Saturday, December 18, 2010

గానంలో పెద్ద ' మాధవపెద్ది '

రంగస్థల అనుభవం ఆయన్ని తీర్చిదిద్దింది
పద్యం ఆయన గళంలో వయ్యారాలు పోయింది

దుర్యోధనుడు, రావణుడు, ఘటోత్కచుడు....
ఇలా ఎన్నో పాత్రలకు ఆయన కంఠం జీవం పోసింది

ఎస్వీరంగారావు, రేలంగి, రమణారెడ్డి ......
ఇలా ఎందఱో నటులకు ఆయన కంఠం అమరి పోయింది

పాట ఆయన గొంతులో ఒదిగిపోయింది
పాడుతున్నది పాత్రలేమోననిపిస్తుంది
పాడుతున్నది పాత్రదారులేమోననిపిస్తుంది
వారిలో ఆయన స్వరం పరకాయ ప్రవేశం చేస్తుంది

ఆయన పద్యంలో భావం తొణికిసలాడుతుంది 
ఆయన పాటలో రాగం అలవోకగా అమరిపోతుంది
ఆయన కంఠంలో గాంభీర్యం నాట్యమాడుతుంది
ఆయన కంఠంలో హాస్యం గిలిగింతలు పెడుతుంది

ఆయనే కబీర్ పాత్రలో 1946 లో వచ్చిన ' రామదాసు ' తమిళ-హిందీ ద్విభాషా చిత్రంతో నటుడిగా చిత్రసీమలో అడుగుపెట్టి  గాయకుడిగా స్థిరపడి సుమారు మూడు దశాబ్దాలు తెలుగు ప్రేక్షక శ్రోతలను అలరించిన మాధవపెద్ది సత్యం. ఆయన నటుడిగా స్థిరపడిపోతే మనం గర్వంగా చెప్పుకోగలిగే మంచి గాయకుడిని కోల్పోయేవాళ్ళమేమో ! ఆది తెలుగు జాతి చేసుకున్న అదృష్టం. పాత్ర స్వభావాన్ని, పాత్రధారుని సంభాషణా చాతుర్యాన్ని అంత చక్కగా స్వంతం చేసుకుని పాడే గాయకుడు బహుశాః మాధవపెద్ది సత్యం గారొక్కరేనేమో !

ఆయన కుమారుడు, కూచిపూడి నృత్య కోవిదుడు మాధవపెద్ది మూర్తి గారు తన తండ్రి గారి జ్ఞాపకార్థం ' మాధవపెద్ది సత్యం పురస్కారం ' నెలకొల్పారు. ఆ పురస్కారం అందుకొన్న వారిలో ఎం. ఎస్. విశ్వనాథన్, పి. బి. శ్రీనివాస్ లాంటి ప్రముఖులున్నారు.

ఈ రోజు మాధవపెద్ది సత్యం గారి వర్థంతి సందర్భంగా ఆయనకు స్వర నీరాజనం అర్పిస్తూ ఆయన పాడిన కొన్ని పాటల, పద్యాల శకలాల కదంబం ........ 



గతంలో దూరదర్శన్లో ప్రసారమైన మాధవపెద్ది సత్యం గారితో ముఖాముఖీ కార్యక్రమం ముక్కామల గారి ద్వారా ...............



Vol. No. 02 Pub. No. 088

4 comments:

Saahitya Abhimaani said...

మంచి ఇంటర్వ్యూ అందచేశారు రావు గారూ.ధన్యవాదాలు. మాధవపద్ది సత్యం గారికి క్రికెట్ ఆంట అంటే మక్కువ. ఆయనే ఒక ఇంటర్వ్యూ చెప్తుండగా విన్న జ్ఞాపకం. ఆయనకు క్రెకెట్ ప్రత్యక్ష ప్రసారం చూడటం చాలా ఇష్టమట.

సత్యం గారి అనుయాయి, ఈయనతో కలిసి అనేక హాస్య పాటలు పాడిన పిఠాపురం నాగేశ్వరరావుగారి గురించి కూడ మీ బ్లాగులో వ్రాయగలరు.

SRRao said...

శివ గారూ !
ధన్యవాదాలు. తప్పకుండా త్వరలోనే పిఠాపురం గారి గురించి వ్రాస్తాను.

మంద పీతాంబర్ said...

నాయాకుని పద్యాలకు ధీటుగా ప్రతి నాయకుడు పద్యం పాడాలంటే మాధపద్ది గారికంటే మించిన పద్య గాయకుడు లేడు.అదీ s .v రంగారావు గారు ప్రతినాయకుడై తన హావ భావాలకు ఈయన గారి పద్యం తోడైతే కర్ణానందంగాను,నయనానందం గాను వెరసి మహదానందం గాను ఉంటుంది.పారి పద్యాలందించినందులకు ధన్యవాదాలు.

SRRao said...

పీతాంబర్ గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం