Wednesday, June 16, 2010

చిరంజీవి ' మల్లాది '


 తెలుగు చిత్ర గీతాలకు సాహితీ పరిమళాలద్దిన రచయిత

తెలుగు సాహితీ లోకంలో కథాసుదలు చిలికన కవితామూర్తి

తెలుగు పలుకుబడులను రచనలలో పొదిగిన మల్లాది రామకృష్ణశాస్త్రి

తెలుగు సాహితీ లోకంలో ఆయనెప్పుడూ చిరంజీవి 




రామకృష్ణశాస్త్రిగారు సముద్రుడికన్నా గొప్పవాడు. తనలో ఎన్నో నిధి నిక్షేపాలున్నా గొప్పవాడినంటూ సముద్రుడిలా ఘోష పెట్టడు. రామకృష్ణశాస్త్రిగారు అగస్త్యుడికన్నా గొప్పవాడు. అగస్త్యుడు సాగరాలను పుక్కిట పట్టి వదిలి పెట్టేశాడు. శాస్త్రిగారు భాషా సముద్రాలను తనలోనే నిలబెట్టుకున్నారు.

............. మల్లాది వారి గురించి ఆరుద్రగారి మాటలవి.

ప్రౌఢ వాక్యాల తెరల మరగున దోబూచులాడీ.....ముగ్ధభావాలతో.......
వన్నెలాడిలా...కన్నేలేడిలా...వయ్యారాలు పోయే తేనె మాటల...
తెలుగు మాటల...రంగుల హోరంగులతో తెలుగువాడి జీవిత
జూమూతాన్ని ఒత్తిగించి....తెల్లని...చక్కని...చిక్కని...
కథాశరశ్చంద్రికలు వెలయించి... పడుచు గుండెలు గుబగుబలాడించి
మనసుకందని అందాలను భాషకు దించి, భాషలో...కైతలో....
బయోస్కోపు స్కోపులో అచ్చరలచ్చల పచ్చ చమత్కారాలు పండించుకుంటూ
అలనాటి పాండురంగ విభుని పదగుంభనలా పాండిబజారు దర్బారులో 
నిలిచి... ఎవరన్నా ! మహానుభావకులు ?
ఓహో ! వచన రచనకు మేస్త్రి 
సాహో ! రామకృష్ణ శాస్త్రి


..................మల్లాది వారి రచనా వైభవాన్ని ముళ్ళపూడి వెంకటరమణ గారు వర్ణించిన విధమది.

మల్లాది రామకృష్ణశాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయన రచనా వైదుష్యానికి మచ్చు తునకలనదగ్గ పాటలు చూడండి.......






Vol. No. 01 Pub. No.323

3 comments:

మాలతి said...

:)) చాలా మంచి పాటలు తెల్లారుతూనే గుర్తు చేశారు. సంతోషమండీ.
- మాలతి

Vinay Datta said...

Read about Malladi in Raavi Kondalarao's book 'black&white'. He's a highly talented man (sometimes a ghost writer for Samudraala senior) with utmost simplicity.

SRRao said...

* మాలతి గారూ !
ధన్యవాదాలండీ !

* మాధురి గారూ !
B & W పత్రికలో వస్తున్నపుడే ఇది చదివినట్లు గుర్తు. గుర్తు చేశారు కనుక ఇప్పుడు నా ఖజానాలో వెదికి పట్టుకుంటాను. సముద్రాల విషయంలో మీరు చెప్పిన విషయం నేను కూడా విన్నాను / చదివాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం