Friday, February 25, 2011

తన ఆత్మ గురించి ముళ్ళపూడి


శరీరాలు వేరైనా ఆత్మలోకటే  బాపురమణ లకి ................
తన ఆత్మ బాపు గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు ఏమన్నారో చూడండి..........





   బాపు అంటే పని. రోజుకి ఇరవై గంటల పని. లొంగని గుర్రాల మీద సవారీకి కసి, పట్టుదల.  
                 
       బాపు కళాతపస్వి కాదు. అంటే గడ్డాలూ, విగ్గులూ పెంచేసి, గుహల్లో దూరిపోడు. తెల్లారగట్ట నాలుగ్గంటలకి లేచి ఓ రెండు గంటలు బొమ్మలేస్తాడు. తర్వాత సరదాగా ఓ రెండు గంటలసేపు బొమ్మలేసుకోవడం, ఆ తర్వాత ఇంకో గంటన్నర బొమ్మల ప్రాక్టీసు, ఆలసిపోతాడు గదా, అందుకని - ఓ రెండు గంటలసేపు హాయిగా బొమ్మలు గీయడం, అదయ్యాక తనకిష్టమైన కథలకి బొమ్మలు గియ్యడం, ఆ తర్వాత..... ఇదీ వరుస.

         ఈలోపున వచ్చేపోయే ఫ్రెండ్స్ తో జోక్స్ చెప్పుకోవడం, వాళ్లకి గ్రీటింగ్స్ కార్డ్స్ వేసి పెట్టడం, వాళ్ళ కథలకి బొమ్మలు వేసి పెట్టడం, కార్టూన్లు వేసి పెట్టడం - వాళ్ళని నుంచోమని, కూర్చోమని, చెయ్యలా పెట్టమని, చెయ్యిలా పెట్టమని, రకరకాల భంగిమలలో రేఖాచిత్రాలు వేసుకోవడం.........


...... ఇలా సాగుతుంది ప్రియమిత్రుని గురించి రమణ గారి వ్యాఖ్యానం. వారి అనుబంధం విడదీయలేనిది. 



Vol. No. 02 Pub. No. 156

5 comments:

ఆ.సౌమ్య said...

అబ్బ అద్భుతమైన విషయం అందించారు...రమణ గారి రచనా శైలి కి తిరుగులేదు.

Rajendra Devarapalli said...

రావుగారు,కొన్నేళ్ళ క్రితం రమణ తనగురించి,బాపు గురించి ఈనాడు ఆదివారం అనుబంధంలో ఒకమంచి విశ్లేషణ రాసారు.నేను దాచుకున్నది యెటుపోయిందో తెలీటం లేదు,మీదగ్గర ఖచ్చితంగా ఉండి ఉంటుంది.అదొక్కసారి.....

susee said...

Manam yerigunnadi maasaaniki amavaasya rendu saarle vasthundani. kaanee,ee saari moodo saari-ante ninna maro saari adanamgaa vachhindi amaavaasya. vachhi-telugu sahiteegaganaani cheekati chesi vellipoyindi. pothoo-pothoo- tana gurthugaa aa katika cheekatini mana hrudayalalo parichi maree vellindi.Ika mana Telugu saahithee priyulaku velugu Yennadu???-Adee prasna-vennelanu panche sahithee 'chandrudu' -aa ramana gaaru -marosaari vudayinchina naade - idee javaabu--

susee said...

baadha lo okasaari maatalu tadabadadam sahajam-ee saari ade jarigindi.manasanthaa ramana gaari smrithulu nindi pongi porali- yemi maatlaadaamo-yemi raasaamo teliyani sthithi. pyna naa vyaakhya lo- -"Manam yerigunnadi maasaaniki amaavaasya okka saare vasthudani." ani vundaali.- porabaatu jariginanduku manninchaali - venkata subba rao voleti/slough/UK

SRRao said...

* ఆ. సౌమ్య గారూ !
* సుబ్బారావు గారూ !
ధన్యవాదాలు

* రాజేంద్రకుమార్ గారూ !
ధన్యవాదాలు. మీరు చెప్పిన ఈనాడు అనుబంధం నా దగ్గర వుండాలి. వెదికి బయిటకు తీస్తాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం