Tuesday, May 25, 2010

మొదటి కృష్ణుడి వివరాలు

 ఈయన పేరు డా. జయసింగ్. 1935 లో వచ్చిన మొదటి ' శ్రీకృష్ణ తులాభారం ' చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర ధరించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ పూర్తిగా మరచిపోయిన ఈ నటుడు నాటకరంగం నుండి వచ్చారు. ఈయన రంగస్థలం మీద కృష్ణుడి పాత్రలే ఎక్కువ ధరించారు.  ఆయన ప్రక్కన చాలా నాటకాల్లో కన్నాంబ నటించింది . మైలవరం జమీందారుకు చెందిన ' బాలభారతి ' సమాజంలో చేరి అనేక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించారు.
ఆ ' శ్రీకృష్ణ తులాభారం ' చిత్రంలోనే అందాలతార కాంచనమాల, లక్ష్మీరాజ్యం పరిచయమయ్యారు. డా. జయసింగ్ తర్వాత ' భక్త కబీరు' ( భక్త విజయం ) లోను, మరో రెండు బెంగాలి చిత్రాల్లో మాత్రమే నటించారు. ఆయన ప్రధానంగా ఆయుర్వేద వైద్యుడు. తర్వాత కాలంలో నాటకరంగాన్ని వదిలిపెట్టక తన వృత్తి కూడా కొనసాగించారు. కొన్ని ఆయుర్వేద గ్రంథాలు కూడా రచించారు.

కృష్ణుడు ప్రధాన పాత్రలుగా కొన్ని చిత్రాలు - పాత్రధారులు :

1935 - శ్రీకృష్ణ తులాభారం - డా. జయసింగ్
           సతీసక్కుబాయి - దాసరి కోటిరత్నం / తుంగల చలపతిరావు 
           శ్రీకృష్ణలీలలు - సాలూరి రాజేశ్వరరావు ( బాల కృష్ణుడు )
1936 - ద్రౌపదీ మానసంరక్షణ - బందా కనకలింగేశ్వరరావు
           ద్రౌపది వస్త్రాపహరణం - సి.యస్.ఆర్. 
           మాయాబజార్ - ( వివరాలు లభించలేదు ), ఎస్.పి. లక్ష్మణస్వామి - అభిమన్యుడు 
1937 - దశావతారాలు - ( వివరాలు లభించలేదు )
           రుక్మిణీ కళ్యాణం - ( వివరాలు లభించలేదు )
1939 - రాధాకృష్ణ - కృష్ణుడు ( వివరాలు లభించలేదు ), సత్యభామ - స్థానం నరసింహారావు
1942 - సత్యభామ - వై.వి.రావు
1944 - కృష్ణలీల - ( వివరాలు లభించలేదు )
           కృష్ణప్రేమ - జి.వి.రావు
1954 - సతీ సక్కుబాయి - ( వివరాలు లభించలేదు )
1955 - శ్రీకృష్ణ తులాభారం - కె.( ఈలపాట ) రఘురామయ్య
1957 - మాయాబజార్ - నందమూరి తారకరామారావు

ఇవికాక కృష్ణుడి పాత్రకు అంతగా ప్రాధాన్యతలేని చిత్రాలు కొన్ని వచ్చాయి. అందుచేత ఎన్టీ రామారావు ఎన్నో కృష్ణుడో కచ్చితంగా చెప్పడం కష్టమైనా ప్రధాన పాత్రలను తీసుకుంటే మాత్రం సుమారుగా 13 వ కృష్ణుడని చెప్పుకోవచ్చు.
1957 మాయాబజార్ తర్వాత కొంతకాలం పౌరాణికాలు ఎక్కువగానే వచ్చాయి. కృష్ణుడి పాత్రలు ఎక్కువగా ఎన్టీ రామారావు పోషించారు. 
శ్రీకృష్ణ తులాభారం చిత్రాల విషయానికొస్తే మాత్రం ఆయన మూడో కృష్ణుడు. మొదటిది 1935 లో డా, జయసింగ్ నటించినదయితే, రెండవది 1955 లో ఈలపాట రఘురామయ్యది. ఇక మూడవది 1965 లో ఎన్టీ రామారావు నటించినది.

వివరాలు లభించినంతవరకూ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా నాకు లభించని వివరాలు తెలిస్తే చెప్పగలరు.

Vol. No. 01 Pub. No.298

10 comments:

జయ said...

ఇంతకి మించి ఇంకా వివరాలు ఉంటాయంటారా. మొత్తానికి కృష్ణుడి వివరాలు చాలా సేకరించారు. చాలామటుకు కొత్త సమాచారమే.

కొత్త పాళీ said...

Interesting

SRRao said...

* జయ గారూ !
ఉన్నాయి కదండీ ! వీటిలో కొన్నైనా నా ఖజనాలోనే వున్నట్లు గుర్తు. కానీ సమయానికి ఎక్కడున్నాయో గుర్తుకు రాలేదు. అందుకే మిత్రులెవరైనా అందించి పూర్తిచేస్తారేమోనని... ధన్యవాదాలు.

* కొత్తపాళీ గారూ !
ధన్యవాదాలు

Unknown said...

ఇంకొక చెప్పుకోదగ్గ చిత్రం శ్రీకృష్ణరాయబారం (1960). కె.రఘురామయ్య (కృష్ణుడు), రాజనాల (దుర్యోధనుడు), గుమ్మడి (ధర్మరాజు?) వగైరా నటించారు. ఇందులో, నాకు గుర్తున్నంతవరకు 2-3 పాటలు, 60 పైచికులు పద్యాలు ఉన్నాయి. ఘంటసాల మాస్టారు ఆలపించిన కొన్ని పద్యాలు ఈ క్రింది లింకులో వినొచ్చు:

http://www.ghantasala.info/padyaalu/index.html

SRRao said...

కే. కే. గారూ !
మంచి సమాచారమిచ్చారు. ధన్యవాదాలు. నేను ఎన్టీయార్ కృష్ణుడుగా ప్రారంభమైన మాయాబజార్ వరకూ ( శ్రీకృష్ణతులాభారం విషయం తప్ప ) మాత్రమే తీసుకోవడం వలన అన్నీ ప్రస్తావించలేదు.

Nrahamthulla said...

రఘురామయ్య గారు పాడిన కొన్ని పాటలు,పద్యాలు;
* అగ్నిపరీక్ష – 1951
* కోరికలు ఈడేరే విచిత్రముగా - కె.రఘురామయ్య, మాలతి,లక్ష్మీరాజ్యం
* ఓ మనసేమో పల్కనోయీ నీనించి ఏమని - పి.లీల,కె.రఘురామయ్య,
* ఓ పరదేశి ప్రేమవిహారి నీవే నా - మాలతి,కె.రఘురామయ్య
* చింతామణి (1956

•కనరా శ్రీహరి లీలలు కనరా ఈ జగమంతాని మాయాజాలమే •తాపస వృత్తిబూని పృధుశ్చానమొనర్చియు నన్ను చేరగా (పద్యం) •పూజ్యుల ఇంటను పుట్టిన చాలునా బ్రతుకొక్క ధర్మమై(పద్యం) •పసిడి శీలమ్మునమ్మిన పతితవయ్యో పరగానపైనించుక (పద్యం) •భక్తి భావమ్ము తొలుపారు బహుళగతుల ఆత్మచింతన (పద్యం)

* శ్రీకృష్ణమాయ -1958.
* ముక్తి మార్గమును కనలేవా మాయమోహమయ జీవా http://www.youtube.com/watch?v=eynNhMynZ2s
* భాసురమైన ఈ జగతి పాలనకొక్క అదృశ్యశక్తి http://www.youtube.com/watch?v=qJCnLkzIfJg&NR=1
* తరమే జగాన ధాతకునైన తరుణీవిలాసవిమోహము దాట
* శ్రీరామాంజనేయ యుద్ధం –1975
* రామా సుగుణధామా (పద్యం)
* దేవాంతకుడు (1960)

•ఎవని మంత్రము వల్ల హీన కిరాతుండు వాల్మీకిగా మారి (పద్యం) •దేని మహిమచేత దివ్యలోకములన్నీ తిరుగులేక (పద్యం) •పూరయ మమకామం గోపాల..వారం వారం వందన •శ్రీతజనపాలా శ్రీలోలా జరిగేదంతా నీలీల

* శ్రీ కృష్ణ కుచేల – 1961
* ఉషాపరిణయం – 1961
* నాకున్ ముద్దు అనిరుద్దుపై నెపుడు సంతాపంబు (పద్యం)
* దక్షయజ్ఞం -1962
* కానరు నీ మహిమా దేవా గానము చేయ నా తరమా - కె. రఘురామయ్య
* కరుణామూర్తులు మీ త్రిమూర్తులు జగత్‌కల్యాణ (పద్యం) - కె. రఘురామయ్య
* వాల్మీకి – 1963

•ఓం నమోనారాయాణాయ ఓం నమోనారాయాణాయ •తలచినంతనే సకలతాపసములణచి పాపలకైన ( పద్యం) •పరమతారక మంత్రప్రభావమెల్ల వలచుకున్నావు (పద్యం) •హరేనారాయణా పావనా సృష్టిస్ధితిలయ మూలకారణా

* మోహినీ భస్మాసుర - 1966

•ఔనులే ఈ సుఖమే సుఖము శృంగారసీమలో •త్రిజగాల పాలించు దేవుంద్రు ( సంవాద పద్యాలు ) •ముల్లోకంబులనేలు నన్నెరుగక ఏమో పల్కుచున్నావు (పద్యం)

* శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న(1967)
* ఏమి ఈ వింత మోహం http://sirakadambam.blogspot.com/search?q=%E0%B0%B0%E0%B0%98%E0%B1%81%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF
* శ్రీకృష్ణ రాయబారం

1. •అన్నియెడలను నాకు ధీటైనవారు గోపకులు పదివేలు (పద్యం)
2. •అంచ్యుతులైన బంధువులు అందరిముందర చెప్పి నిన్ను (పద్యం)
3. •ఆయుధమున్ ధరింప అని నిక్కముగా ఒకపట్ల ఊరకే సాయం (పద్యం)
4. •ఆలము సేయనేనని యధార్దము పల్కితిసుమ్మి (పద్యం)
5. •ఊరక చూచు చుండుమనుట ఒప్పితిగాని భవధ్రధస్తులన్ (పద్యం)
6. •ఎక్కడినుండి రాక ఇటకు ఎల్లరున్ సుఖులే కదా (పద్యం)
7. • ఏసతి వహ్నిలోన జనియించెను జన్మమొనర్చువేళ (పద్యం)
8. •ఒక్కనిజేసి నన్నిచట ఉక్కడగింప తలంచినావా నే నెక్కడ (పద్యం)
9. •కన్యప్రాయమునందు భాస్కరుని కరుణ పదినెలలు మోసి (పద్యం)
10. •గజనంబులు ధరియించు ధర్మజుడు దివ్యక్షత్రముపట్టు (పద్యం)
11. •చెల్లియో చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్ (పద్యం)
12. •తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులిష్టపడవేనియు (పద్యం)
13. •తనయుల వినిచెదవో ఈ తనయులతొ ఏమియని (పద్యం)
14. •ముందుగ వచ్చితీవు మునుముందుగ అర్జును నేను (పద్యం)
15. •సంతోషంబున సంధి చేయుదురే వస్త్రంబూర్చుచో ద్రౌపతీ (పద్యం)
16. •సేవాధర్మము సూతధర్మమును రాశీభూతమై ఒప్ప (పద్యం)

SRRao said...

రహమతుల్లా గారూ !

చాలా విలువైన సమాచారమిస్తున్నారు. ధన్యవాదాలు. మీ సమాచారమంతా క్రోడీకరించి దానికి వీలైనన్ని ఆడియో, వీడియో క్లిప్పింగ్స్, ఫోటోలు వగైరా జత పరచి త్వరలో ఒక సిరిస్ లో టపాలుగా రాస్తాను. ఇలా వ్యాఖ్యలుగా కంటే టపాలుగా వుంటే ఎక్కువమందికి చేరుతుందనుకుంటాను.

Nrahamthulla said...

రఘురామయ్యగారు పాడిన కొన్ని పద్యాలు ఇక్కడ ఉన్నాయి చూడండి;http://www.hummaa.com/music/artist/K+Raghuramaiah/10395

http://www.andhranatakam.com/Audios.html

.C said...

Yadavalli Nageswara Rao gaaru, who hails from Pedana in Krishna district, played Lord Krishna in 1936 version of "maayaabazaar". And, wasn't it Kalyanam (eelapaaTa) Raghuramayya who played the role in the 1954 version of "satii sakkubaayi"?

Some more info:
* 1935 version is titled "sakkubaayi" and not "satii sakkubaayi".
* "kRshNaprEma" and "kRshNaleela" were both released in 1943.
* The 1937 film was titled "daSaavataaramulu" and not "daSaavataaraalu".
* I am not sure who played Lord Krishna in the film, but a film titled "meeraabaayi" was released in 1940.
* Similarly, I don't know cast details but a film titled "kuchEla" was released in 1935.
* I don't have any details of the story or anything but 1937 had three more films that probably had Lord Krishna in a prominent role: "tukaaraam", "naranaaraayaNa", and "vipranaaraayaNa".

Ennela said...

టైం మిషన్లో బోల్డు దూరం వెనకెళ్ళినట్టుంది...హ్యాప్పీగా

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం