Friday, August 12, 2011

నెహ్రు గారి పెంపుడు కుక్క

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ పాత్రికేయుడే గాక రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా కూడా పనిచేసారు. ఆ సమయంలో ( 1958 ప్రాంతం ) భారత జీవిత భీమా సంస్థలో జరిగిన అవినీతి కార్యకలాపాలు నెహ్రు ప్రభుత్వాన్ని కుదిపేశాయి.

 ఫిరోజ్ గాంధీ పార్లమెంట్ లో ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని, ముఖ్యంగా అప్పటి ఆర్థిక మంత్రి టి. టి. కృష్ణమాచారిని తీవ్రంగా విమర్శించారు. ఈ విషయంలోకృష్ణమాచారి సరైన సమాధానం చెప్పలేకపోయారు. పార్లమెంట్ బయిటకు వచ్చాక తన మిత్రుల దగ్గర ఫిరోజ్ గాంధీ మీద అక్కసునంతా వెళ్లబోసుకున్నారు. ఆ కోపంలో ఫిరోజ్ గాంధీ ప్రధాని నెహ్రు పెంపుడు కుక్క అని కూడా అనేసారు. ఈ విషయం ఆనోటా, ఈనోటా ఫిరోజ్ కు చేరింది. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూసారు. 

 కృష్ణమాచారి మీదున్న అవినీతి ఆరోపణలకు గట్టి సాక్ష్యాలను సేకరించారు. వాటిని పార్లమెంట్ కు సమర్పిస్తూ " మంత్రి గారు నన్ను ప్రధాని పెంపుడు కుక్క అన్నారు. అవును నేను పెంపుడు కుక్కనే ! కాకపొతే నెహ్రు గారి ప్రభుత్వానికి పెంపుడు కుక్కని... విశ్వాసం గల పెంపుడు కుక్కని... కాబట్టే నెహ్రు గారి ప్రభుత్వాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నాను. అవినీతి దొంగల్ని సాక్ష్యాలతో సహా పట్టించాను " అన్నారు. ఆయన పట్టుదల వలనే అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోయిన ఆర్థికమంత్రి రాజీనామా చెయ్యక తప్పలేదు.

Vol. No. 02 Pub. No. 316

4 comments:

ఆ.సౌమ్య said...
This comment has been removed by the author.
ఆ.సౌమ్య said...

బావుందండీ. మీరు రాస్తున్న విషయాలన్నిటినీ ఒక సంకలనం గా అంటే ఒక పుస్తకం గా తీసుకువచ్చే ఆలోచన చేస్తే బావుంటుందేమో అనిపిస్తోంది నాకు....ఇవి చాలా అపురూపమైన విషయాలు, సంపద వంటివి. ఆలోచించండి.

Padmavathi Kotamraju said...

thanks for sharing this. most of us are under the notion that feroz gandhi's only identity is what he earned through marital status. this throws light on his character.

SRRao said...

* ఆ. సౌమ్య గారూ !
మీ సూచనకు ధన్యవాదాలు. వీటిలో చాలావరకూ ఎక్కడో ఒకచోట ప్రచురించినవే ! కాకపోతే అవన్నీ ఒకచోటకు తెస్తున్నాను. అంతే ! ప్రయత్నిస్తాను. చూద్దాం ! ఎప్పటికీ వీలవుతుందో !

* పద్మావతి గారూ !
పెద్ద గీత ప్రక్కన చిన్న గీత కనబడదు సహజంగా. కొన్ని విషయాలు మరుగున పడిపోతాయి. ఫిరోజ్ గాంధీ విషయం కూడా అంతే ! ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం