Saturday, February 26, 2011

సాక్షి జంట గురించి ఆరుద్ర

రచయిత ఆరుద్ర కు  బాపురమణ జంటకు అవినాభావ సంబంధం వుంది. బాపురమణల జంట పనిచేసిన దాదాపు అన్ని సినిమాలకు ఆరుద్ర పాటలు రాసారు. సినిమాలకు పాటలు రాయడం మానుకున్న తర్వాత కూడా ఆ జంట మీదున్న అభిమానంతో వారి చిత్రాలకు ప్రత్యేకంగా రాయడం విశేషం.


బాపురమణ జంట నిర్మించిన తోలి చిత్రం ' సాక్షి '. ఆ చిత్రంలో ఆరుద్ర పాటలు రాసారు. ఆ అనుభవాలను చెబుతూ ఆరుద్ర .............................


   సాక్షి చిత్రం ప్రారంభిస్తున్న రోజు - కొన్ని పాటలే రాయవలసిన నాకు అన్ని పాటల సన్నివేశాలు చెప్పారు. పది  నిముషాల్లో పాట రాసి భేష్ అనిపించుకున్నాను. నన్ను ఆ చిత్రంలో బహు యిబ్బంది పెట్టేసారు. మూడు నాలుగు నెలలైనా ఒక పాట నేను మొదలు పెట్టలేకపోయాను. ఆ సన్నివేశం అంత ఇబ్బందికరమైనది.  మరణం తప్పదని నిశ్చయించుకున్న మనసైన వాడిని మనువాడదలచిన పిల్ల పాడే పాట అది. పల్లవి తట్టడానికి అన్నాళ్ళు పట్టింది నాకు. పల్లవి దొరకగానే పది నిముషాల్లో రాసేసాను.

   బాపు గారు ' భేష్ ' అన్నారు. రమణగారు అనలేదు. భేష్ అనడం రమణగారికి చేతకాదు.... ఏదైనా మనసుకి బాగా పట్టేస్తే నోట్లో నాలుక మీద వేలు అడ్డంగా పెట్టి ఈల వేయడం తప్ప. రమణగారు ఇంకోలాగ అయినవాళ్ళ మధ్య ఆనందం ప్రదర్శించలేరు. ఆ తర్వాత ఎన్ని పాటలు రాసాను... ఎన్ని భేష్ లు అన్నారు.... ఎన్ని ఈలలు విన్నాను. 


బాపు గారి చేత ' భేష్ ' అనిపించి, రమణ గారి చేత ఈల వేయించిన ఆ పాట ..................




Vol. No. 02 Pub. No. 158

9 comments:

విజయవర్ధన్ (Vijayavardhan) said...

Bagundandi. Did you find this in any particular book? Please let me know. Sorry for posting this comment in English. I am using someone else's computer. The photo you posted is also rare. Thank you for sharing it with us.

SRRao said...

విజయవర్ధన్ గారూ !
బాపు గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ ( గౌరవ డాక్టరేట్ ) ఇచ్చిన సందర్భంగా ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రత్యేకంగా ప్రచురించిన ఆరుద్ర గారి వ్యాసం లోని భాగం ఇది. ధన్యవాదాలు.

Unknown said...

చాలా బావుంది సార్. అరుదైన విషయాలు తెలియచేసారు.. ధన్యవాదాలు.

SRRao said...

సుభద్ర గారూ !
ధన్యవాదాలు

Durga Dingari said...

ఎక్సలెంట్ రావు గారు. ఆరుద్ర గారు బాపు రమణల గురించి చెప్పిన అరుదైన విషయాలు మాకు అందజేసినందుకు ధన్యవాదలండి. రావు గారు, మీరు బ్లాగ్ లో చాలా బాగా రాస్తారండి.

susee said...

ramachandra rao garu-meeratlu- aarudragaarikeee bapuramana( iddaroo okatenanee- anduvalla iddarikee madhya -[hyphen]vundakoodadanee --okachota chadivina meedata -bapuramana ani yekapadam gaa raasaanu-gamaninchagalaru)kee 'chitra'paramgaa- 'ee naati ee bandhamenaatido?!' andukane kaabolu,vaari chitraalannitilonoo- ee pratyekatha- kottavacchinatlu kanabaduthundi manaki.- voleti venkata subbarao,slough/UK

SRRao said...

* దుర్గ గారూ !
ధన్యవాదాలు. నేను కేవలం నా సేకరణ సంపదలోనుంచి కొన్ని విశేషాలను మీ అందరితో ఈ బ్లాగు ద్వారా పంచుకుంటున్నాను. ఇందులో నేను ప్రత్యేకంగా రాసేది పెద్దగా ఏమీ లేదండి, ఉన్న విషయాన్ని సందర్భోచితంగా అందించడం తప్ప.... అది మీలాంటి మిత్రులకు నచ్చుతున్నందుకు, నా సేకరణ ఇలా సార్థకం అవుతున్నందుకు చాలా సంతోషంగా వుంది.

* సుబ్బారావు గారూ !
బాపురమణల గురించి ఆరుద్ర గారి మరో మంచి మాట చెప్పారు. చాలా సంతోషం. ఈసారి ముళ్ళపూడి గారి గురించి రాసే మరో టపాలో ఇది కూడా కలుపుతాను. నా సేకరణ సంపదకు మీరు మరిన్ని జోడించి ఆ సంపదను మరింత పెంచుతున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మీలాంటి అనుభవజ్ఞులు, పెద్దల ప్రోత్సాహం లభించడం నా అదృష్టం.

విజయవర్ధన్ (Vijayavardhan) said...

రావు గారు,
ఈ postలో వున్న photo high quality లో వుంటే దయచేసి నాకు పంపగలరా.

ధన్యవాదాలతో
భవదీయుడు
విజయ్

SRRao said...

విజయవర్ధన్ గారూ !

ధన్యవాదాలు. ఈ ఫోటో కూడా పత్రికలోనిదే ! మీకు ఫర్వాలేదంటే తప్పక పంపుతాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం