Thursday, January 27, 2011

క్రాక్


నెల్లూరులో ధర్మదాతగా పేరుపొందిన రేబాల లక్ష్మీనరసారెడ్డి గారు తనకున్న భవనాలలో ఒకదాన్ని శిశు వైద్యశాల ఏర్పాటుకు విరాళంగా ఇచ్చారు.

దాన్ని స్వాధీనం చేసుకునే పని మీద వచ్చిన ఓ ప్రభుత్వాధికారి ఆ భవనాన్ని పరిశీలిస్తున్నాడు. రెడ్డిగారు దగ్గరుండి ప్రతీ గదీ చూపిస్తున్నారు. ఆ అధికారి గోడలు, పైకప్పూ అన్నిటినీ పరీక్షగా చూస్తున్నాడు.

ఆది గమనించిన రెడ్డిగారు " ఏమిటయ్యా ? అంత పరీక్షగా చూస్తున్నావు ? బిల్డింగ్ ఎక్కడైనా క్రాకిచ్చిందా ? " అనడిగారు.  

దానికా అధికారి కంగారు పడి " అబ్బెబ్బే ! అదేం లేదు సార్ ! " అన్నాడు.

" లేకపోతే ఇంతమంచి భవనాన్ని దానం చేసిన వీడెంత క్రాకో అనుకుంటున్నావా ? " అనడిగారు రేబాల లక్ష్మీనరసారెడ్డి గారు.

Vol. No. 02 Pub. No. 129

3 comments:

Ennela said...

Sir,
mee postulu konni chadivaanu......inkaa chadavaalsinavi unnaayi...chadivinanta varaku annee superb.mee blog chaala chaala bagundi..paina corner lo unna chitti bujjayi to sahaa..

SRRao said...

ఎన్నెల గారూ !
ముందుగా ధన్యవాదాలు. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి. మీ టపాలు కూడా చదువుతున్నాను. మంచి హాస్య ప్రవాహం వుంది మీ రచనల్లో.... అన్నిటిలోకి హాస్యం చాలా కష్టమైన ప్రక్రియ అని నా అభిప్రాయం. అది మీకు పట్టుబడింది. కొనసాగించండి. మరిన్ని మంచి హాస్య గుళికలను అందించి మా ఆరోగ్యాలను కాపాడాలని కోరుకుంటూ....

Ennela said...

ధన్యవాదాలండీ. మీరు చదువుతున్నారని తెలిసి చాలా సంతోషించాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం