Wednesday, August 10, 2011

తెలుగు ' గిరి '

 ఒకప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ, ఇప్పటి ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని బరంపురం పట్టణంలో తెలుగు కుటుంబంలో జన్మించారు వరహగిరి వెంకటగిరి. 

 ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా చింతపల్లి కి చెందిన వీరి కుటుంబం గిరి గారు పుట్టక ముందే బరంపురానికి వలస వెళ్ళింది. 

విదేశాల్లో న్యాయశాస్త్రం చదువుకుని, అఖిలభారత రైల్వే సిబ్బంది సమాఖ్య, అఖిలభారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాయకునిగా కార్మికుల సంక్షేమానికి కృషి చేసారు. 

 మద్రాస్ శాసనసభకు 1936 లో జరిగిన ఎన్నికల్లో బొబ్బిలి రాజాపై బొబ్బిలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి కార్మికశాఖా మంత్రిగా పనిచేసారు.  

1942 లో జరిగిన ' క్విట్ ఇండియా ' ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించారు. 

 స్వాతంత్ర్యం వచ్చాక మొదటి లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికై మళ్ళీ కార్మికశాఖా మంత్రిగా పనిచేసారు. 

భారత మూడవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణాంతరం అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ నాడార్ నీలం సంజీవరెడ్డిగారిని బలపరచగా.... ఇందిరాగాంధీ అండదండలతో నాలుగవ రాష్ట్రపతిగా గిరి ఎన్నికయ్యారు. 

  ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ తో అడుగడుగునా అనుబంధం కలిగివున్న వి. వి. గిరి మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన వారిలో రెండవ తెలుగు వ్యక్తి. 

వి. వి. గిరి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ..... 

 గిరి గారి గురించి రాసిన గతంలోని టపా ............

Vol. No. 02 Pub. No. 311

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం