Saturday, March 26, 2011

' పాతాళభైరవి ' లో ద్విపాత్రాభినయం

 పాతాళభైరవి చిత్రం ఎంతటి ప్రాచుర్యం పొందిందో అందులో నటించిన నటులకు కూడా అంతే ప్రాచుర్యం తెచ్చి పెట్టింది. అందులో హాస్యనటుడు బాలకృష్ణ ఒకరు. అంజి పాత్రలో ప్రసిద్ధి చెందిన బాలకృష్ణ ఆ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసారనే విషయం చాలామందికి తెలీదు. 
నెల్లూరులో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్న వల్లూరు బాలకృష్ణ నాటకాల్లో నటిస్తూ వుండేవారు. ఆ రంగస్థలానుభవం ఆయన్ని రేలంగితో బాటు ' శ్రీకృష్ణ తులాభారం ' చిత్రంలో చిన్న వేషం వేసే అవకాశం ఇచ్చింది. తర్వాత విజయావారి ' షావుకారు ' చిత్రంలో సున్నం రంగడు ముఠాలో సభ్యునిగా నటించారు. అయితే అదే విజయ సంస్థ తర్వాత నిర్మించిన ' పాతాళభైరవి ' చిత్రంలో అంజి పాత్ర  కోసం బాలకృష్ణకు మేకప్ టెస్ట్ చేసారు. కానీ ఆ పాత్రకు ఆయన పీలగా వున్నారని మొదట్లో తీసుకోలేదు. అయితే బాలకృష్ణను నిరాశ పరచడం ఇష్టం లేక దర్శకులు కే. వి. రెడ్డి గారు భూతం వేషం ఇచ్చారు. కానీ అంజి పాత్రకు సరైన నటుడు దొరకకపోవడంతో చివరకు బాలకృష్ణ చేతనే ఆ వేషం కూడా వేయించారు. దాంతో బాలకృష్ణ ఆ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసినట్లయింది. భూతం వేషంలో వున్నది బాలకృష్ణే అని ప్రేక్షకులు గుర్తించలేనంతగా మలిచారు కే. వి. రెడ్డి గారు.

Vol. No. 02 Pub. No. 182

2 comments:

ఆ.సౌమ్య said...

మాయాబజార్ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసారు...చిన్న పాత్రలే అనుకోండి, కానీ చేసారు.

SRRao said...

ఆ. సౌమ్య గారూ !

మంచి విషయం జత చేసారు. ధన్యవాదాలు. ఆ వివరాలు మీరు అందించకూడదూ....!

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం