Friday, October 8, 2010

నెహ్రూజీ డూప్ - జవాబు

కనుక్కోండి చూద్దాం - 28 - జవాబు


జవాబు : నెహ్రుజీ కి డూప్ లా భ్రమింపజేసిన వ్యక్తి


అయితే ఆయన ఫోటో బ్లాగర్ లో అప్లోడ్ కాకపోవడంతో పికాస ద్వారా ప్రయత్నించగా పేరు మార్చిన ఫైల్ కాకుండా అసలు ఫైల్ అప్లోడ్ అయి ఆ ఫైల్ పేరు పేకేటి గా తెలుస్తోందనే అభిప్రాయాన్ని మాగంటి వంశీమోహన్ గారు వ్యక్తం చేశారు.  శివగారు పేకేటి గారి పూర్తి పేరు రాసారు. ఇక జే.బీ. గారి కోరిక మేరకు పేకేటి గారి వివరాలు ......


పేకేటి గా గత తరం ప్రేక్షకులకు సుపరిచుతులైన పేకేటి శివరాం అసలు పేరు పేకేటి శివరామ సుబ్బారావు. తూర్పు గోదావరి జిల్లా పేకేరు గ్రామంలో 1918 అక్టోబర్ 8 వ తేదీన జన్మించిన శివరాం బి.ఏ. పాసయి ఎస్. ఆర్. సుబ్బారావు పేరుతో , ముఠా, ఉదయగిరి, కస్తూరి అనే కలం పేర్లతో రచనలు చేశారు. హార్మోనియం, జలతరంగిణి వాద్యాలు నేర్చుకున్నారు.

1940 వ దశకంలోనే తెలుగు చిత్రసీమలో ప్రవేశించి ప్రొడక్షన్ అసిస్టెంట్ నుంచి దర్శకత్వం దాకా అన్ని శాఖలను నిర్వహించారు. 1944 లో ఘంటసాల బలరామయ్య గారి ప్రతిభా ప్రొడక్షన్స్ లో పబ్లిసిటీ మేనేజర్ గా పనిచేసే సమయంలో ' సీతారామ జననం ' చిత్రంలో నటించడానికి వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు కి మంచి మిత్రుడయ్యారు. అక్కినేని సినీ జీవిత చరిత్రలో పేకేటిది ఒక అధ్యాయం. అక్కినేని జీవితంలో అన్ని ముఖ్యమైన ఘట్టాలకు పేకేటి సాక్షి. వారి మైత్రి చిరకాలం కొనసాగింది.

పేకేటి కొంతకాలం ఫైర్ ఆఫీసర్ గా పని చేశారు. ఇండియన్ న్యూస్ సర్వీసు లో కెమెరామన్ గా కూడా పని చేశారు.

పేకేటి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించారు. ఆయన నట జీవితంలో చెరిగిపోని ముద్ర వేసిన పాత్ర అక్కినేని ' దేవదాసు ' చిత్రంలోని దేవదాసు మిత్రుడు భగవాన్. ఆ పాత్ర ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. దేవదాసు చూసిన ప్రేక్షకులు అక్కినేనిని ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారో, భగవాన్ పాత్రలో పేకేటిని కూడా అంత బాగానూ గుర్తుంచుకున్నారు.

పేకేటి తెలుగులో చుట్టరికాలు, భలే అబ్బాయిలు, కులగౌరవం, కన్నడంలో మరికొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2002 లో హెచ్. ఎం. రెడ్డి పురస్కారం అందుకున్నారు.

ప్రముఖ కళా దర్శకుడు పేకేటి రంగా ఆయన పుత్రుడు. తమిళంలో ప్రముఖ హీరో ప్రశాంత్ పేకేటి శివరాం మనుమడు.

ఈరోజు పేకేటి శివరాం జన్మదినం సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ......


Vol. No. 02 Pub. No. 033a

4 comments:

శివ said...

రావుగారూ. ఘంటసాలగారి చేత మొట్టమొదటి పాటను రికార్డింగు చేయించింది కూడ పేకేటి శివరాం గారే అనుకుంటాను. అప్పుడు పేకేటి హెచ్ ఎం వీ లో పనిచేసేవారుట! మీకు తెలిసిన విశేషాలు చెప్పగలరు.

JB - జేబి said...

అడగ్గానే వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.

SRRao said...

* శివ గారూ !
ధన్యవాదాలు. గత ౧౮ రోజులుగా ఇంటర్నెట్ సరిగా పని చెయ్యకపోవడం వల్ల మీ వ్యాఖ్యకు స్పందించడం, కొత్త టపాలు ప్రచురించడం చెయ్యలేకపోయాను. మధ్యలో పనిచేసినపుడు పట్టుకుని ఒక టపా మాత్రమే ప్రచురించగలిగాను. జరిగిన ఆలస్యానికి క్షంతవ్యుణ్ణి. నాకు తెలిసిన వివరాలు త్వరలో తెలియజేస్తాను.
* జే. బి. గారూ !
ధన్యవాదాలు.

Ramalingaswamy Gumma said...

నెహ్రుజీ డూప్ పేకేటి శివరాం

ఒకనాటి సకల విద్యా పారంగతుడు పకేటి శివరాం గురించివ్రాసిన వివరాలు చాలామందికి తెలియనివి. మంచి విషయాలు వ్రాసారు. సినీరంగంలో అలనే చాలమంది చిన్న నటీనటులు కళాకారులు చాలామంది ఉనారు వారిని గూర్చి ఇలాంటి వ్యాసాలు వ్రాస్థే బాగుంటుంది.

25/07/2013 గుమ్మా రామలింగ స్వామి

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం