Wednesday, July 28, 2010

హాస్యాస్పదం





సున్నితమైన హాస్యం, వ్యంగ్యం అణువణువునా తొణికసలాడే సంభాషణలతో తెలుగు సినిమా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన రచయిత డి.వి. నరసరాజు గారు. సన్మానాలు, బిరుదులపై ఆయన విసిరిన ఓ ఛలోక్తి ............



ఒకప్పుడు ఒకానొక ' కళాసమితి ' వారు నాకు సన్మానం చేస్తామని వచ్చారు.
సన్మానంతో బాటు బిరుదు కూడా  ఇవ్వదలచుకున్నామని చెప్పారు.

" ఏం బిరుదు ఇస్తారు ? " అని అడిగాను. 

" మీరు హాస్యం బాగా రాస్తారుగనుక ' హాస్యాస్పదబ్రహ్మ ' అని ఇద్దామనుకున్నాం " అన్నారు.

" ఇప్పుడు ఒంట్లో ఓపిక లేదు. తర్వాత చేయించుకుంటాను సన్మానం " అని పంపేసాను.

' హాస్యం ' , ' హాస్యాస్పదం ' ఈ రెండు పదాలకు తేడాలేదు వారి దృష్టిలో.

మిత్రుల ఇళ్ళకు వెడితే వాళ్లకిచ్చిన సన్మాన పత్రాలు  గోడలకు తగిలించినవి, షో కేసులలో పెట్టివున్నవి తీరిగ్గా చదవడం నాకు ఎంతో ఇష్టం !

వాటిలో ఎంతో ' హాస్యం ' వుంటుంది. ' హాస్యం ' , హాస్యాస్పదం ' లాంటిదే !

Vol. No. 01 Pub. No. 356

3 comments:

Hasini said...

హాస్యాస్పదం ఛలోక్తి చాలా బావుంది.Thank U sir

A K Sastry said...

మా మాజీ/దివంగత మునిసిపల్ చైర్మన్ గారు, "శోచనీయం" స్థానం లో "ముదావహం" అని ప్రయోగించి, పావుగంటలో పదహారు ముదావహాలు వేసినట్టే వుంది!

(చూ:- "క్యామెడీ ఛానెల్"లో నా పాత టపా!)

SRRao said...

* హాసిని గారూ !
* కృష్ణశ్రీ గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం