Tuesday, July 20, 2010

కవిత - నాటిక

 డి.వి. నరసరాజు గారు సంభాషణలు చమత్కారాలు, వ్యంగ్యాలతో నిండి తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. నరసరాజు గారు రాసిన ఒకేఒక పాట " మావూరి గంగ " ( 1975 ) చిత్రంలో వుంది. దాని ట్యూనింగ్ సమయంలో జరిగిన సంఘటన.
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మరో పాట రాయడానికి ఆ సమయంలో రావడం జరిగింది. నరసరాజుగారి కుమార్తె కూడా అప్పుడు అక్కడే వుంది. కృష్ణశాస్త్రి గారికి ఆమెను
" మా అమ్మాయి కవిత " అంటూ పరిచయం చేశారు.
 శాస్త్రి గారు వెంటనే " అదెలా సంభవం ? నేనొప్పుకోను. న్యాయమైతే ఆ అమ్మాయి పేరు నాటిక అని  వుండాలి "  అని రాసారు.
నరసరాజు గారి పాట ట్యూనింగ్ అయిపొయింది. కృష్ణశాస్త్రిగారు పాట విన్నారు.  ఎవరు రాసారని అడిగారు. నరసరాజు గారని చెప్పగానే మళ్ళీ
 " మా అమ్మాయి పేరు కవిత " అన్నారు.
" ఇప్పుడు ఒప్పుకుంటాను " అంటూ ఇంకా ఏదో రాసి కవితకు ఇచ్చారు. అందులో
" మీ నాన్నగారు పాటలు కూడా రాసి మా నోట్లో మట్టి కొట్టేలా వున్నారు " అని వుంది.

Vol. No. 01 Pub. No. 351

3 comments:

A K Sastry said...

డియర్ SRRao గారూ!

రెండు నెలల నించీ మీ బ్లాగు చూస్తూనే వున్నాను కానీ కామెంటు చెయ్యడం తటస్థించలేదు.

అరుదైన ఇలాంటి చెణుకులంటే నాకు చాలా ఇష్టం.

మరిన్ని వ్రాస్తూ వుండండి.

Vinay Datta said...

good 'chenuku'.

SRRao said...

* కృష్ణశ్రీ గారూ !
శిరాకదంబానికి స్వాగతం. మీ అభిమానానికి కృతజ్ఞతలు.

* మాధురి గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం