Friday, November 12, 2010

జారిపోయిన జంట కవిత్వం

తెలుగు సాహితీ సంపద పెరుగుదలకు ఎందఱో సాహితీవేత్తలు, కవులు తమ వంతు కృషి చేశారు. వారిలో కొంతమంది జంట కవులు కూడా వున్నారు. వారిలో కొప్పరపు కవులు, తిరుపతివెంకట కవులు.... ఇలా ఎన్నో జంటలు విడివిడిగానే కాక జంటకవులుగా ప్రసిద్ధులు.


ఒకసారి ప్రముఖ కవులు దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు, గుర్రం జాషువా గారు కలసి జంటగా కవిత్వం చెప్పాలని సంకల్పించారు. ఇతర జంట కవుల్లాగే తమ పేర్లు కలసివచ్చేలాగా తమ జంటకు ఒక పేరు పెట్టుకోవాలని ఆలోచించారు. ఎంత ఆలోచించినా వీరికి తమ పేర్లలోనుంచి సరిపోయే పేరు దొరకలేదు. ఏ రకంగా చూసినా పిచ్చి జాషువా అనో , జాషువా పిచ్చి అనో, దీపాల గుర్రం అనో ...... ఇలా ఏదో పెట్టుకోవాల్సి వస్తోంది. ఎంత కసరత్తు చేసినా తమ పేర్లతో కుదిరే కుదురైన అందమైన పేరు దోరక్క చివరికి జంటగా కవిత్వాన్ని చెప్పే ఆలోచనే విరమించుకున్నారట. దాంతో మరో కవుల జంట తెలుగు సాహిత్యం చేజారిపోయింది.  


Vol. No. 02 Pub. No. 054

3 comments:

జయ said...

పాపం:) గమ్మత్తుగా ఉందండి.

SRRao said...

జయ గారూ !
ధన్యవాదాలు

Saahitya Abhimaani said...

"...ఎంత కసరత్తు చేసినా తమ పేర్లతో కుదిరే కుదురైన అందమైన పేరు దోరక్క చివరికి జంటగా కవిత్వాన్ని చెప్పే ఆలోచనే విరమించుకున్నారట..."

మరీ అన్యాయం కాకపొతే, "జాషువా శాస్త్రి" అన్నపేరుతో వాళ్ళు జంట కవిత్వం చెప్పిం ఉంటే బాగుండేది. అంతటి కవులకు పేరు పెట్టుకోవటమే కష్టం అయ్యి ఉంటుందా!! ఇదేదో జోకుకోసం పుట్టి ఉంటుంది కాని నిజం అయ్యి ఉండదు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం