Saturday, August 27, 2011

ఇద్దరు హిందీ చిత్ర దిగ్గజాలు

హృషిదా

హిందీ చిత్రాలంటే హింస, క్రైమ్ నిండి వుంటాయనుకునే రోజుల్లో......
హిందీ చిత్రాలంటే భారీ తారాగణం, భారీ సెట్లూ, భారీ భారీగా ఉంటున్న రోజుల్లో......
హిందీ చిత్రాల్లో కథ, కథనం కంటే ఈ భారీ హంగులే ముఖ్యమనుకుంటున్న రోజుల్లో.....

అవే హిందీచిత్రాల్ని కథ వైపు, కథనం వైపు మలుపు తిప్పిన వాడు
పెద్ద తారల్ని కూడా చిన్నచిత్రాల్లో చూపించి వాళ్ళ ప్రతిభను వెలికితీసినవాడు
హాయిగా కుటుంబమంతా కలసి చూసి ఆనందించగలిగే చిత్రాలు తీసినవాడు హృషీదా !
అదే...... ప్రముఖ హిందీ దర్శకుడు హృషీఖేష్ ముఖర్జీ  !!

 దో భిగా జమీన్, దేవదాసు లాంటి కళాఖండాలకు బిమల్ రాయ్ లాంటి లబ్దప్రతిష్టుడి దగ్గర పనిచేసిన హృషీదా 1957 లో ముసాఫిర్ తో ప్రారంభించి నలభై ఏళ్ళలో అనారి, అసలీ నకలీ, అనుపమ, ఆశీర్వాద్, సత్యకామ్, ఆనంద్, గుడ్డి, బావర్చి, ఆభిమాన్, నమక్ హరామ్, చుప్కే చుప్కే, మిలి, గోల్ మాల్, ఖూబ్ సూరత్, ఝూట్ బోలె కవ్వా కాటే వరకూ నలభైకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఆయన చిత్రాలన్నీ కథ..కథన ప్రధానమైనవి
వాటిలో అధిక భాగం వినోద ప్రధానమైనవి
సగటు ప్రేక్షకుడికి రూపాయికి రూపాయి వినోదాన్ని అందించారు హృషీఖేష్ ముఖర్జీ !
ఆనంద్, గుడ్డి చిత్రాల ద్వారా భారత చిత్రసీమకు బిగ్ బీ జంటను అందించారు హృషీదా !!

హృషీదా వర్థంతి సందర్భంగా ఆయనకు నీరాజనాలు అర్పిస్తూ...


గుడ్డి చిత్రంలో వాణీ జయరాం పాడిన తొలి హిందీ పాట ..........********************************************************************

మధుర గాయకుడు

మహమ్మద్ రఫీ, మన్నాడే, కిషోర్ కుమార్ లు హిందీ సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న రోజుల్లో వారికి సమ ఉజ్జీగా నిలబడిన మరో మధుర గాయకుడు ముఖేష్. భారత చలనచిత్ర షో మాన్ రాజ్ కపూర్ సినిమా అనగానే ముఖేష్ పాటలుంటాయనేది ప్రేక్షక శ్రోతల నమ్మకం. తొలిరోజుల్లో కుందన్ లాల్ సైగల్ అభిమానిగా ఆయనను అనుకరించినా , మెల్లగా తనదైన బాణీ ఏర్పరచుకున్నారు. రఫీ, కిషోర్ లతో పోలిస్తే తక్కువ పాటలే పాడినా ప్రేక్షక శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేసారు. వారి రివార్డులతో బాటు ఎన్నో అవార్డులను కూడా గెల్చుకున్నారు. 

1988 ప్రాంతంలో ఆడియో కాసేట్లు రాజ్యమేలుతున్న కాలంలో టి సిరీస్ వాళ్ళు హిట్స్ అఫ్ ముఖేష్ పేరు మీద ఆయన పాడిన పాటలను ఒక్కొక్క రసానికి చెందినవి ఒక్కొక్క కాసేట్ గా మొత్తం 10 కాసేట్లు వెలువరించారు. అప్పటికి అలా పదేసి కాసేట్ ఒకే సెట్ గా వెలువరించినవి దాదాపుగా లేవు. HMV వారు లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ వంటి వారివి నాలుగేసి కాసేట్ సెట్లు మాత్రమే విడుదల చేసారు. ముఖేష్ కాసేట్లు కొనుక్కున్నాక సాయింత్రం ఇంటికి వచ్చాక టేప్ రికార్డర్ లో పెట్టుకుని వింటూంటే గంధర్వ గానం వింటున్నట్లే ఉండేది. అలసటంతా మటుమాయం అయిపోయేది. పరాయి భాష కావడంతో సాహిత్యం సంపూర్ణంగా అర్థం కాకపోయినా ఆ గళం లోని మార్దవం, మాధుర్యం కట్టి పడేసేవి. 

ఆ మధుర గాయకుడి మరణం.. అమెరికాలో కచేరీ ఇవ్వడానికి వెళ్లినపుడే జరగడం ఒక విశేషమైతే, ఆయన మరణానంతరం కూడా కొత్త పాటలు విడుదల కావడం మరో విశేషం. ఆయన పాడగా రికార్డు చేసిన పాటలు మరణించిన రెండు దశాబ్దాల వరకూ కొత్త చిత్రాల్లో ఉపయోగిస్తూనే వున్నారు. ఈ అరుదైన అవకాశం మరెవరికీ రాదేమో ! అందుకే కళ సజీవం. మనిషికి మరణం ఉందేమోగానీ అతనిలోని కళాకారుడికి మరణం లేదు. 

మధురగాయకుడు ముఖేష్ వర్థంతి సందర్భంగా ఆయనకు స్వరనీరాజనాలతో........ 

 ముఖేష్ కు జాతీయ ఉత్తమ గాయకుడు పురస్కారాన్ని తెచ్చిపెట్టిన  రజనీగంధ  చిత్రంలోని పాట.......Vol. No. 03 Pub. No. 013

4 comments:

తృష్ణ said...
This comment has been removed by the author.
తృష్ణ said...

హృషీకేష్ ముఖర్జీ సినిమాలకు పెద్ద ప్యాన్ నేను. anari,khoobsoorat,asli naqli,aashiirvaad,anupama, guddi, abhimaan,namak haram,chupke chupke,baavarchi,golmaal, even..jhoot bole kavva kaate
దాదాపు ఆన్నీ చూసినవే. సగం దూరదర్శన్ పుణ్యం.i love anupama a lot.Abhimaan and guddi are also very fine films.

మీరిచ్చిన పాటలు కూడా భలే మంచివి..vani jayram's "బోలొరే పపీహరా..." and rafi's "kai baar" from rajnigandha..both are nice songs. Rajnigandha too is a good film.
వారిద్దరినీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

తృష్ణ said...

రావు గారూ, మొదటి కామెంట్లో "ముఖేష్" బదులు "రఫీ" అని రాసానని మళ్ళీ comment రాసానా..అందులోనూ అదే పొరపాటు చేసాను..:) ఈ మధ్యన అన్నీ పొరపాటువ్యాఖ్యలే రాస్తున్నట్లున్నా..:(

SRRao said...

తృష్ణ గారూ !
ధన్యవాదాలు. అప్పుడప్పుడు అలాంటి పొరబాట్లు మనకి తెలియకుండానే జరుగుతుంటాయి. అది మానవ సహజం. దాని గురించి పట్టించుకోకండి.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం