Monday, December 13, 2010

నటన ' లక్ష్మి '

 విలక్షణమైన నటన
విలక్షణమైన గళం
వెరసి నటీమణి లక్ష్మిగా 
చిత్రసీమలో వెలిసింది

అలనాటి తెలుగు చిత్ర నిర్మాత వై. వి. రావు ఆమె తండ్రి
అలనాటి తమిళ చిత్ర నటి కుమారి రుక్మణి ఆమె తల్లి
పుట్టింది సినిమా కుటుంబంలో
పెరిగింది సినిమా వాతావరణంలో
అందుకే ఆమెకు సినిమా అవకాశాలు నల్లెరుమీద నడక

కథానాయికగా అడుగుపెట్టింది
తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలతో బాటు
హిందీలోనూ జూలీ గా అఖండ విజయం సాధించింది
అనేక అవార్డులు, రివార్డులు స్వంతం చేసుకుంది
జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకుంది
దక్షిణాది బాషల్ని క్షుణ్ణంగా నేర్చుకుంది
 
నలభై రెండు సంవత్సరాలుగా మూడుతరాల పాత్రల్ని పోషించింది
తర్వాతి తరానికి ఐశ్వర్య రూపంలో నటవారసురాలిని అందించింది  

మన తెలుగు చిత్రసీమలో మరో మంచి నటి లక్ష్మి కి జన్మదిన శుభాకాంక్షలతో ...........



Vol. No. 02 Pub. No. 082

6 comments:

Anonymous said...

thanks for reminding.
Most beautiful and sensible actress
My favourete actress.

ఆ.సౌమ్య said...

నిజం, లక్ష్మి కున్నంత విలక్షణత్వం (ఎలా వాడొచ్చా?) ఇంకెవరికీ ఉండదు. నాకు ఆమె నటన చాలా ఇష్టం. ఆమెకి మీ బ్లాగు ముఖంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

Anonymous said...

khareedaina kulata...!

SRRao said...

* అజ్ఞాత గారూ !
* ఆ. సౌమ్య గారూ !

ధన్యవాదాలు

* మరో అజ్ఞాత గారూ !
ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడూ రెండు వుంటాయి. నేను ప్రముఖులలో వారిని ఆ స్థాయికి చేర్చిన, సమాజానికి అవసరమైన ప్రతిభను, మంచిని మాత్రమే చూడగలను. వారి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి అనవసరమైన అంశాలను స్పృశించను. దయచేసి మీరు, ఇతరులు కూడా ఇక్కడ అలాంటి విషయాలు ప్రస్తావించకుండా వుంటే మంచిది. అదీ.... అజ్ఞాతగా అసలు రాయవద్దని మనవి.

Rajendra Devarapalli said...

రావు గారు,బ్రహ్మాండమైన పాట ఎంపిక చేసారు.

SRRao said...

రాజేంద్రకుమార్ గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం