Monday, April 25, 2011

తెలుగు కళా'సూర్య'



తెలుగు పౌరుషానికి ప్రతీక ఆంధ్రకేసరి 
తెలుగు కళావైభవానికి ప్రతీక సూర్య 

గుండుకెదురెళ్లి వలసపాలకులను నిలిపిన ధీశాలి ప్రకాశం 
తన పాటతో జన ప్రవాహాన్ని నిలిపివేయగలిగిన కళాకారిణి సూర్య





 ఆంధ్రకేసరి వంశంలో పుట్టి ఆంధ్ర కళా వైభవాన్ని దశదిశలా వ్యాపింపచేసిన విదుషీమణి  టంగుటూరి సూర్యకుమారి. 

ఆమెకోసం చిన్నతనంలోనే పాత్రలు సృష్టించబడ్డాయి
ఆమె పాడిన పాటలు వ్యాపారులకు వరంగా మారాయి
అందాల సుందరి కిరీటం ఆమెకొక అదనపు అలంకారం 
ప్రపంచ రంగస్థలం ఆమెకు సాదర స్వాగతం పలికింది

పురుషులే స్త్రీ పాత్రలు ధరించే పరిస్థితి వున్న కాలంలో పురుష పాత్ర ధరించిన నటి సూర్యకుమారి. 1943 లో వచ్చిన ' కృష్ణప్రేమ ' చిత్రంలో నారద పాత్ర ధరించారు. తెలుగుతో బాటు సంస్కృతం, తమిళం, గుజరాతీ, హిందీ, ఆంగ్ల భాషల్లో పాటలు పాడారు. నటించారు.

స్వాతంత్ర్య సమరంలో ప్రజల్లో ఉత్తేజాన్ని నింపాయి ఆమె పాటలు
సాంస్కృతిక రాయబారిగా అమెరికా పర్యటింపజేసింది ఆమె నటన

మన వలస పాలకులైన ఆంగ్లేయులకు భారత కళలను నేర్పింది
భారత కథలపై పరిశోధనలో అల్ఫ్రెడ్ హిచ్ కాక్ కే సహకరించింది

ప్రాక్ పశ్చిమ కళా సాంస్కృతిక వారధి టంగుటూరి సూర్యకుమారి
రాజమండ్రిలో పుట్టి  ఇంగ్లాండ్ లో మెట్టిన ఆంధ్ర వనిత సూర్యకుమారి

 మన తెలుగు తల్లికి  మల్లెపూదండ సమర్పించిన తెలుగు తేజం టంగుటూరి సూర్యకుమారి గారి వర్థంతి సందర్భంగా గీతసుమాంజలి ............
 



Vol. No. 02 Pub. No. 212

3 comments:

Vinay Datta said...

Do you know anything about her husband?

madhuri.

Vinay Datta said...

Earlier your blog had an index. It was easy to locate all the older posts.

madhuri.

SRRao said...

మాధురి గారూ !
సూర్యకుమారి గారి భర్త పేరు హరాల్డ్ ఎల్విన్ ( Harold Elvin ). ఆయన కవి, చిత్రకారుడు. ఇంతకుమించిన వివరాలు నా దగ్గర లేవండీ !
మీరడిగిన ఇండెక్స్ ఇప్పుడు కూడా వుందండీ ! కాకపోతే ఈ టెంప్లేట్ లో అది బాగా క్రిందకు వుంటుంది. ఒకసారి బాగా క్రిందకు వెళ్ళి చూడండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం