Tuesday, September 7, 2010

ముచ్చటగా మూడు ....? - జవాబులు

   కనుక్కోండి చూద్దాం - 26 

జవాబులు


1. ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి ( ప్రముఖ రచయత ఆరుద్ర గారి
సతీమణి ) సంభాషణలు రాసిన ఒకే ఒక చిత్రం ఏది ?

జవాబు : అభిమానవతి ( 1975 ) ; కృష్ణ హీరో 





2. తెలుగులో తొలి ' పెద్దలకు మాత్రమే '           
( A సర్టిఫికేట్ ) చిత్రమేది ?

జవాబు : అక్కినేని నటించిన ' మనుషులు-మమతలు ' ( 1965 ) 




3. అందాల నటుడు శోభన్ బాబు ఆడ వేషంలో కనిపించిన చిత్రమేది ?
ఏ పాత్రలో ?


జవాబు : ' కలసిన మనసులు ' ( 1968 ). ఇందులో ఓ అంతర్నాటకంలో శోభన్ బాబు రాధ వేషంలో, హీరోయిన్ భారతి కృష్ణుడి వేషంలో కనిపిస్తారు.


Vol. No. 02 Pub. No. 020a

3 comments:

జ్యోతి said...

ఇందులో ఒక్క సినిమా పేరు కూడా విన్న గుర్తు లేదు. రావుగారు కాస్త వీజీగా ఉండే ప్రశ్నలు ఇవ్వండి..

manavaani said...

^ జ్యోతిగారూ ప్రశ్నలు అడగటం, సమాధానాలు పొందటం ఇక్కడ లక్ష్యం కాదు. పాఠకుల పరిజ్ఞానాన్ని పరీక్షించడం , మీకు తెలియనిది నాకు తెలుసునని చెప్పుకోవడం కూడా ఈ బ్లాగు ఉద్దేశ్యం కాదు.

ప్రశ్నలకి సమాధానాలని తెలుసుకునే ప్రయత్నంలో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం సాధారణంగా జరుగుతుంది. ఇది ఇక్కడ ప్రధాన ఉద్దేశ్యమని గమనించ ప్రార్ధన

SRRao said...

* జ్యోతి గారూ !
నిజానికి ఈ సినిమాలు అంత పాత తెలుగు చిత్రాల మీద అవగాహన వున్న ప్రేక్షకులకు తెలియనివి కాదు. అభిమానవతి, కలిసిన మనసులు సూపర్ హిట్ కాకపోయినా సుమారుగా ఆడినవే ! వాటిలోని పాటలు మరచిపోలేనివి. అప్పట్లో సినీ సంగీత ప్రియులను అలరించినవే ! ఇక మనుషులు- మమతలు మీరు వినలేదంటే నేను నమ్మను. సమయానికి గుర్తుకు రాకపోయి వుండవచ్చు. జవాబులతో పాటు మరికొన్ని వివరాలు ఇచ్చి వుండవలసింది. అందుకే ఇప్పుడు మరో టపా రాశాను. చూడండి.

* ' మనవాణి ' గారూ !
నా బ్లాగులో క్విజ్ వెనుక వున్న వుద్దేశ్యాన్ని చక్కగా అర్థం చేసుకుని , వివరించినందుకు కృతజ్ఞతలు. నాకు తెలిసిన వివరాలకు మిత్రులు మరిన్ని కలిపి అందిస్తారనే ఉద్దేశ్యంతో, జ్ఞాపకాల పొరల్లో మరుగున పడిపోయిన విశేషాలను వెలికి తియ్యడానికి క్విజ్ రూపంలో అయితే ఆసక్తి కలిగిస్తుందనే ఆలోచనతో ఇలా ఇస్తున్నాను. ఇప్పటికే అప్పుడప్పుడు మిత్రులు వీటికి జవాబులతో బాటు మరింత సమాచారం అందిస్తున్నారు. దానివలన సమాచార మార్పిడి జరుగుతోంది. నేను ఈ బ్లాగు ద్వారా ఆశిస్తున్నది కూడా అదే ! నిజానికి ఈ విషయాన్ని మీరు చక్కగా గ్రహించి వివరించినా నా వంతుగా నేను కూడా వివరిస్తున్నాను. నా బ్లాగు తరఫున మీ వివరణకు ధన్యవాదాలు. మీ వివరాలు తెలియజేస్తే సంతోషిస్తాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం