి ' ఏ దేశమేగినా... '
ప్రపంచలోని తెలుగు రచయితలను ఒకచోట చేర్చిన ' మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ' గురించి....
తెలుగు సాహితీ లోకంలో పది కాలాలపాటు చెప్పుకోగలిగే నవల డా. వాసిరెడ్డి సీతాదేవి గారి ' మట్టి మనిషి 'గురించి ఒక జ్ఞాపకం....
దూరదర్శన్ విజయదుర్గ గారి అంతరంగ దర్శనం ' విజయదర్శన్ ' రెండవ భాగం....
ఇంకా చాలా అంశాలు... ఈ క్రింది లింక్ లో ......
శిరాకదంబం 04_017 
 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 020
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం