Sunday, October 17, 2010

నవరాత్రుల విశేషాలు

శారదా / దేవీ నవరాత్రులు ముగుస్తున్నాయనగానే మేం చదువుకునే కాలంలోని కొన్ని జ్ఞాపకాలు బయిటకు వచ్చాయి. అప్పటికే సినిమా రికార్డింగ్ డాన్సులు వగైరాలతో కలుషితమై పద్య నాటకాలు, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళా రూపాలైన తోలుబొమ్మలాటలు, బుర్రకథ, హరికథలు వగైరా కనుమరుగావడం చూసి ఇలాంటి ఉత్సవాల్లో వాటి పునరుద్ధరణకు మా వంతు కృషిగా 70 వ దశకంలో చేసిన ప్రయత్నంతో బాటు అప్పట్లో ఉత్సవాల తీరుతెన్నుల గురించి, నా అనుభవాల గురించి  వివరిస్తూ రాసిన
 శారదా / దేవీ నవరాత్రులు  
 నా స్వ'గతం'  పేజీలో చదవండి. ఆ పేజీలో ఈ అంశం కోసం చివరి వరకూ వెళ్ళవలసి వుంటుంది.

Vol. No. 02 Pub. No. 038

3 comments:

astrojoyd said...

చివరివరకు వెళ్లి మీ స్వగతం తెరిచిచూస్తే అది సూన్యమ్గా ఉంది కనుక మీకు ఆ స్వగతం లేదన్కున్తున్నాను.

Vinay Datta said...

It's nice to read your experiences as a young organizer of programmes during Dussehra festival. I was surprised to note' prathishthaapana muhurtham'. I doubt if organizers still continue this. The surname 'koochi' of one of the artists sounds familiar. I think a famous artist with that name draws wonderful pictures in the background of Annamacharya Krithis in TTD channel.

SRRao said...

* astrojoyd గారూ !
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. నాకు ఆ స్వగతం శూన్యం కాదండీ ! మీకు స్వ' గతం ' పేజీ తెరుచుకోలేదా ? తెరుచుకున్నా శూన్యంగా కనబడిందా ? అర్థం కాలేదు. వివరంగా రాస్తే సాంకేతికంగా ఏదైనా సమస్య వుంటే సరిదిద్దుకుంటాను. అయినా మాధురిగారి వ్యాఖ్య చూసాక మీకు అర్థమై ఉండవచ్చు, ఆ స్వగతం శూన్యం కాదని.

* మాధురి గారూ !
మంచి విషయాన్ని అడిగారు. మేము ఆ ఉత్సవాలకు శాశ్వతత్వం కల్పించాలనే సంకల్పంతోనే ఆరంభించి అలా ప్రచురించాం. అయితే తరువాత మా కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా పెద్ద్దలు వారించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది.
'కూచి' పేరు విషయంలో మీరు చెప్పింది నిజమే ! ఆ కరపత్రంలో వున్న కూచి వీరభద్రశర్మ భాగవతార్ గారు చిత్రకారుడు కూచి కి తండ్రిగారు. ఆయన అప్పట్లో చాలా ప్రసిద్ధి చెందిన హరికథకులు. మా కుటుంబానికి, ఆ కుటుంబంతో విడదియ్యలేని ఆత్మీయబంధముంది. ఈ సందర్భంగా ఆయన ఆ ఉత్సవాలలో నాకిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. ఆ సమయంలో తీరిక లేకుండా వున్నా నాకోసం మా ఉత్సవాల్లో కథ చెప్పడానికి ఒప్పుకుని ప్రారంభించేందుకు స్టేజి ఎక్కబోతూ ' ఇంత చక్కగా నిర్వహిస్తున్నావు, చాలా ఆనందంగా వుంది. నాకు హరికథ చెప్పినందుకు తాంబూలం మాత్రం ఇయ్యి. అంతకుమించి ధన రూపంలో ఇంకేమీ ఇవ్వవద్దు ' అన్నారు. అప్పటి మా కార్యక్రమాలలో ఆయనదే పెద్ద మొత్తంగా భావించాం. కానీ ఆయన మాటే మాకు పెద్ద ఆశీస్సులు అయ్యాయి. గత జూన్ లో మాటీవీ నాద వినోదం కార్యక్రమంలో కూచి విన్యాసం గురించి ' కుంచె కూచి విలాసం ' పేరుతో టపా రాసాను. మీరు వ్యాఖ్య కూడా రాసారు.
ఇంత నిశితంగా గమనించి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం