Saturday, June 4, 2011

' బాలు ' ని పుట్టినరోజు

 తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచంలో మేరునగదీరుడు బాలు 
స్వరాల జడిలో శ్రోతల్ని తడిపేస్తున్న గాన గంధర్వుడు బాలు 

అలవోకగా అన్ని రకాల పాటల్ని పాడి మురిపిస్తున్న బాలు 
సునాయాసంగా అన్ని రకాల పాత్రల్ని ధరించి అలరిస్తున్న బాలు 

నవతరం గాయకుల్ని ప్రోత్సహించి ముందుకు నడుపుతున్న బాలు 
భావితరం గాయకుల్ని తయారుచేసి ఆశీర్వదించి పంపుతున్న బాలు  

ఎన్నెన్నో మెట్లెక్కి అందుబాటులో వున్న శిఖరాలన్నీ అధిరోహించిన బాలు
జీవనగమనంలోనూ అంతే వేగంతో అరవై నాలుగు మేట్లేక్కేసారు బాలు  

అయినా ఆయనకు అలుపు లేదు.... రాదు...అందుకే  ఆయన బాలు 
వయసు ఆయన శరీరానికి కానీ మనసుకు కాదు..ఆయనెప్పుడూ బాలుడే  !

...... ఆ ' బాలు 'నికి జన్మదిన శుభాకాంక్షలు 

 ( స్వకీయం : సాధారణంగా రచనలు చేసే తొలిరోజుల్లో మనం రాసింది మనకే నచ్చదు. రాస్తుంటాం.... కొట్టేస్తుంటాం...ఎందుకైనా మంచిదని ఆ కాగితాలు చింపేస్తుంటాం కూడా ! దాని వెనుక మన రచన అద్భుతంగా వుండాలని, దాన్ని చదివిన అందరూ మెచ్చుకోవాలనే ఆకాంక్ష వుంటుంది. అదే మన రాతల్ని మనకే నచ్చకుండా చేస్తుంటుంది. అదొక విచిత్రమైన పరిస్థితి. 
ఈరోజు నేను అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి. బాలుగారి గురించి చక్కటి టపా రాయాలని, ఆయన పాటల్లో మంచివి ఏరి ఓ మాలిక తయారు చెయ్యాలని చాలారోజులనుంచి ప్రణాళిక వేసుకున్నాను. అయితే వేలాదిగా వున్న ఆయన పాటల్లో మంచివి అనిపించేవి కనీసం వందల్లో వున్నాయి. మనకున్న పరిమితులను దృష్టిలో పెట్టుకుంటే అది చాలా పెద్దగా అయ్యేలా వుంది. ఎంపికలోని ఏ పాటా వదలబుద్ధి కాలేదు. 
అయినా హనుమంతుడి ముందు కుప్పిగంతులా ? ఆయన పాటల్ని ఎంపిక చేసి కూర్చే సాహసమా ? కూర్చి వాటిని మిత్రులకు పరిచయం చెయ్యడమా ? ఆయన పాటల గురించి తెలియనివారెవరు ? ఆయన గురించి రాయడానికి ఎంత ధైర్యం ?  ఎవరో రాసిన పాటలు పాడడంలోనే కాదు స్వంతంగా మాటలల్లడంలోనూ ఘనాపాఠీ  కదా ! ఆయనపైన మాటల ఆటలా ? ...................... ఇలా ఎంతకీ ఆలోచనలు ఓ కొలిక్కి రాలేదు. సమయం మించిపోతోంది. ఆ గంధర్వుడికి శుభాకాంక్షలందించాలి. అందుకే చంద్రునికో నూలుపోగులా అరవై  నాలుగేళ్ళ బాలునికి శుభాకాంక్షలు అందిస్తూ ఏదో తోచిన నాలుగు ముక్కలు రాసి ప్రచురిస్తున్నాను )


Vol. No. 02 Pub. No. 249

4 comments:

కెక్యూబ్ said...

బాల గంధర్వునికి జన్మదిన శుభాకాంక్శలు..

బాలు మంత్రిప్రగడ said...

యస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారికి,
జన్మదిన శుభాకాంక్షలు !!
- యం.వి. బాలసుబ్రహ్మణ్యం

Vinay Datta said...

We wish Balu garu a very long musical life of happiness and prosperity.

madhuri and vinay datta.

This is also the day last year when my son announced that he would start a blog.

SRRao said...

* కెక్యూబ్ వర్మ గారూ !
* బాలు మంత్రిప్రగడ గారూ !

ధన్యవాదాలు

* మాధురి గారూ ! వినయ దత్తా !

ధన్యవాదాలు. వినయ్ అభిలాషకు సంవత్సరం వయస్సన్నమాట ! సంతోషం.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం