Sunday, December 26, 2010

కూర్మా వారి తిట్టు

 ' ఆంధ్ర యూనివర్సిటీ సెమినార్ హాల్లో నీ ఉపన్యాసం పెట్టించేస్తాను జాగ్రత్త ! ' అని ఒక పాత్ర బెదిరిస్తుంది హాస్యబ్రహ్మ జంధ్యాల గారి ' రెండురెళ్ళు ఆరు ' చిత్రంలో. ఆది ఎందుకో ఆంధ్ర యూనివర్సిటీ గురించి తెలిసున్న వాళ్లకు, అక్కడ చదివిన వాళ్లకు, అక్కడ ఉపన్యాసం ఇచ్చిన వాళ్లకు బాగా తెలుసు.

ఒకప్పుడు ఆ యూనివర్సిటీకి రిజిస్ట్రార్ గా పనిచేసిన కూర్మా వేణుగోపాలస్వామి గారు చాలా గంభీరమైన వ్యక్తి. ఓరోజు అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతోంది. సక్రమంగా జరగనిస్తే విద్యార్థుల గోప్పతనమేముంది. అందుకే ఆ యూనివర్సిటీ సాంప్రదాయం ప్రకారం యథాశక్తి గోల చేస్తున్నారు. కార్యక్రమాన్ని సజావుగా సాగనివ్వడం లేదు. వేణుగోపాలస్వామి గారు ఇదంతా చూసి చూసి ఇక ఆగలేక వేదికనెక్కారు.

ఆయన్ని కూడా వదలదల్చుకోని విద్యార్థి ఒకడు గాఠిగా " హాయ్ ! భీమా ! " అన్నాడు.

కూర్మా వారు తక్కువ తిన్నారా ! కుక్క కాటుకు చెప్పుదెబ్బలా వెంటనే అందుకుని
" ఏరా ! ఘటోత్కచా ? ఏం కావాలిరా ? " అన్నారు.

ఇందులో తిట్టేముందని అనుకుంటున్నారా ? అయితే కొంచెం ఆలోచించండి. మీకే అర్థం అవుతుంది.

Vol. No. 02 Pub. No.098

1 comment:

Anonymous said...

please watch & subscribe
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం