Thursday, March 29, 2012

వసంత నవరాత్రులు ; శ్రీరామనవమి......


ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు వస్తే, చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు వసంత నవరాత్రులు. ఈ కాలంలోనే శ్రీరాముని జన్మదినంగా, కళ్యాణ దినంగా పరిగణించే శ్రీరామనవమి పర్వదినం కూడా వస్తుంది. ఆ విశేషాలు... ఏకాదశ నందన ' ఉగాది స్వరాలు '.... ఇంకా....

  












Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 03 Pub. No. 128

Tuesday, March 27, 2012

నాటకం రమ్యం

' కావ్యేషు నాటకం రమ్యం ' అన్నాడు మహాకవి కాళిదాసు. ఆయన సంస్కృతంలో ఎన్నో నాటకాలు రచించాడు. మనిషి జీవిత గమనంలో కళలు కూడా భాగమైపోయాయి. మనిషిని మురిపించేది, కష్టాలను మరిపించేది, వినోదంతో బాటు విజ్ఞానాన్ని అందించేది, మనసుకు ఉల్లాసాన్నిచ్చి తిరిగి కార్యోన్ముఖుడిని చేసేది కళారూపం మాత్రమే !

ప్రాచీన కాలం నుంచే ఈ రంగస్థలం ఉనికి కనబడుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కుల, మత, జాతి, లింగ, స్థాయి బేధాలు లేకుండా తమ తమ పరిస్థితులకు, సంప్రదాయాలకు అనుగుణంగా కళారూపాలను ఏర్పరుచుకున్నాయి.

కళ మనిషి జీవితానికి ప్రతిబింబం. అతని కోరికలు, ఆశలు, ఆశయాలు, భావోద్వేగాలు.... ఇలా అన్నిటినీ ప్రతిఫలిస్తుంది. వీటిని ప్రదర్శించే వేదికే రంగస్థలం. యూరోపియన్ థియేటర్ అయినా, తెలుగు రంగస్థలమైనా... ఏదైనా మౌళికంగా మనిషిలోని ఈ లక్షణాలను ఆయా కళారూపాల్లో ప్రదర్శించేందుకు వేదికలే !

కాళిదాసు, షేక్స్పియర్ లతో ప్రారంభించి ఇప్పటివరకూ ఎంతోమంది రచయితలు నాటకరంగాన్ని సుసంపన్నం చేసారు. అలాగే ప్రపంచం నాలుగు చెరుగులా సంగీతంలో, నృత్యంలో ఎన్నో సంప్రదాయాలు, రీతులు పుట్టుకొచ్చాయి. కళా ప్రపంచం విస్తృతమయింది. ఎంతోమంది కళాకారుల్ని తయారు చేసింది. ప్రజల్ని అలరించింది.

కాలానుగుణంగా కళారూపాలు కొత్త రూపాలను సంతరించుకుంటూనే వున్నాయి. ఎప్పటికప్పుడు తాజాగా వస్తున్న సాంకేతిక అభివృద్ధిని తమలో ఇముడ్చుకుంటూ సరికొత్త ఆవిష్కరణలను చేసుకుంటూనే వున్నాయి. రంగస్థలం మీద ప్రదర్శించే కళలన్నిటినీ తనలో ఇముడ్చుకుని విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి సూచికగా ఆధునిక కళా సాంకేతిక రూపం సినిమా ఆవిర్భవించింది. దాని తర్వాత దశ టెలివిజన్. అయితే ఈ రంగాల్లో కళాకారులకు నేరుగా ప్రేక్షకులతో సంబంధం వుండదు. కానీ రంగస్థలం అలాకాదు. ప్రేక్షకుల కళ్ళెదుట సజీవ పాత్రలు నటిస్తాయి,... నర్తిస్తాయి.... అలరిస్తాయి. అదొక అనుభూతి.

రంగస్థలమెప్పుడూ రంగస్థలమే ! ఎంత సాంకేతిక అభివృద్ధి జరిగినా, ఎన్ని నూతన ప్రక్రియలు వచ్చినా రంగస్థలం తన ఉనికిని కోల్పోలేదు. పరిణామక్రమంలో ఒక మార్పు జరిగినపుడు పాత ప్రక్రియల విషయంలో కొంత స్తబ్దత సహజం. సినిమాలు ప్రారంభమై శతాబ్దం పూర్తయింది. సినిమాకు పూర్వరూపంగా చెప్పుకునే ' తోలుబొమ్మలాట ' ఇప్పటికీ మన రాష్ట్రంలో నిలిచే వుంది. అప్పుడప్పుడు, అక్కడక్కడ తన ఉనికిని చాటుకుంటూ ఉంటోంది. అలాగే అనేక ప్రాచీన సంగీత, నృత్య సంప్రదాయాలకు ఇంకా ఆదరణ లభిస్తూనే వుంది. వీటిని కాపాడుకోవడం పూర్తిగా ప్రభుత్వ బాధ్యత అని వదిలెయ్యడం కంటే ప్రజలు కూడా బాధ్యత తీసుకుని వాటిని ఆదరిస్తుంటే ఈ కళారూపాలు, రంగస్థలాలు సజీవంగా నిత్య వైభవంతో కళకళలాడుతాయి.

నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలతో............ 

గతంలోని టపాలు............. 

రంగస్థలం
రంగస్థల దినోత్సవం 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 127

Friday, March 23, 2012

' శ్రీ నందన ' ఉగాది స్వరాలు...... పంచాంగ శ్రవణం .....






Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 126

Friday, March 16, 2012

ఉగాదికి స్వాగతం

 శ్రీ నందన నామ ఉగాదికి తెలుగు వారందరూ సాదర స్వాగతం పలకడానికి సిద్ధంగా వున్నారు. ఉగాది పచ్చడికి తెలుగు సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానముంది. షడ్రుచుల సమ్మేళనమైన ఆ పచ్చడి విశేషాలేమిటి ?
ప్రతీ ఉగాదికీ తప్పనిసరిగా జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమం ' పంచాంగ శ్రవణం '. ఈ పంచాంగ శ్రవణం ఎందుకు ? దానివలన ప్రయోజనమేమిటి ?

ఇంకా........



శ్రీ నందన ఉగాది శుభాకాంక్షల సందేశాలు  
శ్రీ నందన నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం
కోటి ఆశలతో వసంతాగమనం కోసం ఎదురు చూస్తున్నాం
రాబోయే నూతన సంవత్సరంలో దేశ, విదేశాల్లో వుంటున్న తెలుగు వారందరూ సాటి తెలుగు వారికి 
ఈ ఉగాది శుభాకాంక్షలు శిరాకదంబం ద్వారా తెలపండి.
మీ పేరు, ఇతర వివరాలకు ఒక చిన్న సందేశం కూడా కలిపి
మార్చి 18 వ తేదీలోగా ఈ క్రింది ఇ మెయిల్ చిరునామాకు పంపండి.
మీ ఫోటో కూడా ఒకటి జత పరచవచ్చు.
గడువు తేదీలోపున వచ్చినవి మాత్రమే ప్రచురించబడతాయని గమనించ ప్రార్థన .

 
Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 03 Pub. No. 125

Thursday, March 8, 2012

హోళికా పూర్ణిమ.........

వసంతాగమనానికి సూచిక హోళికా పూర్ణిమ. ఈ పండుగ వెనుక వున్న పురాణ గాథలు, వివిధ ప్రాంతాలలో ఈ పండుగ జరుపుకునే విధానం ఆథ్యాత్మికం లో ...........
ప్రహసనాలకు ఆద్యులు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ప్రహసనాల గురించి రావూరి గారి వివరణ, ' నవ నాగరికులు ' ప్రహసనం సాహిత్యం  లో ...........
ఇంకా................ 















శ్రీ నందన ఉగాది శుభాకాంక్షల సందేశాలు  
శ్రీ నందన నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం
కోటి ఆశలతో వసంతాగమనం కోసం ఎదురు చూస్తున్నాం
రాబోయే నూతన సంవత్సరంలో దేశ, విదేశాల్లో వుంటున్న తెలుగు వారందరూ సాటి తెలుగు వారికి ఈ ఉగాది శుభాకాంక్షలు  ‘ శిరాకదంబం ‘ ద్వారా తెలపండి.
మీ పేరు, ఇతర వివరాలకు ఒక చిన్న సందేశం కూడా కలిపి
మార్చి 18 వ తేదీలోగా ఈ క్రింది ఇ మెయిల్ చిరునామాకు పంపండి.
మీ ఫోటో కూడా ఒకటి జత పరచవచ్చు.
గడువు తేదీలోపున వచ్చినవి మాత్రమే ప్రచురించబడతాయని గమనించ ప్రార్థన .


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 124

Friday, March 2, 2012

భారత కోకిల స్మృతి

స్వంత గడ్డ కాకపోయినా పుట్టింది , పెరిగింది, ప్రపంచ యవనిక మీద భారత కోకిలగా ప్రసిద్ధి చెందడానికి పునాది పడింది తెలుగు నేల మీదనే !
ఆ కోకిలే తెలుగు వారి దత్త పుత్రిక, తెలుగు వారి కోడలు సరోజినీ నాయుడు.
హైదరాబాద్ నగరంతో అనుబంధాన్ని, ప్రేమబంధాన్ని ముడివేసుకున్న సరోజిని భారతీయులు గర్వంగా చెప్పుకోగలిగిన విదుషీమణి, స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి
హైదరాబాద్ నగరానికి తలమానికంగా చెప్పుకునే నిజాం కళాశాల వ్యవస్థాపకుల్లో ప్రముఖులు సరోజిని తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ. ఆమె తల్లి  సుందరి దేవి కూడా బెంగాలీలో కవయిత్రే !
సరోజినీ చిన్ననాటనే పెర్షియన్ భాషలో రచించిన కవిత నైజాం నవాబును మెప్పించింది.  పదహారవ ఏటనే ఆమెను పై చదువులకోసం లండన్ పంపించింది.  అక్కడ ప్రముఖ సాహితీకారుల సాంగత్యం ఆవిడ సృజనాత్మకతకు మరింత పదును పెట్టింది.
పందొమ్మిదవ ఏటనే అప్పటి సాంప్రదాయాలను ఎదిరించి కులాంతర ప్రేమ వివాహం చేసుకుని తెలుగు వారి కోడలయింది.
గోపాలకృష్ణ గోఖలే, రవీంద్రనాథ్ టాగోర్, జిన్నా, గాంధీ, నెహ్రు లాంటి నాయకుల ప్రభావంతో స్వాతంత్ర్య సమరంలో పాల్గొని భారత స్త్రీలకు స్పూర్తి నిచ్చింది.
అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలిగా  కూడా ఎంపికయింది.
స్వాతంత్ర్యానంతరం  ఉత్తరప్రదేశ్ కు గవర్నర్ గా పని చేసి తొలి భారతీయ మహిళా గవర్నర్ అయింది.
ఆ సమయంలోనే ప్రపంచాన్ని తన కవితాగానంతో ఉర్రూతలూగించినఈ భారత కోకిల  1949  మార్చి   2  వ తేదీన  నింగికెగిసింది.
  భారత కోకిల సరోజినీ నాయుడుకి స్మృత్యంజలి ఘటిస్తూ............

భారత కోకిల సరోజినినాయుడు కవితల్ని ఈ లింక్ లో చదవండి.

http://www.poemhunter.com/sarojini-naidu/poems/

 భారత కోకిల జీవిత చిత్రణ ఈ ఫిల్మ్స్ డివిజన్ డాక్యుమెంటరీ లో ..............



Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 123
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం