Saturday, July 9, 2011

' నాన్న' గుమ్మడి



"  తండ్రి అయితే ఓ కండువా, తలకు విగ్గు.. తాత అయితే ఓ శాలువా, గడ్డం, చేతి కర్ర. కథానాయకునికి పతాక సన్నివేశంలో ప్రాథాన్యత రావాలంటే అదేపనిగా దగ్గుతూ, ఏ గుండెజబ్బుతో మెలికలు తిరిగిపోతూ నా పాత్రను గుటుక్కుమనిపించ తప్పదు. క్లోజప్ లో ఏ ప్రమిదలోనో జ్యోతి ఆరిపోతుంది. అంతే... ఇంకా ఎంతకాలం కృత్రిమంగా చస్తూ చావాలి ? ఒక పరిధి దాటిన తర్వాత మనం తీసుకునే పారితోషికం ఇచ్చే తృప్తి కన్నా నిర్వహించే పాత్రలు ఇచ్చే తృప్తి ఎంతో ఎక్కువ " అన్నారు గుమ్మడి ఓ సందర్భంలో.


చిత్ర పరిశ్రమను కథానాయకుడు శాసించే పరిస్థితుల్లో తాత,తండ్రి, అన్న లాంటి సహాయ పాత్రలు ధరించి వాటికి గుర్తింపు తెచ్చిన నటుడు గుమ్మడి. ఆ పాత్రల్లో గుమ్మడిని మాత్రమే ఊహించుకునే పరిస్థితికి ప్రేక్షకులను తీసుకొచ్చారు.  ఇవే కాకుండా ఆయన నాయక, ప్రతినాయక పాత్రలు, ప్రత్యేక తరహా పాత్రలు పోషించి మెప్పించినా గుమ్మడి అనగానే మన తాతో, తండ్రో, అన్నో గుర్తుకు వచ్చేంతగా ముద్ర పడిపోయింది. తనకంటే  వయసులో ఎంతో పెద్దవాళ్ళైన నటులకు కూడా తండ్రిగానో, తాతగానో నటించి ఒప్పించిన  నటుడు గుమ్మడి. అలాగే అప్పాజీ లాంటి చారిత్రక పాత్రలో గుమ్మడిని తప్ప ఇంకెవరినీ ఊహించలేవేమో !

 గుమ్మడిగారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు ఆర్పిస్తూ..... 

గుమ్మడిగారి మీద గతంలోని టపాలు......... 

 'సాత్వికాభినయసామ్రాట్' గుమ్మడి
తెలుగు తెర అప్పాజీ

Vol. No. 02 Pub. No. 275

2 comments:

Shasikala Kumbhajadala said...

‎"గుమ్మడి వెంకటేశ్వర రావు "గారికి "జన్మ దిన శుభాకాంక్షలు ".

SRRao said...

శశికళ గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం